14 వ ప్రకరణము: అంతట, “నాగమణీ ! నాగమణీ!” అని ఎవరో తలుపు తట్టారు. ఆ కంఠ ధ్వని అందరికీ సుపరిచితమే! ఆమె రాజకాళి అని అందరికిని తెలిసింది. ఆ సభలో చాలామందికి రాజకాళి పైన పూజ్య భావం ఉంది. నిశుంభువుని అనుజ్ఞ పొంది, జంభుడు తలుపు తీసాడు. రాజకాళి లోపల ప్రవేశించింది. పర్ణినిచే అమర్చ బడిన ప్రత్యెక ఆసనం మీద కూర్చొని ఆ కూటాన్ని ఛందోబద్ద వాణితో ఈ విధంగా ప్రశ్నించింది రాజకాళి. “రాణి లీలావతి రాజ్యము చేయ / కోణము నందేమి కూయుచున్నారు? మన పక్షపు రథంబు మహిమతో భువిని / చనినట్లుగా నేమి చేయనున్నారు?” “అమ్మా! ఆ ఉపాయాన్ని మీరే ఉపదేశించాలి.” అన్నాడు శివకీర్తి. రాజకాళి చందోబద్ధ వాణితో --- “భూజనుల హితంబు బుద్ధిచే కోరి / రాజమ్మ యోచించే రాజకీయముల వాటిలో నున్నవి బాటలు నాల్గు / సూటిగా నున్నది సుమ్ము నా బాట, మీ బాట నున్నది మితిలేని మబ్బు / మా బాట నున్నది మరి జారు బురద, మీ బాట మితిలేక మింటికి నెగయు / మా బాట మతి లేక మంటిలో కలియ