17 వ ప్రకరణం:
కాలనాథుని సాక్ష్యాన్ని బట్టి శివదత్తుని తీర్పు ఉంటుందని ఉభయ పక్షాలూ (బ్రాహ్మణులు, నాగులు) అనుమానించారు.
బుధవారం నాటి మధ్యాహ్నం భోజనానంతరం దండనాయక పింగాక్షుడు, చంద్రసేన నాగేంద్రుడు, సహస్రపతి బలభద్రుడు, తన కృత్రిమ పుత్రుడైన నీలునితో కలసి కౌళిక సులోచనుడు, కాలనాథుని ఇంటికి వచ్చారు. వీరిలో పింగాక్షుడు జన్మ శోధనలో కాలనాథునికి మిక్కిలి సహాయం చేశాడు. అతడే ముందుగా మాట్లాడాడు. “మిత్రుడా! బయలుదేరిన శ్యామల శ్రీకాకుళం చేరలేదు! కృష్ణలో మునిగిన తల్లి, పిల్లడు వేరే బ్రాహ్మణ కుటుంబం వారని తెలిసింది! ఇంద్రతీర్థంలో చనిపోయింది శ్యామల అని అనుటకు ఇది చాలదా? అందుచే నీవు సులోచన పుత్రుడవని అనుట సందేహం లేని విషయం! బ్రాహ్మణత్వమే కాదు, దేవత్వం వచ్చినా నీవు చలించవన్న మాట నాకు తెలుసు. ప్రాడ్వివాక శివదత్తుడు తన తీర్పు భారాన్ని నీపైన వేశాడు! నీ అంతరాత్మ ఏమి చెప్పునో అని ఆంద్ర రాష్ట్రం లోని నాగజాతి అంతా నీ వైపు గాఢమైన ఆశతో చూస్తోంది!”
“నా అంతః కరణ ప్రీతి నీవు నా పుత్రుడవనే సాక్ష్యం ఇస్తోంది! పరిశుద్ధమైన నీ అంతరాత్మపై నాకు నమ్మకం ఉంది! అయినప్పటికిని నీకు ఒక సంగతి చెప్పడానికి ఇప్పుడు వచ్చాను. ప్రాడ్వివాకుని తీర్పు నాకు అనుకూలంగా ఉన్న పక్షంలో నీవు ఇళ్లు కొన్న సొమ్మును, కాశ్యప సుదర్శనుని ఆస్తిలో నీకు సంక్రమించిన మూల ధనాన్ని నేను కుమారి ధరణికి అచ్చుకొంటాను ! నీవు నా పుత్రుడవయి ఉండి సుదర్శునుని సొత్తు తిన వలసిన సందర్భాన్ని రానివ్వను!” అని చాల వాత్సల్య పూరిత దృక్కులతో చెప్పాడు సులోచనుడు.
“సోదరా! నా ఆయస భుజాలకు నీ సౌవర్ణ భుజాలు తోడయినప్పుడు మన అన్న దమ్ములకు ఈ ప్రపంచంలో ఎదురు ఉండదు.”అని గర్వంగా చెప్పాడు నీలుడు.
“మిత్రుడా! నాగుల అదృష్టమంతా సత్యమైన నీ సాక్ష్యం పైన ఆధార పడిఉంది!” అని వక్కాణించాడు బలభద్రుడు.
“కాలనాథ బాబూ! ప్రాడ్వివాక శివదత్తుని తీర్పు మా నాగులకు అనుకూలమైనప్పుడు నా కొమారితె పర్ణినిని లక్ష వరాల కట్నంతో నీకు సమర్పించు కోవడానికి సిద్ధంగా ఉన్నాను! ఆంద్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోని నాగ కన్యలలో నా కూతురు అన్ని విధాల శ్రేష్టురాలని నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! షడ్జమ మధ్యమ గ్రామములందే గాక, గాంధర్వ గ్రామంలో కూడ నా పిల్ల సంగీతం గోచరిస్తుంది! ఎందఱో వీర ధన సంపన్నులైన నాగ యువకులు ఆమె పాణికై తహ తహలాడుచున్నారు! నీ అంతరాత్మ కౌళిక సులోచనుని పుత్రుని గానే చెప్పినప్పుడు నీకు పర్ణిని పాణి సులభమవుతుంది! ” అని చెప్పాడు చంద్రసేన నాగేంద్రుడు.
వీరందరి మాటలను మౌనంగా విని కాలనాథుడు “మిత్రులారా! నేను సాక్ష్యం చెప్పినప్పుడు నా అంతరాత్మకు తోచిన సత్యాన్ని చెబుతానే గాని, బ్రాహ్మణత్వానికి గాని, వేరు ఫలాన్ని ఉద్దేశించి గాని, కూత సాక్ష్యాన్ని ఈయనని మీరందరూ నమ్మ వచ్చును!” అని నిదానంగా చెప్పి వారినందరినీ పంపించి వేశాడు.
వారందరూ వెళ్ళిన తరువాత ప్రమతి వచ్చి, “నాయనా! నీ అంతరాత్మ చెప్పిన విధంగా నీవు సాక్ష్యం ఇచ్చే విషయంలో నేను జోక్యం కలుగ చేసుకోను! ప్రాడ్వివాక శివదత్తుని తీర్పు మా అన్నయ్యకు ప్రతికూలంగా ఉంటే నేను నీకు చేసిన బ్రాహ్మణ జాత్యుచిత కర్మలన్నీ తుడిచి పెట్టుకొని పోతాయి! అందుచేత బ్రాహ్మణాచారాన్ని బట్టి , నీవు సుదర్శన దంపతులకు యథావిధిగా పార్వ ణ శ్రాద్ధ విధి నిలిపివేయ వలసి వస్తుంది! అయినా కేవలం సకల్ప విధానాన్ని అనుసరించి నామ శ్రాద్దాన్ని మాత్రం చేయవచ్చును! నిన్ను పెంచిన తల్లి ఆదేశం ప్రకారం నీకు ఇచ్చిన ఆస్తిని నీవు ధరణికి తిరిగి ఇవ్వవలసిన అవసరం లేదు! ఇంత మాత్రమే నేను హెచ్చరిం చడానికి వచ్చాను! భగవంతుడు నీకు ఇతోధిక వృద్ధిని చేకూర్చును గాక!” అని వెళ్లి పోయాడు.
కాలనాథుడు ఒంటరిగా కూర్చొని తర్కించు కొవడం మొదలుపెట్టాడు. అనుమాన బలం సులోచనుని ప్రక్కకు లాగుతోంది! ప్రీతి భావనా జన్యంగా కనబడుతూంది గాని, సహజంగా కనబడడం లేదు ఈ తర్కంలో కాలనాథునికి చంద్రసేన నాగేంద్రుని కన్యాదాన ప్రతిజ్ఞ స్మృతి పథంలో మెదలింది! ఆ సంబంధంగా చూస్తే, చాల లాభదాయకం, మిక్కిలి సౌఖ్యవంతం! పర్ణిని అనేమేష గంధర్వాంగన ! నాగ కులంలో పుట్టిన ఉత్తమోత్తమ వజ్రం. భూమికి శాప వశంచే వచ్చిన అప్సరస. ప్రాణంతో సంచరించు పంచబాణుని రత్న పాంచాలిక. మహా వీరాంగన! ఆమె వాణి సర్వోత్క్రుష్టమని రాజకాళి మెచ్చుకొంది. తాను అనేక పర్యాయాలు ఆమెను చూశాడు. పైన చెప్పినవన్నీ నిజమని అతని కండ్లు సాక్ష్యమిస్తున్నాయి! ఆమెని చూసి, ‘ఈ కన్యక సత్యప్రభా, రథినులతో సమాన సుందరి’ అని తాను మనసు లోనే శ్లాఘించిన రోజులున్నాయి! తాననేక పర్యాయాలు ఆమె పాటలు విని ఉన్నాడు, ఆనందించాడు. ఆమె తన కోమల హస్తాన్ని చాచి, ‘నాగ కులంలో చేరు, నన్ను చేపట్టి స్వర్గ సుఖాన్ని అనుభవించు!’అని తనను ఆహ్వానిస్తున్నట్లు తలంచాడు, త్రుళ్ళి పడ్డాడు! వాణి మనస్సాక్షి అడ్డు వచ్చి వాణి హృదయంలో ప్రవేశించి తాత్కాల మలినోద్దేశాన్ని వెనక్కు నెట్టింది! ‘నీవు ఇట్టి సమయంలో ఆశలకు భావి సుఖాలకు లొంగి పోవదద! ఏది సత్యంగా తోస్తుందో దానినే ఉద్ఘాటించు’ అని తన లోపల ఏదో ధ్వని వినిపించింది. ఆ భావ కోలాహలం లోంచి తేరుకొన్నాడు ధీరవరుడు కాలనాథుడు.
ఆ సమయంలో ఒక మనిషి లోపలి వచ్చి, అతని చేతికి కొన్ని పత్రాలు ఇచ్చి మారు మాట్లాడకుండా వెళ్లి పోయాడు. దాన్ని విప్పి కాలనాథుడు చదువుకొన్నాడు.
“ప్రియ సఖుడా!
మహాన్యాయ స్థానం నుండి నేకు సాక్ష్య సూచక పత్రం వచ్చినప్పటి పిమ్మట కొందరు నాగ ప్రముఖులు నీ దగ్గరకు వచ్చి ఏమోమో చెప్పి వెళ్ళారని తెలిసింది. స్వయంగాను, స్వతంత్రంగాను ఆలోచించుకొని నీ అంతరాత్మ నిర్ణయాన్ని సాక్ష్యంగా చెప్పవలసిన విషయంలో పరులు జోక్యం చేసుకోవడం చాలా శోచనీయం! కాబట్టే బ్రాహ్మణ యువకులలో నుండి ఎవ్వరూ ఈ రోజున నీ దగ్గరకు రాకుండా మేమందరం కట్టుబాటు చేసుకొన్నాము! మా ప్రతిపక్షులు తమ ప్రచారాన్ని నిర్భయంగా చేసినందున మేము ఊరకున్నచో మా పక్షానికి నష్టం వాటిల్లుతుందనే భయంతో మౌనంగా ఉండజాలక ఈ జాబు వ్రాయుచున్నాము. నగరపాల ఘనేంద్రుడు ఇట్టి పరిస్థితిలో కూడ మౌనంగా ఉండమని చెప్పాడు. కాని మాకు ఉండబట్ట లేదు! నీవు సాక్ష్యం చెప్పేటప్పుడు ముఖ్యంగా గమనించ వలసినవి రెండు విషయాలని మేము సూచించుచున్నాము. మొదటిది – శతపతి కౌళిక సులోచనుడు జనకుడేనా కాదా, ఆ విషయంలో నీ అంతరాత్మలో ఎ మాత్రం సంకోచం తల చూసినా, దాని ఫలితం నీవు ఇప్పుడున్న జాతికే చెందాలి! రెండవది – బాహ్యానుమాన సామాగ్రిపై ఆధారపడకుండా నీ మనస్సు లోని భావాన్నే లోతుగా గమనించాలి! బాల్యం నుండి నీకును, మాకును గల పరస్పర ప్రేమానుబంధంచే సాహసించి ఈ జాబును వ్రాస్తున్నాము.”
కుమార కౌండిన్య శక్తి ధరుడు వ్రాలు ; నగరపాల భారద్వాజ ఘనేంద్రుడు వ్రాలు; శతపతి ఆంగీరస మల్లికార్జునుడు వ్రాలు; శతపతి వాత్సాయన విష్ణుశర్మ వ్రాలు;
కాలనాథుడు జాబు చదివి ముగించి తన అంతః కరణలో ప్రవేశించి పరీక్షించ నారంభించాడు!ఇంతలో అతనికి కిటికీ సందులోనుండి ‘రాజకాళమ్మ’ పాటలు వినిపించాయి!
“ వంచకులగు వారి వచనము వినక / పెంచిన వారికి పిండము పెట్టు! ఇల ప్రాణముల తోడ నిటునటు తిరుగ / నిలిపిన ఘను పేరు నిలబెట్ట వలయు!
పుట్టకు పుట్టునా పురుహూత ధనువు / గుట్టకు పుట్టునా కోక బాంధవుడు! శునకి నక్కను కూడి కనునె సింగమును / పెను సర్పమున కెట్లు పెదజోగి పుట్టు?
కుక్క కుక్కను కూడి కులములో కలిసె / నక్క నక్కను కూడి నాడులో వెలసె! మాయల మల్లియౌ మహిళామ తల్లి / కాయంబులో నుండి కడలి వచ్చితివి!
కయ్యాల భామయౌ దయ్యాల రాణి / ఉయ్యాలలో నుండి ఊడి వచ్చితివి! భువి తిరుగాడేడు భూతాల సాని / చవిగల ఒడినుండి జారి వచ్చితివి!
ఉపమింపగా రాని ఉద్ధత నారి / విపుల వక్షోవాటి విడిచి వచ్చితివి! పారవేసిన తల్లి ఫలమెట్లు తినును ? పారుని రక్షను పాలింపు మయ్య!”
కాలనాథుడు తానిదివరలో కనిపెట్టిన అనుమానిక సామగ్రీ వాదం పటాపంచలు అయింది! ఆ పాటల లోని పూర్వ భాగం అతనికి అర్థమయింది. రాజకాళి ఉన్మాదం వేషమనిన్నీ, ఆమె ఒక మహా యోగిని అనిన్నీ విశ్వసించే వారిలో కాలనాథుడు ఒకడు. ఆమె ఉద్దేశ పూర్వకం గానే తనకు అర్థమయేటట్లు సమయోచితంగా ఉపదేశం కావించిందని తలచాడు. మొదటి ద్విపద చంద్రసేన నాగేంద్రుని కన్యాదాన ప్రతిజ్ఞలో వంచన ఉందని చెబుతూంది! మూడవ ద్విపద తాను శ్యామలా సులోచనుల పుత్రుడు కాడని ఉద్ఘాటిస్తోంది! నాలుగవ ద్విపద చచ్చిన స్త్రీ తన తల్లి కాదని స్పష్ట పరుస్తోంది! ఐదవ ద్విపద శ్యామలపై అపరాధాన్ని ఆరోపిస్తోంది! శ్యామల చనిపోయిన స్త్రీ కాదని దాని అంతరార్థం! తరువాతి ద్విపదలు తన తల్లిని గురించి విచిత్ర సంగతులను తెలుపుతున్నాయి!
కాలనాథునికి అసలు విషయం తిరిగి అంధకారంలో పడింది. అప్పుడు అతని మనస్సాక్షి ఉచ్చ స్వరంతో ఇట్లు పలికింది. ‘ కౌళిక సులోచనుడు ఎంత మాత్రమూ నీ జనకుడు కాడు! నీవు ఇంకా పరిశోధన చేసి నీ అసలు తల్లి తండ్రులను తెలుసుకొనుము’ అని!
18 వ ప్రకరణము:
గురువారం పూర్వా హ్ణంలో ప్రాడ్వివాక శివదత్తునిచే కాలనాథుని సాక్ష్యం తీసుకోన బడింది. కాలనాథుడు తన అంతరాత్మ కౌళిక సులోచనుని జనకునిగా ప్రేమింప జాలకున్నదని చెప్పాడు. అందులో అతనేమీ అసత్యాన్ని చెప్పి ఉండలేదు! రాజకాళి పాటలను వినక ముందు కూడ అతనికి సులోచనునిపై సహజ పితృ భావం ఏర్పడి ఉండ లేదు.
కాలనాథుని సాక్ష్యం ముగిసిన పిమ్మట శివదత్తుడు తన తీర్పును వ్రాసి మాధ్యాహ్నికానికి లేవక ముందే వినిపించాడు.
“ శతపతి కౌళిక సులోచనుడు శతపతి కాలనాథుని కశ్యపుల నుండి విడదీసి తన పుత్రునిగా ప్రకటింప కోరుచు మహా న్యాయస్థానమునకు ఒక విజ్ఞప్తిని పంపియునాడు.పౌర సామంత కాశ్యప ప్రమతి ఆ విజ్ఞప్తిని ఆక్షేపించుచు ప్రతివిజ్ఞప్తి పంపెను. మాచే ఉభయ పక్షముల సాక్ష్యములను, వాద ప్రతివాదములను పరిశీలింపబడినవి! కోసకొక ముఖ్య ప్రశ్న విషయంలో మా సంశయము నివారించుకొనుటకు శతపతి కాలనాథుని గూడ విచారించితిమి!
ఆదియందు సులోచనుని పక్షమున ‘కాలనాథుని సంరక్షణము ధర్మార్థం గాని, పుత్రార్థము కాదని’ వాదింప బడినది! కీ.శే పండిత సుదర్శునుడు తన పినతండ్రి కుమారుడైన మాననీయ ప్రమతికి వ్రాసిన ఒక లేఖలో తాను కాలనాథుని కృత్రిమ పుత్రునిగా చేసుకొంటినని స్పష్ట పరచినాడు. కీ.శే. కాలకేశి తమ ఆస్తిలో సగము కాలనాథునికి ఇమ్మని ఆదేశించుటయు ఆ భావమునే వ్యక్త పరచుచున్నది! మాననీయ ప్రమతిబాబు కాలనాథునికి బ్రాహ్మణ జాత్యుచిత సంస్కారము నాచరించి తన కీర్తిశేష సోదరుని పెంపకమును పూర్తి చేసినాడు. పౌరులందరును కాలనాథుని కాశ్యపునిగా వ్యవహరించుట అతడు సుదర్శన పుత్రుడని తెలుసుకొనుట వలననే అగుచున్నది. అందువలన మేము గూడ అతనిని కీ.శే. కాశ్యప సుదర్శునిని పుత్రునిగానే అంగీకరించితిమి.
అజ్ఞాత కులగోత్రుడగు కృత్రిమపుత్రుని అసలు జననీ జనకులు మధ్య కాలములో తెలిసినప్పుడు ఎట్లు నిర్ణయించుట అను ప్రశ్న ఇప్పుడు మా ముందుకు వచ్చినది. ప్రక్రుతమందు శ్యామలా సులోచనులే కాలనాథుని తల్లి తండ్రులగు నెడల అతనిని పెంచక పోవుటలో వారి తప్పేమియును లేదు! శ్యామల పరలోక గతురాలు అయ్యెను! సులోచనుడు తన పుత్రుడు కృష్ణలో మునిగి పోఎనని భ్రాంతి చెందెను! అందు వలన వారికి తమ పుత్రునిపై గల మాతా పిత్రాదికారము ఉపేక్షా దోష దూషితము కాలేదు! అందు వలన అట్టి సందర్భములలో కాలనాథుడు, శ్యామలా సులోచనుల మాతా పితృకార్యకరణ బాధ్యుడగు ఔరస పుత్రుడనియే చెప్పక తప్పదు. అప్పుడు కృత్రిమ ఔరస పుత్రత్వములకు పరస్పర సంఘర్శనము కలుగును! జనకుడు నాగుడగుట చేత కూడ పిల్లవానిని ద్వాముష్యాయణుడుగా నిర్ణయించుటకు వలను పడదు. నాగ కులమును, బ్రాహ్మణ కులమును చేరి ఒకనియందు విరోధము లేక వర్తింపవు కదా?! ఆర్ష సాంప్రదాయానుసారము ద్విగోత్రులు ఉందురు గాని, ద్వివర్ణులు ఉండరు. అందు వలన ఏక వర్ణమునందు మాత్రమే ద్వాముష్యా యణత్వము సిద్ధించును. ప్రకృత సందర్భముల వంటి స్థలములలో సంఘర్షణ ఏర్పడినప్పుడు క్రుతిమత్వము కంటే ఔరసత్వమే బలవత్తరమని మా అభిప్రాయము!
ఇక కాలనాథుడు కౌళిక సులోచనుని ఔరస పుత్రుడేనా అను విషయము తేల్చ వలసి యున్నది! కాలనాథుని పరిశోధనకు సంబంధించిన సాక్ష్యములు మాచే పరీక్షింప బడినవి. తానూ ఒక జాబును సులోచనుని నుండి తీసుకొని వెళ్లితిననియు, ఆ జాబును శ్యామల చేతికి ఇచ్చితిననియు రజకుడు చెప్పుచున్నాడు. జాబు వ్రాసిన బ్రాహ్మణ లేఖకుడు స్వర్గస్తుడైనాడు. అతని కుమారుడు ఆ జాబులోని దస్తూరీ తన తండ్రిదేనని అంగీకరించు టయే కాక, అతని దస్తూరి గల కొన్ని పత్రములను కూడ ధర్మాసనమునకు చూపినవాడయ్యేను! జాబులోని దస్తూరి సులోచనుడు చెప్పిన బ్రహ్మనునిదే అని మేము తృప్తి చెందితిమి! శ్యామల అక్షరజ్ఞానము లేని స్త్రీ అగుట చేత ఆ జాబును చంద్రపల్లెలో ఉండు ఒక బడి ఉపాధ్యాయునిచేత చదివించుకొనినది. అతడు తన సాక్ష్యములో జాబు గ్రంథమును సమముగా చెప్పలేక పోయినను, జాబు తాత్పర్యమును చెప్పినాడు. అది ఇంచుమించుగా ప్రకృత లేఖకు సరి పోవుచున్నది. సంభోధనమే పదములో నుండెనో అదిగాని, ధర్మశాల విషయమును గాని అతడు చెప్పజాలక పోయెను. సంతకము పొడి అక్షరములో ఉన్నది అని మాత్రము నిర్ధారణగా చెప్పుచున్నాడు. అయినను జాబులోని సంతకము ఇప్పటి సులోచనుని పొడి అక్షరముల శతకము వలె లేదు! తన దస్తూరి కాలక్రమమున బాగుపడినదని వాడి చెప్పుచున్నాడు
. అందు వలన ఆ జాబు సులోచనుడు వ్రాయించినది కావచ్చును, అథవా కాక పోవచ్చును! అతను వ్రాయించినదే అని నిర్ణయించుటకు బలవత్తర లింగ మేదియును లేదు! ఒక పిల్లవానితో కలసిన తల్లి దగ్గర ఆ జాబు కన్పట్టుటయు, ఆ తల్లి వేరు స్త్రీ అని నిర్ధారితము కాక పోవుటయు, పిల్ల వానితో బయలు దేరిన, శ్యామల శ్రీకాకుళము చేరక పోవుటయు జాబును సులోచనుడు వ్రాయించిన దానిగా స్థిర పరచుచున్నాదని వాడి పక్షమున వాదింప బడెను. వాడి పక్షము వారే మొదటి వాదములో ఆ జాబే అ చనిపోయిన స్త్రీ శ్యామల అనుటకు బలవత్తర లింగమని వాదించి ఉన్నారు! ఈ రెండు లింగములకు అన్యోన్యాశ్రయ దోషము పట్టుటచే వాటి బలము సన్నగిల్లు చున్నది. చనిపో యిన స్త్రీ శ్యామల అయినచో జాబు సులోచనీయము అగును, జాబు సులోచనీయమగుచో చనిపోయిన స్త్రీ శ్యామల అగును. ఇదియే అన్యోన్యాశ్రయ దోషము!!
చనిపోయిన స్త్రీ రూప వేషముల గురించియు , శ్యామల రూప వేషముల గురించియు సాక్షుల కథనము స్వల్ప వ్యత్యాసములతో సరి పోవుచున్నది!పిల్లవాని రూపము గురించి సాక్ష్యములో కొంచెము అధిక వ్యత్యాసములు కలవు! అవి రూప వ్యత్యాసములు కావనియు, ప్రతానామ్షములు మాత్రము సరి పోయినవా, లేదా అను విషయ మొక్కటియే గమనించదగినవి అని వాది పక్షమున వాదింప బడినది. ఇతర అనుమానసామగ్రి బలముగా ఉన్నప్పుడు స్వాప వ్యత్యాసములు కావు గాని, ఇట్టి వ్యత్యాసములతో కూడిన రూప సాదృశ్యమే బలవత్తరమైన లింగమొకటి అని చెప్పవలను పడదు.సులోచనుని పోలిక కాలనాథునిలో ఏమియు లేక పోవుటచె, అతని ఔరస పుత్రుడితడు కాడని ప్రతివాది పక్షమున వాదింపబడినది.
తండ్రిని పోలని కుమారులగు కొందరిని చూపించి, అది అంత ప్రమాదమైనది కాదని వాది పక్షమున సమాధానము చెప్పబడెను. వాడి సమాధానమును అంగీకరించినను, మిగిలిన బలవత్తర లింగ మెద్దియును కన్పట్టదు!
ప్రతివాది పక్షమున మరియొక వాదము చేయబడినది. ‘తన మగడు వ్రాసిన జాబును చూసిన పిమ్మట దాని ప్రయోజనము తీరినది! పిల్లవానితో మగని దగ్గరకు ఆ జాబు నంత జాగ్రత్తగా కొంగులో మూటకట్టి తనతో తీసుకొని రావలసిన అవసరము ఎమున్నది? కనుక చనిపోయిన స్త్రీ ఒక కాంతుని జాబుని కాంత వద్దకు తీసుకొని పోవు మనిషి వలే ఉన్నది ! అనునది ఆ వాదము!! ఆ పక్షము నందు కౌ:సు: మరొక వ్యక్తీయే యగును! మనకు తెలిసినంత వరకు మరి ఇద్దరు కౌ:సు: లు కలరు ! ఒకరు మన మహారాజ పరమేశ్వరుడు శ్రీ కౌన్డిన్యస సుచంద్ర భట్టారకుల వారు! రెండవ వ్యక్తి మహామండలేశ్వర కౌత్స సత్య కర్మ సహోదరులు కౌత్స సుకర్మ గారు! మహారాజు గారి సంతకమునకు, జాబు లోని సంతకము పొడి అక్షరములకు పోలిక లేదు! కౌత్స సుకర్మ సంతకము ధర్మాసనము ముందుకు రాలేదు!కనుక ఆ వాదము సంశయ గ్రస్తము గానే యున్నది! కొసకు వాది , ప్రతివాదు లలో ఎవరునూ తమ పక్షమును నిస్సంశయముగా సమర్థించుకో లేదనియే మేము ఎంచుచున్నారము! అట్లుండినను వాదియే సమర్థన భారమంతయు వహించ వలసి ఉన్నది కాన, ప్రతివాది ఖండింప జాలనంత మాత్రమున వాడి కృతార్థుడు కాజాలడు! తానూ తన వాదమును నిస్సంశయముగా రుజువు పరచుకొన జాలడయ్యెను.
శతపతి కాలనాథుని అంతరాత్మ కౌళిక సులోచనుని తన తండ్రిగా చెప్పు నెడల అది అతడు కనిపెట్టిన అనుమానిక సామగ్రి లోని చిన్నచిన్న లోపములను సరిపెట్టు బలవత్తర లింగమయ్యెడిది ! అతని సాక్ష్యము వాడి వాదమునకు ప్రతి కూలముగా ఉన్నది! ఇట్టి లోపయుక్త లింగముల వలన అనుమానింపబడు ఔరస పుత్రత్వము, ప్రత్యక్షమైన కృత్రిమ పుత్రత్వమును బాధించ జాలదని మా అభిప్రాయము.అందు వలన కౌళిక సులోచనుని విన్నపము త్రోసివేయబడినది. కాలనాథుడు కాశ్యపునిగానే ఉండ వలెను!!
ప్రాడ్వివాక భారద్వాజ శివ దత్తుడు వ్రాలు. విజయ సంవత్సర జ్యేష్ట శుద్ధ నవమీ గురువారము.”
19 వ ప్రకరణము:
తీర్పు పిమ్మట శ్రీకాకుళ నగరం లోని నాగుల ముఖాలు వాడి పోయాయి. బ్రాహ్మణుల ముఖాలు వికసొంచాయి. ఆ దినం మధ్యాహ్నం కాలనాథునికి మూడు అభినందన పత్రాలున్నూ, ఒక అభినందన పూర్వక సదైన్య పత్రమున్నూ వచ్చాయి. మొదటి పత్రంలో ఇలా ఉంది.
“నా ప్రియమైన బావా!
నీ సాక్ష్యమెట్లుంటుందో అని మేమంతా మిక్కిలి భయ పడ్డాము! మా మామయ్య ప్రమతికి సంతతి లేదు. మన పెద తాతయ్యగారి సుదర్శన మామయ్యకైనా సంతతి కలదని మేము కొంత సమాధాన పడుచుంటిమి. అట్టి సందర్భంలో కౌళిక సులోచనుని వ్యాజ్యం తలవని తలంపుగా వచ్చినది! కొసకు సులోచనుని వాదన లోని లోపాలని కనిపెట్టి మా పెద్ద మామయ్య వంశాన్ని నిలబెట్టాడు మహా బుద్ధిమంతుడైన శివదత్త సూరి! నేను స్వయంగా వచ్చి మిమ్ము అభినందించాలని అనుకొన్నాను. కాని మా నాన్న గారికి చిన్న జ్వరం తగులు కొన్నందున రాలేక పోయాను. సాలంకాయన మధువాణి వ్రాలు.”
రెండవ జాబు సత్యప్రభ వ్రాసింది ఇలాఉంది:
“పూజ్యులైన కాలనాథ బాబు గారికి నమస్కరించి వ్రాయునది –
కొసకు బ్రాహ్మణులు గెలుచుకొన్నారు. విశేషించి కశ్యపులు గెలుచుకొన్నారు! ఇంక కశ్యపులా కీర్తి పతాక శ్రీకాకుళ నగరంలో ఉన్నతంగా ఎగుర గలదు! మీ అంతరాత్మ సరియైన మాటే మహా న్యాయస్థానంలో పలికించింది! నా దృష్టికి మీ శరీరంలో నాగజాతి రక్తం ఒక బిందువు కూడ ప్రవహించునట్లు కన్పట్టుట లేదు! ఇన్నాళ్ళకు సరియైన బ్రాహ్మణుడు, బ్రాహ్మణులకు స్థిరపడ్డాడు! ప్రాడ్వివాక శివదత్త సూరి మిమ్ములను కశ్యపులలో స్తిరంగా స్థాపించినందుకు వందనీయుడు! రాతీతరి సత్యప్రభ వ్రాలు.
శక్తి ధరాదుల జాబు ఇలా ఉంది—
“ప్రియ సఖుడా!
కొసకు మేము అనుకొన్నట్లే నీ అంతరాత్మ నిన్ను పలికించినది! మా జాతినుండి ఒక మహారత్నం జారిపోలేదు. ఈ దినాన్ని ఆన్మ్ధ్ర బ్రాహ్మణులు ఉత్సవ దినంగా పరిగణించ గలరు! అసలు నీ జాతిలోనే నీవు నిలబడ్డావని మా నమ్మకం! నీ అసలు తల్లి తండ్రులిద్దరినీ కనిపెట్టమని ఈ దినమే మేము రహస్యార్థ పరిశోదకుడు ఘౌరకి ప్రమదనాథునికి ఒక సూచనను పంపుచున్నాము.
కుమార కౌండిన్య శక్తిధరుడు వ్రాలు; నగర పాల భారద్వాజ ఘనేంద్రుడు వ్రాలు; శతపతి అంగీరస మల్లికార్జునుడు వ్రాలు; శతపతి వాత్సాయన విష్ణుశర్మ వ్రాలు.”
నాల్గవ జాబును ధరణి వ్రాసింది. దానిలో ఇట్లుంది.—
“నా ప్రియమైన అన్నయ్యా!
ఈ దినం శివదత్త సూరి తీర్పు గురించి విని గట్టున పడ్డాను. కొన్నాళ్లనుండి నీకొక జాబుని వ్రాద్దామని సంకల్పించాను. కాని ఇది వరకు తీరిక లేక పోయింది. కారణాలు వివరించి నా దినచర్య కష్టమంతా ఈ జాబులో వెళ్లబోసుకొనుట అనాలోచితమని మానివేశాను. ఈ దినపు శివదత్త సూరి తీర్పు వారికి అనుకూలమై ఉంటే నేను సముద్రంలో మునిగి పోవలసిందే!
భగవంతుడు అతని లేఖినిలో ప్రవేశించి నన్ను రక్షించాడు. నా భవిష్యత్తును పాడు చేయడానికి మన పినతల్లి భర్త సంకల్పించాడు. ఆ విషయాన్ని నీతో ప్రత్యక్షంగా మాట్లాడాలి గాని, కొలది మాటలలో వ్రాయడానికి వీలు పడదు! మన ప్రమతి బాబయ్య గారికిని, అవధాని బాబయ్య గరికిని ఏమిన్నీ పడదు! మన రెండు ప్రక్కల పినతల్లులు ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమని మండిపోతుంది. నేను ప్రమతి బాబయ్య గారి ఇంటికి రావడం లేదని వారికి కోపం! వీరు వెళ్లనీయరు!
నా కష్టాలను ప్రమతి బాబయ్య గారితో చెప్పడానికి ధైర్యం చాలడం లేదు! అతని దగ్గర నాకు అంత చనువు లేదు! ఇప్పుడు నీ ఛాయగాని నాకు దూరమయి ఉంటే, మన నాయనను కడుపులో పెట్టుకొన్న కృష్ణవేణి తల్లియే నాకు శరణ్యం! దీనిలో అతిశయోక్తి లేదు! నిన్ను ఒకమారు చూసి నా కష్టాలు చెప్పుకోవాలని ఉంది! నేను స్వయంగా వచ్చి చూడడానికి, కతల బోనులో ఉన్నాను! ఘోరాతపంలో ఎడారి మధ్యన ఉన్నట్లున్నాను!!
అన్నయ్యా! శరణాగత నీ చెల్లెల్ని కాపాడే బాధ్యత నీది!! ఇట్లు నీ దీనతమ భాగిని కాశ్యప ధరణి వ్రాలు.
మొదటి మూడు జాబులు చూచి కాలనాథుడు ఉప్పొంగి పోయాడు! అందులోనూ వాని నయనామృత ధార సత్యప్రభ జాబు వానిలో ఎనలేని సంతోషాన్ని వర్షించింది! నాల్గవ జాబుని చూచి కోపంతో కాలరుద్రుడై పోయాడు! అన్నింటికిని ప్రత్యుత్తరాలు వ్రాసి పంపించి వేసాడు.
20 వ పకరణము:
దండనాయక భుజంగుడు మహారాజ్ఞికి పినతల్లి కుమారుడు. వాడు తన భార్యతో పది సంవత్సరాలు కాపురం చేసినా, సంతానం కలగ లేదు! భార్య సలహాపై అతడు రెండవ పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించాడు. పతంగా వధాని పెంపకంలో ఉన్న ధరణిని అతను అనేక సార్లు చూసాడు. పతంగావధాని ధన లుబ్దుదని అతనికి తెలుసు! కాబట్టి అతనిని రహస్యంగా పిలిచి సరక్షణ దక్షిణ పదివేల కార్శాపనాలు ఇస్తానని ధరణిని తనకు ఇచ్చి వివాహం చెయ్యమని అడిగాడు. పతంగావధాని మిక్కిలి సంతోషించి వాగ్దానం చేసేసాడు!తన భార్యతో దండనాయక భుజంగును అపార సంపదని, అన్నిటికీ మించిన అతని రాజ బందుత్వాన్ని వివరించి చెప్పి, ధరణిని అతనికి ఇవ్వడానికి సమ్మతిపచేసాడు.
కాని ధరణి సవతిపై సవతిపై సంబంధాన్ని తిరస్కరించింది. ఆ విషయాన్ని నీలకేశి అవధానితో చెప్పింది
అవధాని మృదువుగా చెబుతే కార్యం నెరవేరదని తలంచాడు. రెండు రోజులుగా ఝంఝా మారుతం లాగ ధరణిపై విజ్రుంభించాడు ! కాని ఫలితం లేక పోయింది. సాధారణంగా ఆ ఇంట్లో అవధాని కోపానికి అందరూ లొంగి పోవడం పరిపాటి! ఆ కోపంలో అతనికి యుక్తాయుక్త జ్ఞానం నశించి పోతుంది. రాక్షసుడై పోతుంటాడు.
సూర్యుడింకా అస్తమించ లేదు! అతని కిరణాలు మందములౌతున్నాయి. లుబ్ధ క్రూర స్వభావుడైన పతంగా వధాని, ధరణిని లేడి పిల్లను పెద్దపులి వలె సమీపించాడు. క్రోధాగ్ని చేత వాని కండ్లనుండి మంటలు లేస్తున్నా యి. ఆ క్రోధాగ్ని ధూమం వల్ల వాణి నల్లని ముఖం మరింత నల్లబడింది! అప్పుడు ధరణి పెరట్లో ఏదో పనిలో పనిమీద ఉండింది.
“ఏమే, ధరణీ! నేను నీకు చెప్పిన మాటను గురించి ఆలోచించావా? పెద్దమనిషికి మాట ఇచ్చేశాను, ఇంక తిరగడానికి వీలు లేదు! ఏమంటావే ?” అని ప్రశ్నించాడు.
“ ఏ మాట?” అని అమాయికంగా ప్రశ్న వేసింది ధరణి.
“ఏ మాటా? చదువు చెప్పించినందు వల్ల నీకు కళ్ళు నెత్తికి వచ్చాయి! చాల రోజుల నుండి దెబ్బలు లేక కొవ్వెక్కి పోయావు! ఈ చింతబరికెతో నాలుగు ముట్ట చెబుతే ఏ మాటో నీకే తెలుస్తుంది.” అని పతంగుడు అన్నంత పనీ చేసాడు.ధరణి పెద్ద పెట్టున ఏడువ సాగింది.
“ఏడువకు, హు! ఏడువకు..” అంటూనే మరికొన్ని దెబ్బలు వడ్డించాడు పతంగుడు.
“దానికి ఇష్టం లేని పెళ్లి ఎందుకు పోనిద్దురూ!” అని అడ్డు వచ్చిన నీలకేశికి కూడ కొన్ని దెబ్బలు ప్రసాదింప బడ్డాయి. ఆ స్వగృహ మాత్ర వీరుడు పిమ్మట భీకర స్వరంతో ధరణిని చూసి ఇలానాడు.
“నీవు ఏడ్చినా సరే! చచ్చినా సరే! నా మాటనుండి నేను జారుకో లేను! లక్షాధికారి, రాజ బంధువు, దండనాయ కుడు, మహావీరుడు –ఇలాంటి వాణ్ని నీకు మొగుడుగా సంపాదిస్తే ఏం చేదా, దరిద్రురాలా?”ధరణి మంద్ర స్వరంతో ఏడుస్తూనే ఉంది. పతంగుని కోపం రెట్టింపు అయింది. వంటింటి లోకి వెళ్లాడు. మండు తున్న కొరకంచుతో తీసుకొని వచ్చాడు. దాన్ని ఆ బాలికకి చూపుతూ అన్నాడు. “ నీవు నేను చెప్పి నట్లు విని భుజంగబాబుని పెండ్లాడుతవా, లేక ఈ కొరకంచుతో రక్షలు వేయించుకొంటావా? ఎదో శీఘ్రంగా చెప్పు,” ఈసారి వాస్తవంగా ధరణి భయపడింది.
అప్పుడు పెరట్లో ఒక పెద్ద చప్పుడు వినిపించింది. పతంగుని దృష్టి శబ్దం వచ్చిన దిక్కు వైపు మళ్ళింది. గోడను గెంతి వచ్చిన ఒక మనిషిని చూచాడు చూచాడు అవధాని, తరువాత ధరణి చూసింది. అతడే కాలనాథుడు!తన చెల్లెల్ని కాపాడడానికి శీఘ్ర గతితో వచ్చిన కాలనాథుడు!
అతడేమో మామూలుగా వీధి ప్రక్కగా వచ్చాడు. అప్పుడు పొరుగింటి ముసలమ్మ ఇట్లు కాలనాథున్ని విమర్శించింది! “నిర్భాగ్యుడా! నిన్ను పెంచిన దయావంతుని కూతుర్ని ఇంత నిర్లక్ష్యంగా చూస్తున్నావేమిరా? ఆ దుర్మార్గుడైన అవధాని వీధి తలుపు గడియ పెట్టి పెరట్లో పిల్లను చావబాది చెవులు మూస్తున్నాడు. ఏదో పెండ్లట! అవధాని చెప్పిన వరుణ్ణి నీ చెల్లెలు ఒప్పుకోలేదట!!” అని.
ఆ మాట విన్నాడు కాలనాథుడు. పొరుగింటిలో నుండి వెళ్లి గోడ గెంతి ప్రత్యక్షమయ్యాడు! కాలనాధున్ని చూడగానే ధరణి సంతోషం పట్టలేక “అన్నయ్యా !” అని కేక వేసింది.
కాలనాథుడు పతంగుని పట్టి అమాంతంగా ఎత్తి విసిరి వేసాడు. పతంగుడు పది మూరల దూరంలో పడ్డాడు. వాణి చేతి కొరకంచు వాని పార్శ్వ భాగానికి మరపురాని రక్షను ప్రసాదించింది!
కాలనాథుడు తన చెల్లెల్ని చూసి “చెల్లీ! ఇక ఈ దుష్ట చాన్ధసుని ఇంట్లో ఒక్క క్షణం కూడ నీవు ఉండ నవసరం లేదు! రా! పోదాం !” అన్నాడు.
పతంగావధాని మెల్లగా లేచాడు. కాలనాథుని చుర చుర చూసాడు. తననే బాధించిన తన ఆగ్నేయాస్త్రాన్ని విసిరి నెలకి కొట్టాడు. ఆ అస్త్రం తనకి ప్రసాదించిన కాలపు మంట ఒక మూల, తన పదివేలు (సంరక్షక దక్షిణ) ధరణితో పాటు మాయమయిందనే బాధ ఒక మూల అవధానిని దహిస్తున్నాయి! అతని క్రోధం మరింత ప్రచండంగా ఉబికింది గాని, కాలనాథుని విగ్రహాన్ని చూసి చప్పజారి పోయింది! కొసకు మొండి ధైర్యం తెచ్చుకొని మాటలచే వచ్చిన వాణ్ని అడ్డగించడానికి చేష్టించాడు! “నేను పెంచిన పిల్లని తీసుకొని పోవడానికి నీకు ఎంత ధైర్యం! నీకేం హక్కుంది?” అని కోపంతో రొప్పుతూ అన్నాడు.
“నీవు ఏం పెంచినా పైవాడివేను! మా ఇంటి పిల్లని, నా చెల్లెల్ని నేను తీసుకొని వెళ్తాను! ఎవరు నన్ను అడ్డగించ గలరో చూస్తాను. చావగోట్టడమేనా సంరక్షణ అంటే? కొరకంచుతో కాల్చడానికా నా చెల్లెల్ని నీ ఇంట ఉంచాలి? ప్రాజ్ఞత వచ్చిన పిల్లను, సభలో పూజ్యత పొందిన పిల్లను కొట్టి ఒక కిరాతకుని కంటె హీనమని అనిపించుకొ న్నావు! ఇలాంటి నీవా సంరక్షకుడవు? అర్థ జ్ఞానం లేని నీవు వల్లించిన వేదం నీకు తద్దిన మంత్రాలు చెప్పడానికి పనికి వచ్చింది! మా పినతల్లి ముఖం చూసి నిన్ను వదలి పెడుతున్నాను. లేకుంటే ఒక్క చెంపకాయతో నీ పండ్లన్నే ఊడగొట్టి ఉందును.” అని బదులిచ్చాడు కాలనాథుడు.
“నేను దీని సంరక్షణ క్రింద పెట్టిన ఖర్చు ఇక్కడ పోసి పిల్లను తీసుకొని వెళ్లు.” అన్నాడు పతంగుడు.
“మా ధరణి అసలు సోత్తున్నూ, వడ్డిన్నీ కలిపి ఏంటో పెరిగి ఉండాలి! ఆన్ని సరిగా లెక్కకట్టి దానిలో నుండి మా ధరణికి నీవు ఖర్చు పెట్టిన సొమ్మును మినహాయించుకొని మిగతా సొమ్ము మాకు ఇస్తే చాలు!” అన్నాడు కాలనాథుడు. పతంగుడు ఈ సారి ఒక బిభీషికా శస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ శస్త్ర ఘాతానికి కాలనాథుడు లొంగి పోవక తప్పదని అనుకొన్నాడు! “ ఓయ్! ఈ పిల్ల దండనాయక భుజంగ బాబుగారికి నిశ్చయించబడింది! ఆ పెండ్లికి నీవు విఘ్నం చేస్త్న్నావు జాగ్రత్త ! ఆ రాజ బాంధవుడు తలచుకొంటే నీ ఉద్యోగం ఊడుతుంది ! నేను కాదు, విసిరి కొట్టేయడానికి!” అన్నాడు.

"పిల్ల అంగీకారంలేనిదే పెండ్లిని నిశ్చయించడానికి ప్రేమ లేశం అయినా లేని పినతండ్రికి ఏమి అధికారం ఉంది? మీ మాననీయ దండనాయకునితో ధరణిని, కాలనాథుడు వచ్చి తీసుకొని వెళ్లిపోయాడని చెప్పు. నీ చేతి కొరకంచు కన్నా కూడ నిసారమైన ఆ దండనాయకుని కత్తికి స్త్రీలు మాత్రమే భయ పడాలి! ఆ రాజ బాంధవుని వీరత్వం, మర్యాద మాకు తెలియనవి కావు." అని సమాధానం ఇచ్చాడు.
పతంగుడు ముఖం వ్రేల వేసుకొన్నాడు.
ఆ దినమే పతంగావదానిని తరుణ ప్రాయంగా ఎంచి కలనాతుడు ధరణిని,తన ఇంటికి తీసుకొని వచ్చేసాడు.
Comments
Post a Comment