Skip to main content

కొరకంచులో ఇనప మేకు -2

హారర్' నవల: 

శరణ్య ‘పనాహ్’ నుండి బయటపడి రోడ్డు మీదకి రాగానే అక్కడ తన కోసం నిరీక్షిస్తున్న ‘అవినాష్’ని చూసి ఆశ్చర్యపోయింది! ”అవినాష్’ నువ్వేంటి ఇక్కడ?” అని అడగకుండా ఉండలేక పోయింది.

అవినాష్’ ఆమె మాటలని పట్టించుకోకుండా “ముందు ఈ సంగతి చెప్పు. నీకు జాబ్’ దొరికిందా లేదా?” అని ప్రశ్నించాడు.

“దొరికింది, కాని ఇక్కడకి వచ్చినట్లు నీకెలా తెలిసింది?” అని అడిగింది.


“శరణ్యా ! ప్రేమించే హృదయాలకి చెవులుంటాయి తెలుసా? మనసులో అనుకొన్నవి వినబడతాయి”
శరణ్య సిగ్గు పడింది.

“జాబ్’ దొరికింది అవినాష్! ఎల్లుండే బయలుదేరి వెళ్లాలి.ఎక్కడకి వెళ్తున్నదీ ఎవరికీ చెప్పకూడదు! తిరిగి మూడు నెలల తరువాతే నీకు కనిపించేది”అంటూ చెక్కుని చూపించింది.

“ఇది లోకల్’ చెక్కు శరణ్యా! ఎల్లుండి లోపల క్రెడిట్’ కూడా అయిపోతుంది. “అన్నాడు.

“అవును, అందుకే ఒప్పుకొన్నాను.” 

“ఇంతకీ ఎక్కడకి వెళ్తున్నావు?”

”నాకే తెలియదు, నా మోబైలుకి మెసేజి ఇస్తారట!”

“పోనీ ఏం పని చేయాలో తెలుసా?”

“ఒక అందమైన కుర్రాడికి అన్ని పనులూ చేసి పెట్టాలి.” అంది శరణ్య కొంటెగా.

“అందమైన కుర్రాడికా? అన్ని పనులూ అంటే?”

“వంట వండి, తినిపించడం దగ్గర నుంచి, ప్రక్క పరచి పడుకోబెట్టడం వరకు!”

“ప్రక్కలో కూడా పడుకోవాలా?”

“అవును బెంగపడకు, ఆ కుర్రాడి వయస్సు మూడేళ్ళే!”

“మూడేళ్ళ వయసున్న కుర్రాడా! అయితే నాకు అభ్యంతరం లేదు” అవినాష్’ గలగలా నవ్వాడు.

శరణ్య పనిలో చేరిన మొదటి రోజు! తానెక్కడ ఉందొ తనకే తెలియదు. కళ్ళకి గంటలు కట్టి, కారులో తీసుకెళ్ళారు. ఆ ఇల్లు రెండు గదుల ఇండిపెండెంటు హవుస్’, చుట్టూ ప్రక్కల ఇంకే ఇళ్లూ లేవు!

కిచెన్లో ఆరు మాసాలకి సరిపడా ఆహార ధాన్యాలు, సరుకులు, పిల్లాడికి కావలసిన పాలడబ్బాలు, బిస్కెట్ల డబ్బాలు కూడా నిండుగా ఉన్నాయి.అవన్నీ చూసాక ‘తానొక చెరసాలలో పడిపోలేదు కదా!’ అని మొదటి సారిగా అనుమానం వచ్చింది ఆమెకి.

ఆ రోజు సాయంత్రం—

వాళ్ళిద్దరూ బురఖాలో వచ్చారు. వచ్చీ రాగానే కుర్రాడిని చేతుల్లోకి తీసుకొన్నారు. శరణ్య వాడికి స్నానం చేయించి, పౌడరు వ్రాసి, కొత్త బట్టలు తొడిగింది. ఆనందంగా వాళ్ల చేతిలో పెట్టింది.

వాడిని చేతిలోకి తీసుకోగానే వాళ్ళు శరణ్యని గది లోపలికి వెళ్లి తలుపులు వేసుకోమన్నారు. ప్రశ్నలు అడగకూడదు కాబట్టి ఆమె మౌనంగా తల ఊపి గది లోపలి వెళ్ళింది.

అరగంట గడిచాక కుర్రాడి ఏడ్పు విని గది తలుపు తీసి, బయటికి వచ్చింది.

అక్కడ ఆమె చూసిన దృశ్యం!!
ఆ దృశ్యాన్ని చూసిన ఆమె ఒళ్ళు జలదరించింది!!

కుర్రవాడు కిచెన్’ టేబులు మీద ఉన్నాడు. వాళ్లు, అదే వాడి మేనత్తలు యమభటుల్లాగ కిచెన్’ కత్తులు పట్టుకొని, వాడి చేతుల మీద గాటు పెట్టారు, ఆ పైన కారం అద్దారు. పిల్లవాడు హృదయ విదారకంగా ఏడుపు లంకించు కొన్నాడు. అయినా ఆ కసాయి గుండెలు కరగలేదు! ఎర్రగా కాల్చిన దబ్బనంతో వాడి తొడల మీద వాతలు పెట్టారు. పిల్లవాడు ఏడ్పు ఆపలేదు. శరణ్య మరి మౌనంగా చూడలేక పోయింది. అడ్డుపడి ఆదుకోబోయింది.
వాళ్లు లంఖిణీల్లా గర్జించారు.

“ఒసేయ్! నువ్వు పని మనిషివన్న సంగతి మరచిపోకు. మా పనికి అడ్డుపడితే నీకు కూడా ఇదే గతి పడుతుంది. మేమెందుకు ఇలా చేస్తున్నామో ఎవరికీ తెలియకూడదు. ఎవరికీ చెప్పాలని గాని, ఇక్కడి నుంచి తప్పించు కోవాలని గాని ప్రయత్నం చెయ్యకు. అలా చేస్తే నీ ప్రాణాలు తీస్తాం. నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకొంటూ పొ! మేము వెళ్ళిపోయాక వాడి గాయాలకి కట్టు కట్టి, మళ్లీ రేపటికి ముస్తాబు చేసి, మా కోసం తయారు చెయ్యి.”అంటూ ఆమెని హెచ్చరించి వెళ్లిపోయారు. 

వెళ్తూ, వెళ్తూ కిచెన్’ టేబులు మీద నుంచి పిల్లైని తోసేసి వెళ్ళారు. క్రిందపడిన కుర్రాడు కెవ్వుమన్నాడు.

శరణ్యకి అర్థమయింది. ‘ఇక ఈ టార్చర్’ రోజూ జరుగుతుంది. పసి పిల్లవాడు ఎలా తట్టుకొంటాడో ఏమో! ఇంతకీ ఈ పని ఎందుకు చేస్తున్నారొ తెలియడం లేదు. తానొక విష వలయంలో చిక్కుకొంది. ఈ వలయం నుంచి తానే  కాదు, ఆ పిల్లవాడిని కూడ రక్షించాలి.కాని ఎలా సాధ్యమవుతుంది?’

శరణ్యకి ఏమీ పాలుపోలేదు.

హృదయ విదారకంగా ఏడుస్తున్న పిల్లవాడిని అక్కున చేర్చుకొని, కిచెన్లోని మందుల అరణి తెరచి, వాడికి కట్టు కట్టింది. వాడి ఏడ్చి, ఏడ్చి అలసిపోయి నిద్రపోయాడు.

(ఇంకా ఉంది)
****************  
     
   

                  

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ