Skip to main content

కొరకంచులో ఇనప మేకు-3

హారర్' నవల:
నిద్రలో కూడా అదిరిపడి లేస్తూ, దుఃఖిస్తున్న కుర్రాడిని చూసి, అవినాష్'కి ఫోన్’చెయ్యాలని శరణ్య తన మొబైల్’ తీసి దానిని ‘అన్’లాక్’ చేసింది. అన్’లాక్’ చేయగానే, ‘ఇన్’సర్ట్’ సిం’ అనే సందేశం వచ్చింది.శరణ్య ఆశ్చర్యంతో ఫోను తెరచి చూసింది

అందులో ‘సిమ్’ కనబడలేదు! తనకి తెలియకుండానే తన ఫోను నుండి ‘సిమ్’ తీస్సిన వాళ్ల చాకచక్యాన్ని  మెచ్చుకోకుండా ఉండలేక పోయింది. ఇప్పుడేమి చేయాలి? తనకి ఫోను రాదు, తను మరొకరికి ఫోను చెయ్యలేదు. ఇంకో ‘సిమ్’ వేసేదాకా! ఎవరి  సహాయాన్ని అయినా ఎలా అర్థించడం?’ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అని అంటారు! ఆ మాటే నిజమైతే తనకి, తనతో పాటు ఈ పసివాడికి, దేవుడు గాని మరేదైనా అలౌకిక శక్తులే సహాయం చెయ్యాలి! అంత వరకు ఈ పసివాడి గురించి సమాచారం ఏదైనా దొరుకుతుందేమో అన్వేషించాలి!’

ఆ ఆలోచన రావడంతో ఆ పసివాడికి సంబంధించిన వివరాలేవైనా తెలుస్తాయన్న ఉద్దేశంతో ఆ ఇంటి లోని ఆణువణువూ వెతికింది ఆమె. డైరీలు, ఉత్తరాలు, ఫోటో ఆల్బంలు, చిరునామా కార్డులు, బేంకు ఎకౌంట్’ బుక్కులు, ఏ.టి.ఎం. స్లిప్పులు ఏవీ కనబడ లేదు! కాని ఒక కెమెరా కనబడింది. ఆనందంతో ఆమె ఆ కెమెరాని ఆన్’ చేసింది. బేటరీ-లో అనే సందేశం వచ్చింది! ‘ఎలాగూ తన మొబైలు నిరుపయోగకరమయింది.దాని చార్జరు దీనికి తగిలించి చూస్తే !”అని.

వెంటనే ఆ పని చేసింది. చిత్రం! కెమెరా యు.ఎస్.బి స్లాటులో మొబైలు చార్జరు అమరిపోయింది! వెంటనే దానిని ప్లగ్గులో పెట్టి కెమెరాని ప్లగ్గులో పెట్టింది. ఆ తరువాత స్నానం చేసి, వంట మొదలుపెట్టింది.బాబు కోసం మెత్తని కిచిడీ చేసింది. ఫ్రిజ్’లోని చల్లని పెరుగును ఒక గిన్నెలో తీసి, చల్లదనం తగ్గేందుకు బయట పెట్టింది. తన కోసం కూర, పులుసు, టిఫిన్’ కోసం ‘అమ్లేట్టు’ వేసింది. బాబుకు కూడ బుల్లి ఆమ్లెట్టు వేసింది.

బాబుని లేపి వాడి ముఖం కడిగి గాయాలకి మందు వ్రాసింది.

టేబులు మీద నుంచి తోసేయ్యడం వల్ల బాబు కాలు వాచిపోయింది, దానికి కాపడం పెట్టింది. బుల్లి ఆమ్లెట్టు వాని చేత తినిపించింది.

“ఆంటీ! నీ పేరు ఏంటి?” అడిగాడు బాబు.

ముద్దుముద్దుగా అడిగిన ప్రశ్నకి శరణ్య మురిసిపోయింది. “నా పేరు శరణ్య. నీ పేరు ఏంటి?”

“నలేంద్ర ..”చెప్పాడు వాడు.

“నరేంద్రా! ! చాల చక్కటి పేరు. మీ అమ్మ పేరు ఏంటి బాబూ?”

“అమ్మ పేరు మాలతి.”

“నాన్న పేరు?”

“నాన్న లేలుగా!”

నరేంద్ర జవాబు విని శరణ్య ఆశ్చర్య పోయింది. కెమెరాలో ఫోటోలు చూపిస్తే బాబు ఇంకేవైనా వివరాలు చెప్పగలడేమో అని అనిపించి కెమెరా ఆన్’ చేసి, ఫోటో వ్యూయర్’ విప్పింది. నరేంద్ర ఫోటో కనిపించింది. ఆ తరువాత ఫోటో చూసి నరేంద్ర చప్పట్లు కొడుతూ ‘అమ్మ’ అన్నాడు. తరువాత ఫోటోలో మాలతి, ఆమెతో పాటు ఆ ఇద్దరు అత్తల తమ్ముడు, బహుశా మాలతి భర్త ఉన్నారు.

“నరేంద్రా! ఈ ఫోటోలో మీ అమ్మతో పాటు ఉన్నదెవరు?”

“బాబాయి! బాబాయి మంచోలు కాలు, ‘కంపు బాబాయి” అని ముక్కుని చేత్తో పట్టుకొంటూ అన్నాడు నరేంద్ర. “ నన్ను కోపంతో చూస్తాలు, అమ్మ దగ్గల లేకపోతె కోలాటాలు. మలి.. మలి.అమ్మేమో ఆ కంపు బాబాయిని ‘నాన్న’ అని పిలవమంతుంది”

శరణ్యకి అర్థమయింది, నరేంద్ర తండ్రి చనిపోతే మాలతి ఈ ‘కంపుని’ పెళ్ళిచేసుకొని ఉంటుంది! ‘మారుతి తండ్రి కదా, ఈ బాబంటే అతనికి ఇష్టం అయి ఉండదు! కాని తల్లి సమక్షంలో దానిని ప్రకటించడు, బాబుని చాటుగా హింసిస్తాడు కాబోలు! ఆమె మరొక ఫోటో త్రిప్పింది, ఆ ఫోటోలో ఆ ఇద్దరు ఆంటీలు ఉన్నారు. వాళ్లని చూపించి అడిగింది,” నరేంద్రా! వీల్లెవరు?” అని.

“లాకీ అత్త, జాకీ అత్త!”

లాకీ అంటే రాఖీ కావచ్చు! కాని జాకీ అంటే అతం కాలేదు, అదే అడిగింది శరణ్య, “జాకీ అంటే ఏంటి బాబూ?” అని.

“జానకి అత్త” అన్నాడు నరేంద్ర. “లాకీ, జాకీ అత్తలు కూలా కంపు అత్తలే!” అని.

“నిజమే బాబూ! ఆత్తయ్యలిద్దరూ కంపే! నువ్వు న బంగారానివి” వాణ్ని ముస్తాబు చేస్తూ అడిగింది శరణ్య. “వాళ్ళు నిన్నెందుకు కొడుతున్నారు?”

“ఏమో!” అన్నాడు అమాయకంగా బాబు.

కెమెరాలో తక్కిన ఫోటోలు అన్నీ ఫంక్షన్లు, పార్టీలు లాంటి ఫోటోలే! శరణ్య దానిని దాచింది. జరగబోయే ఘాతుకానికి చూడలేక కాబోలు, సూర్యుడు అస్తమించి కళ్ళు మూసుకొన్నాడు!

రాఖీ, జాకీల కారు ఇంటి ముందు ఆగింది. వాళ్ళు తలుపు తాళాలు తీస్తున్న చప్పుడికి శరణ్య గతుక్కుమంది. ఆ తరువాత కాలింగు బెల్’ మ్రోతకి తేరుకొని తలుపు తీసింది.

లోపలికి అడుగు పెట్టిన కంపు అత్తయ్యలని చూసి నరేంద్ర అదిరిపడి ఏడ్చాడు. శరణ్య వెనక్కి వెళ్లి దాక్కొన్నాడు.

అలా నక్కి దాక్కొన్న నరేంద్రని కంపు అత్తయ్యలిద్దరూ చెరొక రెక్కా పట్టుకొని పైకెత్తారు. కిచెన్’ టేబులు మీదకి ఎక్కించారు. వాణ్ని దాని మీద పడుకో బెట్టి, అదిమి పెట్టి ఉంచారు. నరేంద్ర జరగబోయే దానిని ఊహించుకొని ఆరున్నొక్కటి రాగాన్ని అందుకొన్నాడు.

రాఖీ, జాకీలిద్దరికీ ఆ రాగం శ్రవణానందకరంగా వినిపించింది. “ఏడవరా, ఏడు! ఇవాళ నీ వీపు మీద ‘కొరకంచులో ఇనప మేకుతో’ వాతలు వేస్తాం!”అంటూ వికృతంగా నవ్వారు.

‘కొరకంచులో ఇనప మేకా!!’ శరణ్య అప్రయత్నంగా అరిచింది.

“అవునే! కన్నుల పండువుగా ఆ దృశ్యాన్ని చూడు “ అంటూ తనతో తెచ్చుకొన్న బేగులో నుంచి సగం కాలిపోయి ఉన్న ‘కొరకంచుని’ తీసింది రాఖీ. ఆ కొరకంచులో ఒక పదునైన మేకు దిగగొట్టబడి ఉంది.

జాకీ ఆ కొరకంచు మీద కిరసనాయిలు పోసి మంట పెట్టింది. మంట భ్గాభాగమని కొరకంచుని కాల్చసాగింది. దానిని చూసిన నరేంద్ర వాళ్ల చేతుల్లో గిన్జుకొంటూ ఏడవసాగాడు. ఆ ఏడుపు వాళ్లకి టానిక్కు లాగ పని చేసింది. మేకు ఎర్రగా అయేవరకు ఆ కొరకంచుని కాల్చి ఆ తరువాత మంటని ఆర్పేసారు వాళ్ళు.

రాఖీ, నరేంద్ర బట్టలు విప్పి, బోర్లా పడుకోబెట్టింది. జాకీ వానిని అదిమి పెట్టింది.

వారిద్దరి పశు బలం ముందు అ పసివాడు ఎంతలా గింజుకున్న ఫలితం లేక పోయింది!శరణ్య పాపం మూగ ప్రేక్షకురాలై పోయింది.

ఎర్రగా నిప్పులు చిమ్ముతూ కాలిన కొరకంచులోని ఇనప మేకుతో ఆ పిశాచులిద్దరూ పసివాని వీపు మీద ఒక దాని ప్రక్కగా మరొకటిగా మూడు వాతలు పెట్టారు. ఆ తరువాత కొరకంచుని కుళాయి నీళ్ళలో కడిగి ఆర్పేసారు.

అంతటితో ఆ కార్యక్రమం ముగిసినట్లేనని అర్థమయింది శరణ్యకి.”బాబుని లోపలికి తెసుకొని పోనా?” అని అడిగింది.

“పట్టుకెళ్ళవే, తీసుకెళ్ళి ‘మలాం’ వ్రాయి!” అంది రాఖీ.

“ఇలా ఎందుకు చేస్తున్నారు వాడు ఏ నేరం చేసాడు?” ధైర్యం తెచ్చుకొని అడిగింది శరణ్య. బాబుని చేతిలోకి తీసుకొంటూ.

“అయిదు వందల కోట్ల ఆస్తికి వారసుడు కావడమే వాడు చేసిన నేరం! మాలతి తండ్రి ఆ ఆస్తిని మా తమ్ముడి పేర వ్రాయకుండా ఈ బుడతడి పేరు మీద వ్రాసాడు. అంతే  ఆ పైన వివరాలు అడగకు...”

శరణ్యది చాల చురుకైన బుర్ర. ఆమెకి విషయమంతా అర్థమయి పోయింది. నరేంద్ర అయిదు వందల కోట్ల ఆస్తికి వారసుడు. ఆ ఆస్తి వాడి పేర రిజిస్టరు కావడానికి, అమెరికా ప్రయాణానికి, వీసాలు గట్రా తయారు చేయడానికి 3 నలల సమయం అవసరం. ఈ  లోగా ఈ రాక్షసి అత్తయ్యలు , ఈ మూడు నెలల కాలం వాడిని తమ సంరక్షణలో ఉంచుతామని ఎలాగో ఆ తాతతో చెప్పి, ఇక్కడికి తీసుకొని వచ్చి ఇలాగ అత్యాచారాలు చేస్తున్నారు. ఈ అత్యాచారాల వల్ల వాడికి పెచ్చి ఎత్తుతుంది. జీవతాంతం వాడిని పిచ్చి  ఆస్పత్రి పాలు చేసి, అ ఆస్తిని అనుభవించాలని చూస్తున్నారు’ అని గహించ గలిగింది.

“ఏమిటే, ఆలోచిస్తున్నావు? ఇంకొక్క రోజు హింస పెడితే వాడికి పిచ్చి ఎత్తడం ఖాయం! కత్తిని చూసినా, మేకుని చూసినా, చివరకి చేమ్చాని చూసినా చాలు, వాడు ఆవేశంతో రెచ్చిపోతాడు. ఈ మూడు నెలల్లో వాడి గాయాలకి కట్టు కట్టి, వాణ్ని దొరబాబులాగ తయారు చెయ్యి. అమెరికాకు తీసుకెళ్ళి వాడి అమ్మకి అప్పగించు” అంది రాఖీ వికటంగా నవ్వుతూ.

“నిన్ను అందుకే వెతికి పట్టుకొన్నామే! నువ్వు ఎవ్వరూ లేని అనాథవని,నీకు కూడా ‘నేర చరిత్ర’ ఉందని తెలిసి౯ నీతో ఇంటర్వ్యూ చేసి నిన్నుఇరికించాం ! పోలీసుల దగ్గరకి నువ్వు వెళ్ళలేవని మాకు తెలుసు. మా మాట విని నువ్వు నీ పని చేసుకొని పో! అదే నీ ఆరోగ్యానికి మంచిది” అంది జాకీ.

ఆ మాటలతో శరణ్యని హెచ్చరించి కంపు అత్తయ్యలిద్దరూ వెళ్లి పోయారు, వీధి తలుపులు ఎప్పటిలాగే తాళం వేసి వెళ్ళిపోయారు.

వాళ్ళు వెళ్ళాక తలుపు లోపలి గడియలు వేసి, బాబు దగ్గరకి పరుగు పరుగున వచ్చింది శరణ్య ..

నరేంద్ర వెక్కి వెక్కి ఏడుస్తూ తిన్నది అంతా కక్కుకొన్నాడు. సహ్రాన్య ఓపికగా వానిని శుభ్రం చేసింది.

‘తనని ఫాల్స్’ ఇంటర్వ్యూ చేసి ఇరికించారట! తన విషయం ఎలా తెలిసి ఉంటుంది! ‘ ఆలోచించగా ఆమెకి ఆ రోజు ‘పనాహ్’ ఆఫీసులో కలిసిన వాచ్’మెన్’ ఆ నలుగురు అభ్యర్థులు సినిమాలలో ఎక్స్’ట్రా వేషాలు వేసే వాళ్లలాగే కనిపించారు. తను తన ఆత్రుత వల్ల ఆ సంగతి కనిపెట్టలేక పోయింది. వాళ్లని ఎక్స్’ట్రాలని సప్లయి చేసే అవినాష్’ కుదిర్చి ఉంటాడు.

అందుకే ఆఫీసు బయటికి రాగానే ‘అవినాష్’ కనిపించాడు. తన గురించి వాళ్ళు అవినాష్’ దగ్గరే తెలుసుకొని ఉంటారు! పాపం అవినాష్’ తన మీద అభిమానంతో అల చెపి ఉంటాడు. ఇందులో అతని తప్పేముంది?’

మర్నాటి రాత్రి ఆఖరిదని స్పష్టంగా చెప్పి వెళ్ళారు వాళ్లు. అంటే ఇంకో అత్యాచారం మిగిలిందన్న మాట! ఏ విధంగా చేస్తారు! ‘కత్తి  చూసినా, మేకు చూసినా, చివరకి చెంచాని చూసినా వాడు ఆవేశం వచ్చి రేచ్చిపోవాలి’ అన్న రాఖీ మాటలు ఆమెకి గుర్తు వచ్చాయి. కత్తి  మేకు రెండూ  అయిపోయాయి.

ఇంకా చెంచా మిగిలి ఉందన్న మాట! చెంచాతో టార్చర్’ ఎలా చేస్తారు? దానిని నోట్లో దూరుస్తారా ! ప్రాణాలు పోతాయి. వాడి ప్రాణాలు తీయడం వాళ్ల ఉద్దేశం కాదు. మరేం చేస్తారు! ‘కొంపదీసి మలద్వారంలో తోయ్యారు కదా! ఆ ఆలోచనకే శరణ్య ఒళ్లు జలదరించి శరీరం కంపించింది శరణ్యకి.

‘అమ్మబాబోయ్! నరేంద్రని ఈ విపత్తు నుంచి ఎలా తప్పిస్తుంది?’ తిన్నదంతా వంటి చేసుకొన్న  నరేంద్రకి పాలు పెట్టి, జ్వరం , నొప్పులు తగ్గించేందుకు ‘పేరాసిటమాల్’ ద్రాప్సు వేసి సోఫాలోనే పడుకో బెట్టింది ఆమె.

తను నరేంద్రని తీసుకొని పారోపోలేదు. బయట తాళాలు వేసారు. ఒకవేళ బయటపడినా, వీళ్లు పోలీసు రిపోర్టు ఇస్తారు. నరేంద్రని తనే కిడ్నాప్’ చేసిందని ఆ పైన వాడి మీద అత్యాచారం చేసిందని కంప్లయింటు ఇస్తారు. పోలీసులు వాళ్ల మాటలే నమ్ముతారు. పైగా తన గతాన్ని త్రవ్వి తీస్తారు. అందువల్ల పారిపోవడం వల్ల ప్రయోజనం లేదు. ఇక్కడే ఉంది ఈ అత్యాచారం నుండి నరేంద్రని రక్షించాలి. కాని అదెలా సాధ్యం? తను ఒంటరి ఆడది! పైగా సేవకురాలు, వాళ్లు ఇద్దరు, అర్థబలం, అంగబలం గల యజమానులు! తను ఏం  చెయ్యగలదు?!’

నిద్రలోనే బెక్కుతున్న నరేంద్రని చూసి ఆమెకి భయం వేసింది.

అప్పుడు ఆమెకి చిన్నప్పుడు తను చదివిన పోతన భాగవతం లోని ‘గజేంద్ర మోక్షం’ కథ జ్ఞాపకానికి వచ్చింది.’మొసలితో వేయి సంవత్సరాలు యుద్ధం చేసి, సర్వ శక్తులూ కోల్పోయిన గజేంద్రుడు దిక్కు కానరాక ‘లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యె’ అంటూ శ్రీహరిని ప్రార్థిస్తాడు.

ఇప్పడు తను కూడ అదే పని చేయాలి. తన పిచ్చిగానీ ఈ కలియుగంలో దేవుడు వస్తాడా? దేవుడు స్వయంగా రాకపోవచ్చు! ఎవరైనా లేకే మానవాతీత శక్తినయినా పంపించవచ్చు! అవును, నరేంద్ర సమస్యని ఏదో ఒక అలౌకిక శక్తి మాత్రమె తీర్చగలదు.

శరణ్య నరేంద్ర పడుకొని ఉన్న సోఫా ప్రక్కనే కూర్చొని, కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించింది. “ హే  భగవాన్! ఏ పాపమూ ఎరుగని ఈ నిర్భాగ్య శిశువుని కాపాడు. వీడికి ఇప్పుడు కావలసినది కోట్ల ఆస్తి కాదు, తల్లి ఒడి లోని లాలన! అది పసివాని హక్కు! దాని నుచి వాణ్ని దూరం చెయ్యకు, ఈ నరేంద్రని పిచ్చివానిగా చెయ్యకు! ఈ అత్యాచారాన్ని ఎదో విధంగా ఆపు!’ అని కళ్ళు మూసుకొని ప్రార్థన లోకి దిగిన శరణ్య అలాగే మగత లోకి జారుకోంది.
ఏదో వికృతమైన నవ్వు, వికటాట్టహాసం అంటారే, అలాంటిది వినిపించి కంగారుగా కళ్ళు తెరచింది.

సోఫామీద నరేంద్ర కూర్చొని ఉన్నాడు! వాడి కళ్ళు సాగదీసి క్లిప్పులు పెట్టినట్లు పొడవుగా, వెడల్పుగా ఉన్నాయి. ఆ కళ్ళల్లోంచి వెలువడుతున్న చూపులు విస్ఫులింగాలని వెదజల్లుతున్నాయి!!

శరణ్య ఆశ్చర్యంతో నరేంద్ర వంక చూసింది. ఆ తరువాత తన చుట్టూ చూసుకోండి. అంతా సరిగానే ఉంది. పరిసరాలలో ఏ మార్పూ లేదు! ఇది వరకు పడుకొని ఉన్న నరేంద్ర ఇప్పుడు సోఫాలో కూర్చొని ఉన్నాడు! అంతే! మార్పు నరెంద్రలోనే వచ్చింది!

నరేంద్ర ఉన్నట్లుండి  నవ్వు ఆపాడు. శరణ్య వాడి వంక చూసింది.

అతడామె ముఖాన్ని రెండు చేతుల్లోనూ తీసుకొని ఆమె మీదకి వంగి, నోరు తెరచుకొని తన పళ్ళ మధ్య ఆమె ముక్కుని దొరక బుచ్చుకొని కసిక్కున కొరికాడు!!      

(ఇంకా ఉంది)

Comments



  1. హారర్ నవల ఇంత సున్నితం గా రాయొచ్చన్న మాట :)

    హారర్' నవల:
    నిద్రలో కూడా అదిరిపడి లేస్తూ, దుఃఖిస్తున్న కుర్రాడిని చూసి, అవినాష్'కి ఫోన్’చెయ్యాలని శరణ్య తన మొబైల్’ తీసి దానిని ‘అన్’లాక్’ చేసింది. అన్’లాక్’ చేయగానే, ‘ఇన్’సర్ట్’ సిం’ అనే సందేశం వచ్చింది.శరణ్య ఆశ్చర్యంతో ఫోను తెరచి చూసింది


    జిలేబి

    ReplyDelete
  2. జిలేబి గారూ! మీ కామెంటుకి ధన్యవాదాలు.
    ఇంత హారర్' నాకు తెలియదు. ముంబయి మిర్రర్'లో 3 ఏళ్ల క్రితం పడిన ఒక శిశువు పడిన వేదన, వాడి మేనత్తలు ఆస్తి కోసం పిచ్చివాన్నిగా చెయ్యాలనే ప్రయత్నం బయట పడి అది సంచలన వార్తగా ప్రాచుర్యం చెందింది! ఆ వార్తా కథనం చదివాక నాకు వారం రోజుల పాటు నిద్ర రాలేదంటే నమ్మండి!! అందుకే దానినే ఇతివృత్తముగా చేసుకొని మినీ నవల వ్రాసాను. 3 పత్రికలూ తిరిగి చివరికి ఆంద్ర భూమి దీనిని ప్రచురించింది క్రిందటి సెప్టెంబరు అక్టోబరు మాసాల మాస పత్రికలో!!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ