Skip to main content

కొరకంచులో ఇనప మేకు--4

హారర్' నవల :

బాధతో కెవ్వున అరిచి నరేంద్రని తోసేసింది శరణ్య. ఆమె ముక్కు నుండి ధారాపాతంగా రక్తం కారుతోంది. నరేంద్ర నోటి నిండా, పళ్ళ మీదుగా రక్తం కారుతోంది!

‘ఏమిటిది, ఏమయింది వీడికి? అప్పుడే పిచ్చి ఎక్కిందా? చివ్వున లేచి. మందుల అరా లోంచి దూది, బేండేజి తీసి ఆ రక్తాన్ని తుడిచేసింది.


ఆశ్చర్యం!

రక్తం అదృశ్యమయింది! ఆమె ముక్కు మీద గాయం ఆనవాలు కూడ లేదు!! ఆమె పోగొట్టుకొన్నది కేవలం పుట్టుక తోనే వచ్చి, ఆమెని వేధిస్తున్న ముక్కుపైన వడ్లగింజ, అదే ఉసిరికాయ పరిమాణం లోని గుండ్రని ముక్కు అగ్రభాగం మాత్రమే!!!

శరణ్య తన కళ్ళని తనే నమ్మలేక పోయింది.

ఎలాంటి కాస్మటిక్’ సర్జరీ లేకుండానే తన సమస్య తీరిపోయింది. అది నరేంద్ర చేసాడు అంటే నమ్మశక్యం కావడం లేదు! తను వాడి క్షేమం కోసం దేవుణ్ణి ప్రార్థించింది, ఆ దేవుడో లేక దెయ్యమో వాడి ద్వారానే తన సమస్య తీర్చింది! అంటే ఏమిటర్థం, ఏమిటీ ఆశ్చర్యం??

నరేంద్ర ఏమీ తెలియనట్లు తిరిగి సోఫా మీద పడుకొని ఉన్నాడు. శరణ్య వాణి వంక చూసింది. ‘నరెంద్రేనా ఇంత  పని చేసింది? ఇలా చేసాడంటే అతనిని ఎదో మానవాతీత శక్తి ఆవహించి ఉంటుంది! దీనిని బట్టి చూస్తే, మర్నాడు జరగ బోయే అత్యాచారాన్ని ఆ శక్తి ప్రతిఘటిస్తుందేమో!!

శరణ్య ఆనందంతో లేచి వెళ్లి ముఖం కడుగుకొని అద్దంలో చూసుకొంది.

ఆ తరువాత లోపం లేని సౌందర్యాన్ని పదే పదే తనివి తీరా చూసుకొంది. తన ముక్కు ఇప్పుడు  ‘విద్యాబాలన్’ ముక్కులాగ ఎంత అందంగా ఉంది!” అనుకొంది.

ఈ ముక్కుని చూస్తే  రాఖీ, జాకీలకి అనుమానం రావచ్చు! అందువల్ల బేండేజి కట్టి ఉంచడం మంచిది! వాళ్లు వచ్చే ముందు బేండేజి కట్టుకొంటే సరిపోతుంది అనుకొని, నరేంద్రని లేపి బువ్వ తినిపించింది. నరేంద్ర ఇప్పుడు ఏడవడం లేదు.వాడి జ్వరం మంత్రం వేసినట్లు తగ్గింది! గాయాల వల్ల బాధ కూడ దాదాపు తగ్గినట్లే ఉంది. కేవలం మచ్చలు మాత్రమే మిగిలాయి! శరని వాడిని ముద్దులు పెట్టుకొని తన ప్రక్కలోకి లాగుకొని నిశ్చింతగా నిద్ర పోయింది.

మర్నాడు సాయంత్రం యథాప్రకారం జరగబోయే ఘాతుకాన్ని చూడలేక కాబోలు, సూర్యుడు అస్తమించి కళ్ళు మూసుకొన్నాడు!

రాఖీ జాకీల కారు ఇంటి ముందు ఆగింది.

కాలింగు బెల్’ మ్రోతకి శరణ్య తలుపు తీసింది. రాఖీ, జాకీలు లోపలికి వచ్చారు.

శరణ్య ముక్కు మీద బేండేజి చూసిన రాఖీ, జాకీలు ఒకేసారి ప్రశ్నించారు, “ఏయ్! ఏమైంది నీకు? ముక్కుకి కట్టు ఎందుకు కట్టుకొన్నావు?” అని.

శరణ్య దీనంగా ముఖం పెట్టి జవాబిచ్చింది. “నరేంద్ర మీ మీద కోపాన్ని నా మీద చూపించాడు. నా ముక్కుని పళ్ళ మధ్య ఇరికించి కొరికేసాడు” అని.

“మంచిపని అయింది. వాణ్ని ఇంకా సపోర్టు చెయ్యి” అంది రాఖీ.

“ అదా సంగతి! వాడి పిచ్చి మా అంచనాల కన్నా ముందుగానే మొదలయిందే!” అంది జాకీ నవ్వుతూ.

“ఔను పిచ్చి తలకి ఎక్కింది. అందుబాటులో ఉన్న నాముక్కు చివర కొరికేసాడు. వాడికి ఎలాగూ పిచ్చి ఎక్కింది కదా ఇక వదిలెయ్యండి” అంది శరణ్య
.

“నో, నో!” ఇద్దరూ ఒకేసారి అరిచారు. “మా కళ్ళతో చూస్తే గాని మేము ‘కం’ఫార్మ్’ చేసుకోలేము” అంటూ తమతో తెచ్చిన స్టీలు చెంచా తీసారు. నరేంద్రని చెరో రెక్కా పట్టుకొని ‘కిచెన్’ టేబులు’ మీద పడుకోబెట్టారు. నరేంద్ర ఇదివరకు లాగ ఏడవలేదు, గింజుకో లేదు! అది చూసిన వాళ్లకే ఆశ్చర్యం కలిగింది.

రాఖీ వాడిని బోర్లా పడుకోబెట్టింది. జాకీ వాడి నిక్కరుని విప్ప బోయింది.

ఆశ్చర్యం! నరేంద్ర నిక్కరుని విప్పుతున్న జాకీని ఒక్క తాపు తన్నాడు!

అది ఊహించని జాకీ వెనక్కి తూలి  పడింది. రాఖీ చేతిలోని స్టీలు చెంచాని లాగుకొని, నరేంద్ర దూరంగా విసిరేసాడు. క్రిందటి రోజు వాళ్ళు ఆర్పేసి వదిలేసిన ‘కొరకంచు’ ఎప్పుడు తెచ్చాడో ఏమో, కిచెన్’ టేబులు మీదనే ఉన్నదానిని చేతితో పట్టుకొని ముందుగా రాఖీ మీదకి లంఘించాడు!

మరు క్షణం రాఖీ కెవ్వుమని అరిచింది. ఆమె కుడు కన్ను గ్రుడ్డుతో సహా ‘కొరకంచు లోని ఇనాప మేకుతో’ పెకిలించి, పారేసాడు

నరేంద్ర!! జాకీ ఆ చర్యని అడ్డుకోబోయింది. ఆమె ఎడమ కంటి కనిగ్రుడ్డుని  కొరకంచులోని ఇనుపమేకుతో పెకలించి పారేసాడు!!!

లబో, దిబో మంటూ ఆ కంపు ఆత్తయ్యలిద్దరూ తమ తమ చున్నీలతో కళ్ళు తుడుచుకొంటూ కారుతున్న రక్తాన్ని అరికట్టే ప్రయత్నం చేసారు.

శరణ్య దూది, బేండేజి తెచ్చింది. “కాస్త ఓర్చుకోండి మేడం! నేను కట్టు కడతాను, నేను ముందుగానే చెప్పాను, వాడు నన్నే వదల లేదు! మిమ్మల్ని వదులుతాడా? పిచ్చి బాగా తలకెక్కింది మేడం!” అంది.

రాఖీ అరిచినంత పని చేసింది “మాకు నీ సానుభూతి అవసరం లేదు. పాడవే జాకీ, వెంటనే కారులో ఆస్పత్రికి వెళ్దాం” అంటూ ఆమె చెయ్యి లాగుతూ, బయటికి తీసుకెళ్లింది. లంఖిణీలు ఇద్దరూ ఆ విధంగా భంగపడి బయటికి పరుగెత్తారు.

అదే సమయంలో గదిలో ఏదో భయంకరమైన శబ్దం వినిపించింది. శరణ్య  అక్కడకి పరుగెత్తింది.

అక్కడ ఆమె చూసిన దృశ్యం!

ఎవరికైనా గుండెలు అవిసిపోయేలా చేసే దృశ్యం!!

ఎలా జరిగిందో ఊహించ శక్యం కాని దృశ్యం! ఆ దృశ్యం ఆమెని దిగ్భ్రాంతురాలిగా చేసింది.

ఆ గదిలోని డబుల్’ కాట్’ మంచం, ఎదో శక్తి వచ్చి లేవదీసినట్లు నిట్టనిలువుగా నిల్చొని ఉంది. దాని క్రింద నాలుగు చదరపు అడుగులు వైశాల్యం గల నాలుగు ‘టైల్సు’ ఎవరో బాంబుటో బ్రద్దలు కొట్టినట్లు పగిలిపోయి ఉన్నాయి!! ఆ పగిలిపోయి ఉన్న  టైల్సు క్రింద నెలలోని సొరంగం స్పష్టంగా కనబడుతోంది!!!


(ఇంకా ఉంది)

Comments

  1. చాలా కాలం తరవాత!
    మొదటి నుంచి చదువుతున్నా!!
    ఒక్కసారిగా పెద్ద మార్పు :)

    ReplyDelete
  2. నమస్కారం శర్మ గారూ! క్షీరగంగకి స్వాగతం!
    పెద్ద మార్పు ఏమీ లేదు, ఒక నిజమైన వార్తా కథనం చదివి మనసు చలించి ఈ రచన చేసాను.
    మూడు పెద్ద పత్రికలూ ప్రచురించ లేదు ! బహుశా వాళ్ళకి శిశువు పైన అత్యాచారం ఎక్కువ అనిపించి ఉంటుంది! అయినా నేను కథని మార్చ లేదు. హారర్' కథలో హింస లేకుండా వ్రాయడం ఎలా? చివరకి ఆంధ్ర భూమి గత సవత్సరం సెప్టెంబరు అక్టోబర్' సంచికలలో దేనిని మినీ నవలగా ప్రచురించింది. ఆ విధంగా ఆలస్యమయింది. అంతే కాక మరొక అద్భుతమైన రచన "ఎ.టి.ఎం. చింత చెట్టు'అని పేరు పెట్టి వ్రాసాను. ప్రస్తుతం చతుర పరిశీలనలో ఉంది. ఇవన్నే రాయడానికి పూనుకోవడం వల్ల ఆలస్యం అయింది. మరొకసారి ధన్యవాదాలు!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద