Skip to main content

కొరకంచులో ఇనప మేకు -5

హారర్' నవల:

తన కళ్ళ ముందే మంచం నిల్చొని, దానిక్రింద నేల చీలిపోయి, ఏర్పాటయిన సొరంగ ద్వారం చూస్తూ చాలసేపటికి గాని తేరుకోలేక పోయింది శరణ్య. “ఏం జరుగుతోంది?!’ శరణ్యకి అర్థం కాలేదు
.
‘తను నరేంద్రని రక్షించమని ప్రార్థన చేసింది. దేవుడో మరేదైనా మానవాతీత శక్తో వాడికి బలాన్ని ఇచ్చి రక్షించింది. తన అవసరాన్ని కూడ తీర్చింది.కాని ఈ సొరంగ మార్గం ఎందుకు తెరచింది?’ పారిపొమ్మని చెప్పడానికా? పారి పోవడం దేనికి?’

కాసేపు తర్కించాక పారిపోవడం దేనికో శరణ్యకి అర్థం అయింది.

రాఖీ, జాకీలు ఉత్తనే కూర్చోరు! నరేంద్ర కిడ్నాప్’ కథ అల్లి, వాడి విడుదల కోసం తానూ మూడు లక్షల రూపాయలు ‘రేన్సామ్’ డిమాండ్’ చేసిందని చెప్తారు.

పనాహ్’కంపెనీ ప్రకటన, ఆ ఇంటర్వ్యూ అన్నీ కల్పితం గనుక తన మాటలు ఎవరూ నమ్మరు.అత్యాచారం చేసింది తనేనని, అడ్డు పడితే కనుగ్రుడ్లు పీకేసిందని కూడా చెప్తారు. ఆ నేరాలన్నీ తన మీద ఆరోపించి పోలీసుల దగ్గర ‘ఎఫ్.ఐ.ఆర్’ వ్రాయిస్తారు.అసలు ఈ పాటికే కంప్లయింట్’ ఇచ్చారేమో!

అందుకే ఈ సొరంగ మార్గం తెరచుకొందేమో!

ఇప్పుడేమి చేయాలి? ఒంటరిగా పారిపోవాలా లేక నరేంద్రని కూడ తీసుకొని పోవాలా? నరేంద్రని వదిలేసి వెళ్తే వాడి భవిష్యత్తు ఏమవుతుంది? ఇలాంటి రాక్షసి అతయ్యల దగ్గర వదిలేసి ఎలా వెళ్ళిపోతుంది? వాడిని ఎలాగైనా కాపాడి వాడి తాతగారి దగ్గరకి చేరుస్తే చాలు!’

శరణ్య వెంటనే హాలులోకి వచ్చి, సోఫా మీద పడుకొని ఉన్న నరేంద్రని లేపింది. “నరేంద్రా! మనం ఇక్కడ నుంచి పారిపోదామా?”

“అలాగే, ఆంటీ! అక్కల కంపు అత్తలు, బాబాయిలు ఉండలా?”

ఉండరు, నువ్వు నేను ఉంటాం!”

“అలాగే! నాతో  నా బొమ్మలు తెచ్చుకోవచ్చా?”

“తెచ్చుకోవచ్చు! నీ బట్టలు, బిస్కెట్లు, పాలడబ్బాలు అలాగే న సామాన్లు అన్నీ నేను సర్దుతాను. నువ్వు నీ బొమ్మలు దీంట్లో సర్దుకో” అంటూ ఒక సంచీ ఇచ్చింది శరణ్య.

అరగంటలో సామాన్లన్నీ సర్దేశింది శరణ్య. నరేంద్ర సంచీలో ఏ బొమ్మలున్నాయో అని కుతూహలంతో చూసింది.

కొన్ని రేసు కార్లు, ఒక బాల్'తో  పాటు ‘ఇనప మేకు ఉన్న కొరకంచు’ కూడా ఉండడం చూసి విస్తుపోయింది.

‘నరేంద్రా! ఇదెందుకు నీకు, ఇది బొమ్మ కాదె?” అని అడిగింది.

“అది నా ఆయుధం!” అన్నాడు నరేంద్ర.

ఆ మాటలు ఎంత అధికార పూర్వకంగా, గంభీర స్వరంతో అన్నాడంటే అవి మూడేళ్ళ నరేంద్ర అన్నట్లు లేవు! వాడి నోటి నుండి ఇంకెవరో అన్నట్లు వినిపించాయి!!

శరణ్య అర క్షణంలో తేరుకొని వాడి తల నిమిరి “సరే పద!” అంది. సంచీ పట్టుకొని వీధి తలుపు వైపు వెళ్తున్న నరేంద్రని ఆపి,  “అటువైపు కాదు నరేంద్రా! గదిలోకి పద!” అని గది లోపలి తీసుకెళ్ళి అక్కడ ఏర్పడిన సొరంగాన్ని చూపించింది.

“బలే, బలే!” చప్పట్లు చరిచాడు నరేంద్ర.

శరని నరేంద్ర చేయి పట్టుకొని సామాన్ల సంచీని భుజానికి తగిలించుకొని మరొక చేతితో ‘టార్చిలైటు’ పట్టుకొని సొరంగ మార్గం లోకి చొరబడి మెట్లు దిగ సాగింది.

ఆఖరి మెట్టు దిగగానే నరేంద్ర చేతిలోని బొమ్మల సంచీలోంచి ఆయుధాన్ని బయటికి తీసాడు. దాని ఇనప మేకుని సొరంగ ద్వారం వైపు చూపిస్తూ గాలిలో మూడు సార్లు వలయాకారంలో త్రిప్పాడు, అంతే!

గదిలో బ్రద్దలయిన సొరంగ మార్గం మీద టైల్సు నాలుగూ తిరిగి ఏమీ జరగనట్లే అతుక్కొని ఉండిపోయాయి! ఆ తరువాత పెద్ద శబ్దం చేస్తూ మంచం కాబోలు యథా స్థానంలో వాలిపోయింది! ‘కంపు అత్తయ్యలు వచ్చి వెతికినా తమ ఆచూకీ సులువుగా తెలియదు’ అనుకొంది  శరణ్య.

నరేంద్ర వంక ఆమె తన విశాలమైన కళ్ళు విప్పార్చి చూసింది. ‘అది నా ఆయుధం!” అన్న నరేంద్ర మాటల అంతరార్థం ఆమెకి తెలిసింది.మాంత్రికుడికి మంత్రం దండం లాగ నరెంద్రకి ఈ ‘కొరకంచులో ఇనప మేకు’ ఉపయోగ పడబోతోందనే విషయాన్ని ఆమె గ్రహించింది!

నరెంద్రకి తానూ కాదు, నరెంద్రే తనకి రక్షకుడు కానున్నాడని సంతోషించింది. ఇంకా ఎన్ని విచిత్రాలు చూడాలో అని అనుకొంటూ చుట్టూ ప్రక్కల ఉన్న పరిసరాలని చూసింది. ‘పిక్నిక్’లో చిన్నప్పుడు తను చూసిన ఎల్లోరా గుహలు ఆమెకి జ్ఞాపకానికి వచ్చాయి. ఆ సొరంగ మార్గం రెండు వైపులా ఉన్న చిన్న చిన్న గుహలు చూడగానే!

విశాలమైన గుహ యొక్క పైన భూమి మీద బహుశా  ‘ఆ రెండంస్తుల హవుస్’ కట్టి ఉంటారు.క్రిందనున్న గుహల సంగతి తెలిసి కట్టారో, తెలియకుండానే కట్టారో ఆ పరమాత్ముడికే  తెలియాలి! రాఖీ జాకీలకి దీని సంగతి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే పనాహ్’  ఆఫీసు సైటు లాగే దీన్ని కూడా అద్దెకి తీసుకొని ఉండాలి!

శరణ్య ఆ గుహల వంక చూసింది. అవన్నీ నిర్మానుష్యంగా, ఖాళీగా గంభీరంగా తమ గత వైభవ చిహ్నాలైన దేవీ, దేవతా మూర్తులని తనలో ఇముడ్చుకొని దర్శనమిచ్చాయి!!

శరణ్యకి తను బాల్యంలో ‘ఇన్’మేట్’గా గడిపిన ‘తీహారు ‘జైలు గుర్తుకొచ్చింది ఆ గుహలని చూడగానే!!

శరణ్య తన గతాన్ని, తనకి తెలిసిన విషయాలని నెమరు వేసుకొంది.            

*****

రమ తల్లి కాబోతోందని మరో ఆరు నెలలలో పండంటి శిశువుని ప్రసవించ బోతోందని తెలిసిన మరు క్షణం ఆమె భర్త ‘అనిరుద్ద్’ తన శ్రీ శైల యాత్ర విరమించుకోవాలని అనుకొన్నాడు. “నువ్వు గర్భావటివి గనుక నిన్ను తీసుకొని కొండ మీదకి వెళడం కుదరదు! అందుచేత నేను నా యాత్ర చేయనని చెప్పేస్తాను” అన్నాడు.

“అదేమిటండీ! మిమ్మల్ని నమ్ముకొని నలభై మంది “భక్త బృందం’ యాత్రకి బయలుదేరుతోంది. మీరయితే అక్కడ వింతలూ, విశేషాలు రమణీయంగా, కమనీయంగా చెప్తారని వాళ్ల విశ్వాసం! ఇప్పుడు వెళ్లనని వాళ్ళతో ఎలా చెప్తారు?”

“రమణీ మణి  చెంత లేనిదే కమనీయంగా కథలు చెప్పడం కుదరదని చెప్తాను”

“చాల్లెండి సరసం! నేను రాకపోతేనేం? మీరు వెళ్లి వాళ్ళందరికీ దర్శనాలు, అభిషేకాలు అన్నీ చేయించి రావచ్చు కదా?”

“అలా చేయవచ్చు రమా! కాని నువ్వు ప్రక్కన లేకపోతే ఎదో వెలితిగా ఉంటుంది. నాలో సగ భాగం కోల్పోయినట్లు ఉంటుంది...”

రమ భర్త వంక చూసింది. అయినా కొంటెగా జవాబిచ్చింది. “ఈ మాటలన్నీ ఆ ‘నీలా యక్షిణితో’ కులికినప్పుడు ఏమయ్యాయి?! అప్పుడు నా ఊసు పట్టించుకోన్నారా?” అని.

“ఆ నీలా యక్షిణి నన్ను మాయతో మత్తులో  పడవేసింది రమా మాధురీ! నా జీవితం లోని ఆ ప్రకరణం చాల వింతైనది! విచిత్రమైనది ! అది నా జీవన శైలినే మార్చేసింది”

”నిజమేనండి! అంట వరకు పూజలు, అభిషేకాలు అంటే ఏమీ తెలియని వారు, ఆ తరువాత సిద్ధ తాన్త్రికులై మంత్రవేత్తలుగా మారిపోయారు! మంత్ర శాస్త్రంలో ఎంత ఎదిగారంటే మిమ్మల్ని నమ్మినవారు మీ  కోసం ఎంత కాలమైనా   ఎదురు చూసేంత స్థితికి ఎదిగారు! ఇప్పుడీ ప్రయాణాన్ని ఆకస్మికంగా మానుకోకండి. వాళ్ళు నిరాశ పడతారు. యాత్ర మొత్తం ఆగిపోయినా ఆశ్చర్యం లేదు!!” అంది రమా మాధురి.

“సరే, రమా! నువ్వు చెప్పినట్లే చేస్తాను. నిన్నూ నీ శిశువునీ ఆ శివుడే చూసుకొంటాడు” అంటూ పూజ గదిలోపలికి వెళ్ళిపోయాడు అనిరుద్ద్. ఆ మాటలు అతను యథాలాపంగా అన్నాడో, లేక భవిష్యత్తుని సూచిస్తూ అన్నాడో, అప్పట్లో రమకి అర్థం కాలేదు!!

నలభై మంది యాత్రికులతో శ్రీ శైలం నుండి తిరిగి వస్తున్నా బస్సు కంట్రోలు తప్పి లోయలో పడింది. లోయలో పడుతున్నప్పుడు అనిరుద్ద్’ ఎలుగెత్తి ప్రార్థన చేసాడు. “పరమేశ్వరా! మల్లికార్జున ప్రభూ! ఈ యాత్రీకులందరూ నన్ను నమ్ముకొని వచ్చారు. నా దురదృష్టానికి వాళ్లని బాలి చెయ్యకు, నా ప్రాణాలు తీసుకొని వాళ్లని కాపాడు!!” అని

అంతే! అలాగే జరిగింది! యాత్రీకులందరూ క్షత గాత్రులయ్యారు, కేవలం అనిరుద్ద్’ మాత్రమె శివునిలో ఐక్యంయ్యాడు!

రమకి ఆ వార్త అశనిపాతంలా తగిలింది. ఆమె మనసు అతలాకుతలమయింది.

సరిగ్గా ఆ అవకాశాన్ని ఉపయోగించు కోవాలని అనుకొన్నాడు ఇంటి యజమాని! అతి క్రూరుడు, కాముకుడు అయిన ఆ గృహ స్వామి అద్దె అడిగే నెపంతో వచ్చి, ఆమెని లొంగదీసుకోవాలని వచ్చి ఆమెపై అత్యాచారం చేసాడు. ఆమె లొంగలేదు. దానితో ఆ  బలాత్కార చర్య చాల దారుణంగా మారింది.

ఆమె నగ్న సౌందర్యం ఆ కామాంధున్ని వెర్రి ఎత్తించింది.

ఉబ్బి తబ్బిబ్బులయిన ఆ ఆత్రగాడికి రమ గట్టి ప్రతిఘటననే ఇచ్చింది. ఆత్మరక్షణకి ఆయుధాన్ని వెతుకుతున్న ఆమె కళ్ళకి ఒక కత్తిపీట కనిపించింది.

వెంటనే దానిని ఒడిసి పట్టుకొని ఆ కామ పిశాచి గొంతుని అడ్డంగా తన బలాన్నంతా కూడదీసుకొని నరికింది!! అతని తల, మొండెం రెండు ఖండాలు అయ్యాయి!!!

అంతే!

పోలీసులు రమని  అరెస్టు చేసారు. అద్దె అడగాదానికి వచ్చిన ఇంటి యజమానిని కట్టి పీటతో నరికి దారుణంగా హత్య చేసిందని ఆమెపై నేరారోపణ చేసారు! ఆమె పియన్ అజరిగిన అత్యాచార విషయం మరుగున పడి పోయింది!!

భర్త లేని బ్రతుకు శూన్యమని తోచిన రమని  నిర్లిప్తత ఆవహించింది. ఆమె మానసిక స్థితి బాగు లేనందు వల్ల ఆమెకి 7 ఏళ్ల కారాగార శిక్ష మాత్రమే పడింది!

ఆమెతో పాటు ఆమె గర్భం లోని శరణ్యకి కూడా ‘తీహారు’ జైలు ఆశ్రయమైంది! శరణ్య జైలులోనే జన్మించింది! కిరణ్’ బేడీ ఆ జైలులో స్థాపించిన ‘ఇన్’మేట్’  ప్లే స్కూలులో శరణ్య చేరింది. ఆమెకి మూడేళ్ళ ప్రాయం వచ్చేసరికి రమ చనిపోయింది.

(ఇంకా ఉంది)

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ