Skip to main content

కొరకంచులో ఇనప మేకు--6

హారర్' నవల:

శరణ్యని ఆ జైలు లోని ప్లే స్కూలు నుంచి మరొక ప్రిజన్’ స్కూలుకి మార్చారు. ఎవరూ లేని అనాథ అయిన ఆమె జైలు అధికారులు పర్యవేక్షణ లోనే సంకెలలు లేని నిర్భంద జీవితం సాగించింది! బి.కాం. పూర్తి  చేసింది.

యోగాలో శిక్షణ పొందింది, అభినయ కళ సహజంగానే పట్టుబడిన ఆమె జైలులోని ఎన్నో కార్య క్రమాలలో పాటలు పాడింది, నటించింది, నాట్యమూ  చేసింది. అది చూసిన ఒక ఫిలిం ప్రొడ్యూసరు ఆమెని ‘ముంబయి’ ఆహ్వానించాడు.

శరణ్య ఆ విధంగా ముంబయి చేరింది.

ఆహ్వానించిన నిర్మాత ఆమెకి కనిపించ లేదు! జూనియర్’ ఆర్టిస్టు సప్లయర్’ అయిన అవినాష్’టో ఆమెకి పరిచయం అయింది.

చిన్న చిన్న వేషాలు వేస్తూ తన జీవన  శైలిని సినిమా రంగానికి మార్చుకొనే ప్రయత్నంలో నాటకీయంగా ‘ఆయా’ ఉద్యోగం చేయడానికి వచ్చింది.

అదీ సంక్షిప్తంగా శరణ్య కథ!

ఆమెకి తన తల్లి తండ్రులు ఎలా ఉంటారో కూడ తెలియదు! తల్లి ఫోటో ‘పాతది’ జైలు అధికారులు చూపించగా చూసింది. ..తన తల్లి కథని అక్కడ ‘ఇన్’మేట్లు’ చెప్పగా వింది. అంతే!

***

శరణ్య నరేంద్ర నడుస్తూ నిర్మానుష్యమైన ఆ గుహని దాటారు! అ దార్ ఎక్కడకి వెళ్తుందో తెలియదు! ఏం చేయాలో అంతకన్నా తెలియదు!! అయినా సరే, అజ్ఞాత శక్తి రక్షిస్తుందనే నమ్మకం భవిష్యత్తు మీద ఆశ ఆమెని, ఆమెతో పాటు నరేంద్రని నడిపించాయి!

ఆఖరి గుహ, పదమూడవ గుహ!

ఆ గుహలో ఒళ్లు గగుర్పాటు కలిగించే దృశ్యం!

అదిరిపడి బెదిరిపోయేలా చేసే దృశ్యం!

గుహ మధ్యలో ఒక పూర్తి  ‘మానవ కంకాళం’! పద్మాసన భంగిమలో కూర్చొని జపమాల త్రిప్పుతున్న దృశ్యం!!

నరేంద్ర భయంతో శరణ్యని అతుక్కుపోయాడు!

శరణ్య ముందు బిత్తర పోయింది. గత కొన్ని దినాలుగా వరుసగా చూస్తున్న దృశ్యాలు ఆమె గుండెని దిటవు పరచి భయాన్ని దూరం చేసాయి!!

ఆ కంకాళానికి నమస్కరించి, “మహాత్మా! ఎవరు మీరు? మా ఇద్దరినీ రక్షించి ఇక్కడకి రాప్పించినది మీరేనా?” అని అడిగింది.

మరు క్షణం ఆ మానవ కంకాళం అదృశ్యమయింది! ఆ స్థానంలో శతాధిక వృద్ధుడు అయిన ఒక ముని ప్రత్యక్ష మయ్యాడు! “శరణ్యా! ఈ నరేంద్రని రక్షించమని అడిగావు! వాడి మేనత్తలు ఆదిని పెట్టిన అమానుషమైన యాతన వల్ల వెలువడిన వాడి ఆక్రందనలు విని నా హృదయం కరిగి నేను జోక్యం చేసుకొన్నాను.”

“మహాత్మా, మీరు ఎవరు?” శరణ్య తన ప్రశ్నని రెట్టించింది.

“నేను పార్థివ శరీరాన్ని కాను శరణ్యా! పూర్వ జన్మ వాసనలు, సంచిత కర్మలు మిగిలి నా కంకాళాన్నే ఆశ్రయించి నిల్చిన ఆత్మని! నా జన్మంతా క్షుద్ర దేవతోపాసనలు చేసాను! వాటి ఫలితాలని ఆస్వాదించాను. కాని శివ సాయుజ్యం పొంద గలిగే పుణ్య కర్మలని ఆచరించక పరలోక సౌఖ్యాన్ని పొందలేక పోయాను. అందుకని ఈ కంకాళం తోనే ‘పంచాక్షరి మంత్రాన్ని ‘ తిరగేసి తపస్సు చేస్తున్నాను. ఒకింత మంచి పనిని చేసే అవకాశాన్ని నువ్వు నాకు కలిగించావు! నా పూర్వ జన్మ నామధేయం “మణి కంఠ సిద్ధుడు’. నీ కాళ్ళు పట్టుకొని మిర్రి మిర్రి చూస్తున్నాడే, ఈ బుడతడు నాకు రెండు జన్మల క్రిందట ప్రత్యర్థి అయిన అనిరుద్ధ నామధేయుడు!”

“ఈ నరేంద్ర మీకు గత జన్మల లోని ప్రత్యర్థి అన్నారు! అయితే మీరు రక్షించింది తీసుకొని వచ్చింది ప్రతీకారం తీర్చుకోవదానికా స్వామీ? ప్రేతాత్మలు ప్రతీకారం తీర్చుకొంటాయని విన్నాను. పవిత్రాత్మలు కూడ అలా చేస్తాయా?” ఆతృతతో అడిగింది శరణ్య.

“నువ్వు విన్నది నిజమే బాలికా! పవిత్ర ఆత్మలు సహాయం చేస్తాయే గాని ప్రతీకారం తీర్చుకోవు!! నేను మీ ఉభయులకి సహాయం చెయ్యడానికే సంకల్పించాను.”

“మరి ఈ నరేంద్ర మీ ప్రత్యర్థి అని అన్నారు?”

మణి కంఠ సిద్ధుడు ఆమె తెలివి తేటలకి చకితుడయ్యాడు! “బాలికా! బాగా గుర్తు చేసావు! ప్రత్యర్థి అన్న పదం లోనే ప్రతీకార భావన పొడచూపుతుంది. నరేంద్ర ఇప్పుడు నా మిత్రుడు! సంతోషమేనా?!” అని అన్నాడు.

“సంతోషం స్వామీ! మీ పరు మహిమాన్వితుడైన అయ్యప్ప స్వామిది!! మీకు నమస్కరిస్తే ఆ స్వామికి నమస్కరించినట్లే!! మా ఉభయులకీ ఏ విధంగా సహాయం చేయదలచారో చెప్పండి” అంది శరణ్య అతనికి నమస్కరిస్తూ, లౌక్యంగా!

“బాలికా! నీ వాక్చాతుర్యమునకు సంతోషము కలిగినది! సహాయము ఏ విధముగా చేయగలనో నీవే చెప్పుము!”

“స్వామీ! మా ఉభయులకి జనపదంలో సురక్షితమైన ఆవాసం కావాలి! నరేంద్రని వాడి తల్లి దగ్గర గాని, లేక వాడి తాత దగ్గర గాని చేర్చాలి! ఆ పైన నా మీద అనుగ్రహముంటే...”

“చెప్పుము బాలికా! నీకు నేను చేయగల సహాయము ఎట్టిది?”

“మహాత్మా! నన్ను చలన చిత్ర నాయకీ మణిగా చేయాలి!

మణి కంఠ సిద్ధుడు మందహాసం చేసి, “ఈ గుహలో ప్రాణ వాయు సంచారం తక్కువ! మనుజులు ఇక్కడ రెండు దినములకన్న దీర్ఘ కాలము మనలేరు! కనుక జనపదమునకు పోవలేననుట  ఉచితమే! అట్లే యగుగాక! ఇక్కడ నుండి మరికొంత దూరము పయనించి, దక్షిణ దిశగా గల సంకేర్ణ బాట వెంబడి వెడలిన, మరియొక సోపాన పంక్తి కనపడగలదు! ఆ సోపాన ద్వారము నిన్ను ముంబయి మహా నగరము లోని, ‘అంధేరీ’ జనపదమునకు చేర్చగలదు! అక్కడ ‘పథిక్’ అను పూటకూళ్ళ సత్రము కనిపించును. అందు తాత్కాలిక నివాసము ఏర్పరచుకొని నే మనోభీష్టమును నెరవేర్చుకొన గలవు!.ఈ నరేంద్రుడు నీకు మార్గదర్శి కాగలడు!”

“స్వామీ! ఈ నరేంద్రుడు నాకు మార్గదర్శి యగునా? నమ్మశక్యము గాకున్నది!”

“ఈ బుడతడిని తక్కువ అంచనా వేయుచున్నావు బాలికా! ‘కొరకంచులో ఇనప మేకు’ ద్వారా, వెన్నెముకపై 3 చోట్ల ‘ఇడా, పింగళ , సుషుమ్న’’ నాడులపై వాతలు పడినందు వల్ల వీని ‘కుండలిని’ జాగ్రుతమైనది!! వాళ్లు వీనిని పిచ్చివానిగా చేయాలని తలచారు! కాని వీడు యోగశక్తి చేత సమర్థుడు అయినాడు! ఇక నీవు బుద్దిశాలివి, గనుక గమ్యము చేరుట  కష్టము కాదు!! నిశ్శంకోచముగా  వెడలుము.”

“స్వామీ ! వీడిని మీరు మీ ప్రత్యర్థి అని ఎందుకు అన్నారో ఇప్పుడు నాకు అర్థమయింది! పూర్వ జన్మ సంస్కారము లేనిదే ఇటువంటి విద్యలు అలవడవు !! నాకు నా తల్లి తండ్రుల చరిత్ర,  ఈ నరేంద్ర చరిత్ర వినాలని కుతూహలముగా ఉన్నది!”

 “ఆ వివరములన్నియు నీవు తెలుసుకో వలసినవే బాలికా! వారి చరిత్ర మొత్తము నీకు త్వరలోనే పత్ర మూలమున చేరగలవు!నీ ప్రయత్నములో నీకు అడుగడుగునా విజయము లభించగలదు!” అంటూనే మణి కంఠ సిద్ధుడు అదృశ్యమయ్యాడు! అతని స్థానంలో తిరిగి పద్మాసన భంగిమలో కూర్చొని ఉన్న మానవ కంకాళము, జపమాల త్రిప్పుతూ  కనిపించింది.

శరణ్య ఆ కంకాళానికే నమస్కరించి నరేంద్ర చెయ్యి పట్టుకొని, బయలు దేరింది. కొంత దూరం నడిచి వెళ్ళేసరికి మెట్లు కనిపించాయి.

ఆమె నరేంద్రని తీసుకొని మెట్లు ఎక్కింది. మెట్ల మీదకి చేరుకొన్న తరువాత నరేంద్ర తన ఆయుధాన్ని తీసి, దానికి ఉన్న మేకుని గాలిలో ముమ్మారు త్రిప్పి, ద్వారాన్ని మూసివేసాడు.

శరణ్య చుట్టూ ప్రక్కల పరిసరాలు చూసి, తను అంధేరీ లోని ఒక గార్డెన్లో ఉన్నట్లు తెలుసుకోండి! ఆ గార్డెన్’ గేటు దాటి బయట పడగానే ‘పథిక్’ గెస్ట్;హౌస్’ అన్న బోర్డు కనిపించింది! శరణ్య ఆనందంతో దాని వంక చూసి నరేంద్ర చెయ్యి పట్టుకొని పథిక్’ గెస్ట్’హౌస్’ వైపు అడుగులు వేసింది.


(ఇంకా ఉంది)

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద