Skip to main content

కొరకంచులో ఇనప మేకు--7

హారర్' నవల:

“నరేంద్రా! మణికంఠ స్వామి చెప్పిన పూటకూళ్ల సత్రం ఇదే! లోపలికి  వెళ్లి ఏదైనా గది చూసుకొందామా?”

“అలాగే అక్కా!” అని జవాబిచ్చిన నరేంద్ర వంక ఆశ్చర్యంతో చూసింది శరణ్య.

“నరేంద్రా! నన్ను ఏమని పిలిచావు? అక్కా అనా!” అని అడిగింది.

“అవునక్కా!” ‘ఆంటీ’ అని పిలుస్తే నేను నీ సొంతం కాదని అందాలూ అనుకొంతాలు గదా?” అన్నాడు నరేంద్ర.

‘చిన్న పిల్లాడయినా ఎంత వివేకంతో మాట్లాడాడు!’ అనుకొంది శరణ్య. అయినా స్వామి చెప్పినట్లు వీడు ‘చిచ్చెర పిడుగే!’ అని సమాధాన పడింది.

పథిక్’ గెస్టు హౌస్’ ద్వారం చిన్నదే అయినా లోపల విశాలంగా ఉంది! రిసెప్షన్లో తన పేరు చెప్పి, ఏదైనా రూము మూడు, నాలుగు రోజుల కోసం అడిగింది శరణ్య.

“ఉన్నాయి మేడం! నాలుగో ఫ్లోరులో రూము నెంబరు 413 గది ఖాళీగానే ఉంది. ఎ.సి. కలర్’ టి.వి. , గీజరు, ఎటాచ్’ బాట్’రూము, టాయిలెట్, ముందు ద్రేస్సింగు లౌంజు, స్త్రీలకి ప్రత్యేకంగా ఉంది ! అద్దె కూడ చాల తక్కువే! కేవలం 1600 రూపాయలు” అంది రిసెప్షనిస్టు.

“తానున్న పరిస్థితిలో ఇంత అద్దె ఎక్కువే!” అనుకొంది శరణ్య. ఆమెకి ఇదివరకు ఉండే చాల్ ’ గుర్తుకి వచ్చింది. దాని అద్దె నెలకి 800 రూపాయలు. ఇది రోజుకి 1600 రూపాయలు ! అంటే అరవై రెట్లు ఎక్కువ! తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నంతలో నరేంద్ర “తీసుకో అక్కా! “ అనేసాడు.

“మీ తమ్ముడా! నైస్’ బాయ్!” అంది రిసెప్షనిస్టు.

“అక్కా! అది చూడు” అని హోటల్’ లాబీకి దిగువగా పెట్టిన పెద్ద పోస్తారు వంక చూపించాడు నరేంద్ర. శరణ్య అటు వైపు చూసింది.

‘వర్దమాన నటీ నటులకు సువర్ణావకాశం! మీరు సినిమాలలో నటించాలని అనుకొంటున్నారా? మీలో అభినయ కళ ఉందా?

అయితే పథిక్’ గెస్టు హౌసుకి తేదీ 26/04/ 2010 నాడు ఆడిషన్’కి రండి. వచ్చేటప్పుడు మీ రిజ్యూం’ తీసుకొని రండి. ప్రఖ్యాత దర్శక నిర్మాత ‘వాణీస్’ ఆజ్మీ’ మీలో టేలంటుని పరీక్షించి వారి రాబోయే చిత్రంలో అవకాశం ఇస్తారు!’ అని ఉందా పోస్టరులో! ..

”మేడం రూము బుక్’ చేయమంటారా?” అడిగింది కౌంటర్లో అమ్మాయి.

“ఆ! బుక్’ చెయ్యండి.” అంటూ తన డెబిట్’ కార్డు తీసి అడ్వాన్సు ఇచ్చింది శరణ్య.

గదిలోకి వచ్చి సామాన్లని అలమారాలో పెడుతూ ఉండగానే కాలింగు బెల్’ మ్రోగింది!

శరణ్య “కమిన్” అని అనడంతో, రూము బోయి లోపలి వచ్చాడు. “మేడం! మా మేనేజరు గారు మిమ్మల్ని కలవడానికి వచ్చి పర్మిషన్’ అడుగుతున్నారు...”

“సరే! రమ్మని చెప్పు” శరణ్య బదులిచ్చింది.

మేనేజరు లోపలి వచ్చాడు.” మిస్! శరణ్యా! మీరు ఏ పని మీద వచ్చారో తెలుసుకో వచ్చా? మరేం కాదు, ఆడిషన్’ కోసమే అయితే నేను మీకు సహాయం చెయ్యగలను.” అన్నాడు మేనేజరు.

“నేను ఆడిషన్’ కోసం ప్రిపేరు అయి రాలేదండి! నా ‘రిజ్యూము, ఫోటో ఆల్బము తెచ్చుకోలేదు. నాకు నటన అంటే చాల ఆశక్తి ఉంది”

“నో ప్రోబ్లం, మిస్’ శరణ్యా! ఆడిషన్లు  జరగడానికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. ఈ లోగా అవన్నీ తయారు చేసుకోవచ్చు! నాకు తెలిసిన ప్రొఫెషనల్’ ఫోటోగ్రాఫరు, మన తెలుగు వాడే ఉన్నాడు. అతనిని ఇప్పుడే పిలిపిస్తాను. బై ది బై మీరు చాల అందంగా ఉన్నారు మేడం! పెర్’ఫెక్టు హీరోయిన్’ మెటీరియల్’!! “ అంటూ తన మొబైలు ఫోను తీసి, ఎవరికో రింగు చేసాడు. అటునుంచి రెస్పాన్సు వినిపించగానే “శ్యాం! వెంటనే బయలుదేరి రూము నెంబరు 413 కిరా! ఒక స్టార్’ ఫోటోలు, రిజ్యూము తయారు చేయాలి!!” అన్నాడు అతను.

శరణ్య అతని మాటలకి ఆశ్చర్య పోయింది. అనుమానం కూడ కలిగింది ఆమెకి. అయినా అవసరం తనది కాబట్టి తానెంచుకొన్న వృత్తిలో అలాంటి, పదజాలాలు, పలకరింపులు సహజమైనవే కాబట్టి , చిరునవ్వుతో అతనిని అడిగింది. “ సర్! మీ పేరేమిటి? మీరు తెలుగువారు కావడం నిజంగా నా అదృష్టమే అని చెప్పాలి!”

“మా హోటల్లో తెలుగు సినిమాల నటీ నటుల ఆడిషన్’లే జరుగుతాయి. మిస్ శరణ్యా! ఎపుడూ ఎవరో మార్వాడీలు, మరాఠీలు, పంజాబీలు, కేరళీయులు, గుజరాతీయులు అవకాశం కోసం వస్తారు!! మీరు తెలుగువారు కావడం ‘అదనపు ఎట్రాక్షన్’ కాగలదు! ఫోటోగ్రాఫరు శ్యాం చాల టేలెంట్’డు ! సహజం గానే అందంగా ఉన్న మిమ్మల్ని చాల ఆకర్షణీయంగా ప్రజెంటు చేయగలడు! మీరు తను చెప్పినట్లు సంకోచం లేకుండా మీ ఫోటోలు తీయించుకోండి!”

“అలాగే సర్! మీ పేరు చెప్పారు కారు?”

“నా పేరు విభూతి భూషణ్’ పథిక్’ ! వి.బి. పథిక్’ అని అంటారు అందరూ! మీరు నన్ను భూషణ్’ అనవచ్చు!!”

“అలాగే మిస్టర్, భూషణ్! ఈ ఫోటో ఆల్బంకి, రిజ్యూము తయారు చెయ్యడానికి, ఆడిషన్లు అయ్యేదాకా మీ హోటల్లో వసతికీ సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది..?” అంటూ నసిగింది శరణ్య.

“నథిన్’’ టు వర్రీ! మిస్! ఫోటోగ్రాఫరు ఖర్చు తనంతట అదే జనరేట్’ అయిపోగలదు! ఇక హోటల్లో వసతి  గురించి మీరు చింతించకండి. ఆ విషయం నాకు వదిలెయ్యండి, నేను సదా మీ సేవలోనే ఉంటాను..” అంటూ ఉండగానే ఒక వ్యక్తి కెమెరా పట్టుకొని లోపలి వచ్చాడు.

అతనే ఫోటోగ్రాఫరు’ శ్యాం’ అయి ఉంటాడని, గ్రహించింది శరణ్య. అతనిని చూస్తూనే భూషణ్’ “మిస్టర్’ శ్యాం! ఇఇమే మిస్’ శరణ్య! మంచి ఫోటో జేనిక్’ పేస్’ కదూ!! మిస్’ శరణ్య ఫోటోలు ‘సెల్ఫ్’ ఎర్నింగ్’ పోటేన్షియల్’గా’ ఉండేలా చూడండి. పాపం ఆమె దగ్గర విటమిన్’ ఎం. అదే మనీ తక్కువగా ఉంది! మీరు మీ పని మొదలుపెట్టండి. లాడ్జి రెంటు నేను చూసుకొంటాను. మీకు ఏవైనా లోకేషన్లు, సెట్లు కావాలని అనుకొంటే చెప్పండి, నేను అరేంజ్’ చేస్తాను. వస్తాను” అంటూ సుడిగాలి లాగ బయటికి వెళ్ళాడు భూషణ్.

“గుడ్’ మార్నింగ్! మిస్’ శరణ్యా!” అంటూ విష్’ చేసాడు శ్యాం.

“గుడ్’ మార్నింగ్! మిస్టర్’ శ్యాం! నా ప్రొఫైల్’ తయారు చేయడానికి ఎంత తీసుకొంటారు?”

“ మీ దగ్గర బిల్లు తీసుకోవద్దని, ఫోటోలు ‘సెల్ఫ్’ ఎర్నింగ్’ పోటేన్షియల్’గా’ ఉండేలా చూడమని భూషణ్’ సర్’ చెప్పారు కదా మేడం! మళ్ళీ డబ్బుల విషయం ఎందుకు అడుగుతారు?”

“ ఆ మాటలకి అర్థం తెలియక అడుగుతున్నాను. బిల్లు డబ్బుగా కాక ఎలా పే చేయగలను?”

“మిస్’ శరణ్యా! మీరు చాల అందంగా, ఫోటో జేనిక్’గా ఉన్నారు! మీ ఫోటోలు హాట్’గా ఉండడం ఖాయం!! ముంబయిలో చాల మేగజైన్లు ఉన్నాయి! వాటి కవరు పేజీకి మీరు పోజు ఇస్తే చాలు మీ ప్రొఫైలు తయారయి పోతుంది!”

“లాడ్జి రెంటుకి కూడ అలాగే ఏదో ఉపాయం చెప్తారా మీ భూషణ్’ గారు!!”

“ మేడం , మరి ..మరి..” నీళ్ళు నమిలాడు శ్యాం.

“నేను బెంగళూరు నుంచి వచ్చాను. మిస్టర్, శ్యాం! ఆ రకంగా సంపాదించాలంటే అక్కడ చేసేదాన్ని!”

“సారీ! మిస్’ శరణ్యా! మేకు అభ్యంతరం అయినప్పుడు అలాంటిదేదీ జరగదు! కాని ,ఈరు మా పనికి కేష్’ ఇవ్వ వలసి వస్తుంది.”

“ అదే అడుగుతున్నాను, ఎంత ఖర్చు అవుతుంది?”

“ఆమె కంఠం లోని కాఠీన్యానికి శ్యాం అదిరి పడ్డాడు! ఫోటో ప్రొఫైలు కోసం అయిదారు వేలు అవుతుంది! బెస్ట్’ లోకేషన్లలో తీయాలంటే మరో అయిదారు వేలు అవుతుంది.”

“అంత రేటు ఉంటుందా?”

“మేడం! ఇది సినిమా ప్రపంచానికి సంబంధించిన విషయం! పెళ్ళికి శుభ లేఖ ఎలాగో, సెలక్షన్’కి ఫోటో అంత అవసరం! ప్రెజెంటేషన్’ చూసాకనే ఆడిషన్లకి పిలుస్తారని మరచిపోకండి!”

‘సరే! మీరు ఈ గదిలోనే నా ఫోటోలు తీసి, నా ప్రొఫైలు తయారు చెయ్యండి! 5 వేలు ఇస్తాను. పొతే ఈ నాలుగు రోజులు పోయాక నేను ఎలాగూ ఇక్కడ ఇల్లు వెతుక్కోవాలి గనుక నాకు ఏదైనా ‘హౌసింగు సొసైటీలో చిన్న ఇల్లు చూసి పెట్టండి!”

“మీ సెలక్షన్’ మీద మీకు అంత కాన్ఫిడెన్సు ఉంటే అలాగే చేయండి! నేను ఉంటున్న కాంప్లెక్సు లోనే ఒక ఆన్’ రూము . కిచెన్’ ఎపార్టుమెంటు ఉంది! మీకు కావాలంటే దానిని చూపిస్తాను. మేడం ! ముందు హోటల్’ లౌన్జులో ఉన్న రెడీమేడ్’ స్టోరుకి వెళ్దాం రండి! అక్కడ మీకు కావలసిన డ్రెస్సులు  అద్దెకి తెచ్చుకొన్నాక మీరు అన్నట్లుగానే ఈ రూములో కాక, ఇక్కడకి దగ్గరగా ఉన్న నా స్టూడియోలో ఫోటోలు తీస్తాను.”

“అలాగే! పదండి!” అంటూ నరేంద్ర చెయ్యి పట్టుకొని బయలుదేరింది శరణ్య.

కాదంబరి హౌసింగు సౌసైటీలోని ఆ అపార్టుమెంటుని చూసింది శరణ్య. అద్దె అయిదు వేలు, అడ్వాన్సు ఏభయి వేలు, ఇవ్వాలని చెప్పాడు శ్యాం. ఆ ఇంటిని చూపించి డీలు చేసేందుకు బ్రోకరు చార్జి అయిదు వేలు ఇవ్వాలి.

 ‘ ఈ లెక్కన లక్ష రూపాయలకి కాలం చెల్లినట్లే!’ అనుకొంది శరణ్య. నరెంద్రకి ఆ ఇల్లు నచ్చలేదు! కంపు ఇల్లు అక్కా! ఆ ఇల్లు చూడు! అంటూ పదహారవ అంతస్తులోని ఒక పెంథ్’ హౌసు చూపించాడు నరేంద్ర. శ్యాం వాడి మాటలకి ఫక్కున నవ్వాడు.

“ఆ ఇల్లా బాబూ! దాని అద్దె నిజానికి 35 వేలు! కాని ఆ ఇల్లు గత నాలుగు సంవత్సరాలుగా ఖాళీగానే ఉంది!”

“ఎందుకని, శ్యాం? పెంథ్’ హౌసులో సాధారణంగా హౌసు ఓనర్లే నివాసముంటారు కదా?” శరణ్య కుతూహలంతో అడిగింది.

 “చిన్న పిల్లవాడి దగ్గర ఎలా చెప్పమంటారు మేడం?”

“ఏం, ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయా?” అని అడిగిన నరేంద్ర వైపు ఆశ్చర్యంతో చూసారు వాళ్ళు!!

“అవును బాబూ! అవంటే నీకు భయం లేదా?” అడిగాడు శ్యాం.

“లేదు అంకుల్! అవి మంచివే! కంపు బాబాయిలు అత్తయ్యలూ అంటేనే నాకు భయం!”

“మిస్టర్ శ్యాం! ఈ అపార్టుమెంటునే ఫిక్స్’ చేయండి” అంది శరణ్య.

“వద్దు, అక్కా! దెయ్యంతోనే కలిసి ఉందాం” అన్నాడు నరేంద్ర. శరణ్యకి ఆ మాటలలో నరేంద్ర నిశ్చయం కనబడింది. నరేంద్ర ఉండగా నాకేమి భయము!’ అని అనుకొంది  శరణ్య.

“మిస్టర్’ శ్యాం! ఆ పెంథ్’ హౌసు యజమానిటో కలసి మాట్లాడడం అవుతుందా?” అడిగింది శరణ్య.

“అది అంత అవసరం అంటారా?’ అడిగాడు శ్యాం! మనసులో మాత్రం ‘ఉత్తికే ఎగురలేని అమ్మ స్వర్గానికి ఎగిరిందట!” అనుకొన్నాడు.

“అవసరమే శ్యాం గారూ!అతనితో మాట్లాడడం అవుతుందా?” రెట్టించింది శరణ్య.

“అయితే ‘పథిక్’ గెస్టు హుసుకే’ పదండి! భూషణ్’గరే ఆ ఇంటికి యజమాని!”

భూషణ్’ శరణ్య కోరిక విని హేళనగా నవ్వాడు. “మిస్’ శరణ్యా! మేము చెప్పిన మంచి మాటలు మీ చెవికి ఎక్కలేదు! ఈ బుడతడి మాటలు పట్టుకొని పెంథ్’ హౌసు అడుగుతున్నారు!! అదీ పూర్తిగా ఫర్నిష్’ చేసిన హౌసు! ఒక పని చేయండి, ఈ రాత్రికి ఆ ఇంట్లో ఫ్రీగా పడుకొని చూడండి. రేపటికి కూడ మీరీ మాట అడిగితె అప్పుడు మాట్లాడుకొందాం”

శరణ్య సరేనని అనడంతో భూషణ్’ శ్యాం ఇద్దరూ నిర్ఘాంత పోయారు!!

ఆ భూతాల కొంపలో తెలిసి, తెలిసి నరేంద్ర పైన నమ్మకంతో వానిని తీసుకొని శరణ్య ఒక రాత్రి చుట్టమై వచ్చింది! ప్రక్క మీద పడుకొందే గాని ఆమె గుండె గుబులు గుబులుమంటోంది. నిద్ర కంటికి కరువైంది.

ఆ ఇంట్లో నాలుగు బెడ్’రూములు ఉన్నాయి! అన్నింటి లోను డబుల్’ కాట్’ బెడ్లు వేసి ఉన్నాయి. వాటికన్నిటికీ అటాచ్’ బాత్’’రూములు, వైభవోపేతమైన అలంకరణతో కన్నుల పండువ చేస్తున్నాయి!

ప్రతీ గదిలోను, ఖరీదైన అలంకార సామగ్రి ఉంది! వంటిల్లు గది అంత వైశాల్యంగా ఉంది. బాల్కనీలు, లాంజులు, ఉయ్యాలలు వరండాలు ఉండి, నిజం చెప్పాలంటే మహారాజుల భవంతుల లాగ ఉంది!

రాత్రి పన్నెండు గంటలయింది. గోడమీద గడియారం తలుపు తెరచుకొంది. . ఒక పిట్ట ఆ గడియారంలో నుండి బయటికి వచ్చి, ‘కుహు, కుహు’ అని కూసింది. శరణ్య గుండెలు ఝల్లుమని కంపించాయి! ఆ తరువాత ఆ గడియారం పన్నెండు గంటలు కొత్తగానే ఆ పిట్ట లోపలి వెళ్లిపోయి తలుపులు మూసుకోన్నాయి! అదంతా చూసిన నరేంద్ర “బలే, బలే” అంటూ చప్పట్లు కొట్టాడు! శరణ్య ఆ పనితనానికి ముచ్చట పడింది!

గడియారం పన్నెండు కొట్టగానే  శరణ్య పడుకొన్న మంచం మధ్యనుంచి పరుపుని, మంచాన్ని చీల్చుకొంటూ ‘రెండు చేతులు’ వికృతంగా బయటికి పొడుచుకొంటూ వచ్చాయి!!

ఆ చేతులకి ఉన్న గోళ్ళు పొడవుగా వంకలు తిరిగి పదునుగా ఉన్నాయి! ఆ చేతులు రెండూ శరణ్య గొంతుని పట్టుకొని వాటి పదునైన గోళ్ళని,  ఆమె సున్నితమైన మెడలోకి గ్రుచ్చడానికి దగ్గర దగ్గరగా బిగుసుకో సాగాయి!! ఆమె భయంతో “నరేంద్రా !” అంటూ ఎలుగెత్తి అరిచింది.

(ఇంకా ఉంది)

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ