హారర్' నవల:
నరేంద్ర తన ప్రక్కనే పెట్టుకొన్న ఇనుప మేకు గల కొరకంచుని తీసాడు. దానిని ముమ్మారు త్రిప్పాడు. మంచం క్రింద నుండి పొడుచుకొని వచ్చిన ఆ చేతులు రెండూ ఆగిపోయాయి! ఆ వెంటనే సన్నని ఏడుపు వినిపించింది. చేతులు వెనక్కి మరలి మంచం ప్రక్క యథాప్రకారంగా మారిపోయాయి!!
నరేంద్ర తన ఆయుధాన్ని మళ్ళీ త్రిప్పాడు. “వద్దు, వద్దు, నన్ను హింసించ వద్దు!..” అంటూ సన్నని స్వరం గింజుకొంది.
“చెప్పు నీ పేరేమిటి? ఎందుకిలా చేస్తున్నావు?” అని అడిగింది శరణ్య.
“నేనే!” అన్న మాటలు వినబడ్డాయి!
నేనే, అంటే మాకేలా తెలుస్తుందే అజ్ఞాత ప్రేతమా! నరేంద్రా! నీ ఆయుధాన్ని ప్రయోగించు, ఇది మాట్లాడేలా లేదు!” అని అడిగింది శరణ్య.భయంకరమైన గోళ్ళు గల చేతులు రెండూ, తన గొంతుక పిసికేయ్యకుండా నరేంద్ర కొరకంచు ధాటికి లొంగిపోయి ముడుచుకొని పోవడంతో ఆమెకి ధైర్యం వచ్చింది.
“నా పేరు ‘మానసి! నీలాగే సినిమా నటిని అవుదామని ఆడిషన్’ కోసం పథిక్’ గెస్టు హౌసుకి వచ్చాను.”
“అంటే ఆ హోటల్లో ఎప్పుడూ ఆడిషన్లు అవుతూ ఉంటాయా?”అడిగింది శరణ్య.
“అబద్ధం! అలా బోర్డు పెట్టారు అంతే! అదంతా భూషణ్’ కుట్ర.”
“అర్థమయింది, నువ్వు భూషణ్’ మాయ మాటల్లో పడ్డావు, అంతేనా?”
“అవును ఆ దుర్మార్గుడు నన్ను లొంగ దీసుకొన్నాడు. ఆ తరువాత పెళ్లి చేసుకొంటానని చెప్పి ఈ పెంథ్’ హౌసుకి తెచ్చాడు!”
“ఎలా తప్పించుకొన్నావు?”
“ తప్పించుకో లేక పోయాను. వాళ్ల అత్యాచారానికి గురి అయి నన్ను నేనే పొడుచుకొని చచ్చిపోయాను.”
“అర్థమయింది, అప్పటి నుంచి ఈ పెంథ్’ హౌసుని అంటి పెట్టుకొని ఎవరినీ ప్రవేశించ నీయకుండా చేస్తున్నావన్న మాట!?”
“అవును, నాలుగేళ్ళుగా వచ్చిన వాళ్ళందరూ అప్పటికప్పుడే పారిపోయారు, నువ్వు తప్ప!”
“మానసీ! ఇలా చేయడం వల్ల నీ కేమిటి ప్రయోజనం?”
“భూషణానికి నష్టం కలిగించడం! వాణ్ని మానసికంగా హింసించడం!”
“నీకు కావలసినది ఒకరి మనశ్శాంతిని హరించడం కాదు, నీ ఆత్మ శాంతిని వెతుక్కోవడం!!”
“నాకు అదెలా లభిస్తుంది?”
“నీ పేరు మీద ఎవరైనా పిండ ప్రదానం చేస్తే లభిస్తుంది.” “ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా?”
“తప్పక చేస్తాను, కాని కొంత సమయం పడుతుంది! అది కూడ నివ్వు సహకరిస్తేనే!”
“ఏం చేయమంటావు?”
“నువ్వు చేస్తున్నదే!, నన్ను తప్ప వేరెవరినీ ఈ భవనం లోకి రానీయకూడదు !”
‘అలాగే చేస్తాను, నేను మృతి చెందిన 5 వ వార్షికోత్సవానికి నాకు పిండం పెడితే చాలు!! “ అంటూ తను వెళ్ళిన దానికి సంకేతంగా అక్కడున్న ఒక కార్నర్’ టేబుల్ని ఎత్తి విసిరేసింది. మానసి వెళ్ళాక శరణ్య నరేంద్రని అక్కున చేర్చుకొని నిద్ర పోయింది.
*****
ఉదయం పదకొండు గంటలైంది.భూషణ్’ సహయంతో కలసి ‘పథిక్’ గెస్టు హౌసు’ రిసెప్షను కౌంటు దగ్గరకి వచ్చి, అక్కడున్న అమ్మాయిని అడిగాడు. “మిస్’ శరణ్య! ఫోను చేసిందా లేక వచ్చిందా??” అని.
“లేదు సర్!” జవాబిచ్చింది ఆమె.
భూషణ్’ శ్యామలు ఇద్దరూ ముఖా ముఖాలు చూసుకొన్నారు! శ్యాం కరవ తీసుకొని అడిగాడు “ ఎలా వస్తుంది సర్! మీరు పెంథ్’ హౌసుకి బయట తాళం తగిలించారు కదా?”అని.
“అవును, అది రాత్రికి రాత్రి భయంతో ఎక్కడికైనా పారిపోతుందేమోనన్న అనుమానంతో, బయట తలుపులకి, తాళం బిగించాను. నిజమే! ఎలా వస్తుంది? ఇంతకీ అది క్షేమంగా ఉందా లేదా?” అంటూ శ్యా ముఖం వంక చూసాడు భూషణ్.
“ఆ హౌసులో లేండ్’లైను ఫోను ఉంది కదా! రింగు చేసి కనుక్కోండి సర్? “అన్నాడు శ్యాం. అతని మనసులో ఆదుర్దా ఆ ప్రశ్నలో ధ్వనించింది. ‘తను తయారీ చేసిన ప్రొఫైల్’లలో అంత అందమైన అమ్మాయి ఎవరూ తారసపడలేదు! నిజంగానే ఈ శరణ్య ‘హీరోయిన్’ మెటీరియల్’ అని వాటిని ప్రింట్ చేసినప్పుడే నిర్ణయానికి వచ్చాడతను! అలాంటి అమ్మాయి దుస్సాహసంతో దెయ్యం మహలులో పడుకోవడానికి వెళ్ళింది. అదీ చిన్న కుర్రవాడి సహాయంతో! బ్రతికి ఉందొ లేదో!’
భూషణ్’ తన హోటలు నుంచి పెన్’థ్’ హౌసుకి రింగు చేసాడు.
అది లాంగు రింగు అవుతూ ఉంటే వారిద్దరి ముఖాల లోనూ ఆదుర్దా కనబడింది!
వాళ్ల ఆడుర్దాకి దానిని చాల సేపటి వరకు మ్రోగనిచ్చింది శరణ్య. తరువాత దానిని ఎత్తి “హలో! శరణ్యా! స్పీకింగ్!” అంది కోకిల కంఠంతో!
“హలో, నేను భూషణాన్ని మాట్లాడుతున్నాను.మిస్, శరణ్యా! మీరు క్షేమంగానే ఉన్నారు కదా?”
“నమస్కారమండీ, భూషణం గారూ! నేను నరేంద్ర ఇద్దరం క్షేమంగానే ఉన్నాము! ‘మానసి’ ఇల్లు మాకు బాగా నచ్చింది సార్ ! ఆమెతో మాట్లాడాక మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చాము. ఆమె నన్ను తన ఇంట్లో ఉచితంగా ఉంచడానికి ఒప్పుకొంది!” అంది శరణ్య కొంటెగా.
“ అలాగని అగ్రిమెంటు వ్రాసి ఇచ్చిందా?” వ్యంగంగా అడిగాడు భూషణం.
“దెయ్యాలు అగ్రిమెంట్లు ఇవ్వవు సార్ ! అవి మాట్లాడనే మాట్లాడవు! కాని ఏమన్నా మాట్లడితే అది శిలా శాసనమే!”
“మిస్, శరణ్యా! వెటకారం కట్టిపెట్టి, వాస్తవానికి రా! అది మానసి ఇల్లు కాదు, నా ఇల్లు! మానసి ఎవరో నాకు తెలియదు! పేపర్సు అన్నీ నా పేరు మీద ఉన్నాయి తెలుసా? ‘లా’ కూడ నా పక్షానే ఉంది! నా ఇంట్లో దూరి దురాక్రమణ చేస్తే నేను సహించేది లేదు!నీ తట్టా, బుట్టా సర్దుకొని వెంటనే నీ దిక్కున్న చోటికి వెళ్లి పో! నా హోటలుకి కూడ నువ్వు రానవసరం లేదు!”
“మిస్టర్, భూషణ్!నాకూ, నరెందరకీ ఈ ఇల్లు చాలా నచ్చింది. ఇక వదిలి పెట్టె ప్రసక్తే లేదు! ఒక వేళ వెళ్లాలని అనుకొన్నా, ఎలా వెళ్ళగలను? బయట తాళం బిగించావుగా!”భూషన్’కి కోపం నశాలానికి అంటింది.”ఒసే, రాక్షసీ! నీతో మర్యాదగా మాట్లాడితే లాభం లేదే! తాళం తీయడానికి వస్తానుండు. ఒంటరిగా కాదు , నలుగుర్ర్ని వెంట పెట్టుకొని వస్తాను. ఆ నలుగురూ దెయ్యానికే దెయ్యాల లాంటి వాళ్లు! పావుగంటలో నీ సామాన్లు బయటపడేసి, అరగంట సేపు నీతో ఆడుకొని, నా ఇంటి నుండే కాదు, ఈ ముంబయి నుంచే బయటికి తరిమేస్తారు!”
“తీసుకొని రారా రాక్షసుడా ! నీతో వచ్చే ఆ నలుగురి పేర్లూ నాకు తెలుసు! ‘మరాఠీ దాదా బాబూరావు గొరో, తెలుగు గుండా దున్నపోతు శీను, తమిళ టైగర్’ ఆర్ముగం పిళ్ళై, బీహారు బద్మాష్’ నంకీ యాదవ్’ వీళ్లే కదా! వీళ్లతోనే కదా నువ్వు మానసి గర్భవతి అనైనా చూడకుండా బలాత్కారంతో చెరిచి, చెరిపించావు? నీ కథలన్నీ నాకు మానసి ద్వారా తెలిసిపోయాయి! నిన్ను నేను తక్కువ అంచనా వెయ్యలేదు! తలం తీయడానికి వచ్చి, ఆ రాక్షసులు అందరి తోనూ, కలిసి ఏం చేసుకొంటావో చేసుకొని, ఇల్లు నాకు అప్పగించి వెళ్లు! తెలిసిందా ఇది నా చాలెంజ్!!”
విభూతి భూషణ్’ తన చెవులని తానె నమ్మలేక పోయాడు! తన జాతకాన్నంతా శరణ్య ఎలా చెప్ప గలిగింది? మానసికి తన మీద పడ్డ ముష్కరుల పేర్లే తెలియవు! ఆమెతో అన్ని వివరాలు ఎలా చెప్పింది! ఏమైనా సరే దీనితో పెద్ద చిక్కే వచ్చింది! దీని మీద అత్యాచారం దారుణంగా చెయ్యక తప్పదు !!
తన మిత్రులు నలుగురూ తనతో తప్పక సహకరిస్తారు!
శరణ్యని ’రేప్’ చేసే సీన్లని విడియోగ్రఫీ కూడ తీస్తే, ఇంకా లాభసాటిగా ఉంటుంది! ఆ ఆలోచన వచ్చాక, శ్యాంతో చెప్పాడు భూషణ్! “శ్యాం! నువ్వు నీ వీడియో కెమెరా పట్టుకొని నాతొ పాటు ‘పెంత్’ హౌసుకు రా! అక్కడ జరిగే దంతా రికార్డింగు చెయ్య! నా ఇంటిని దురాక్రమణ చేసిన ఆ శరణ్యని అంత సులువుగా వదలకూడదు!” అని శ్యాంని పంపించేసి, తన మిత్రులందరికీ ఫోనులో ఆహ్వానాలు అందజేశాడు ఆ దుర్యోధనుడు!
మరో గంట తరువాత టాటా సుమోలో వాళ్లు ఆరుగురు కలసి, కాదంబరి హౌసింగు కాలనీ లోని ఆ పెంత్’ హౌసుకి ఆనందంగా కేరింతలు కొట్టుకొంటూ వెళ్ళారు!
(ఇంకా ఉంది)
Comments
Post a Comment