హారర్' నవల
ఆ రోజు సంకటహర చతుర్థి. రోమన్’ కేలండరు ప్రకారం తేది 13.04.2010
.
ముంబాయి మహానగరం లోని ‘చెంబూర్లో ‘ ప్రసిద్ది చెందిన ‘షాపర్’స్టాప్’మాల్’ ప్రక్కనున్న పదేడు అనస్తుల ఆఫీసు కాంప్లెక్సులో ఒక చిన్న ఆఫీసులో ఇంటర్వ్యూ జరుగుతోంది.
ఆ ఆఫీసు కాంప్లెక్సు పేరు ‘శరణ్య’ పదిహేడవ అంతస్తు లోని ఆ ఆఫీసు పేరు ‘పనాహ్! ఉదయం వార్తా పత్రికలో పెట్టి పంపిణీ చేసిన , ఆ పనాహ్’ వారి కర పత్రం ‘శరణ్య’ దృష్టిని విశ్వ్షంగా ఆకర్షించింది...దానికి మొదటి కారణం ఆ సైటు పేరు, తన పేరు ఒకటే కావడం! రెండవది మూడు నెలల పనికి మూడు లక్షల రూపాయల ఆఫర్!
సరిగ్గా మూడు లక్షల రూపాయల కోసమే తాను ఎంతో కాలం నుండి కలలు కంటోంది. ఆ డబ్బు, ‘గుండ్రంగా’ ‘ఉసిరికాయ లాగ’ ముక్కు చివరన పుట్టుకతోనే ఏర్పడిన ’వడ్లగింజ’ లాంటి అవకరాన్ని ఆపరేషన్’ ద్వారా తొలగించుకోవడానికి.
ముక్కు చివరన ఉండే ఆ వడ్లగింజ శరణ్య సౌందర్యానికి మచ్చలాంటిది! అది సరి చేస్తే చాలు ‘సినిమాలో హీరోయిన్’గా తీసుకోవడానికి ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండవని చెప్పాడు అవినాష్.
అతను ‘అష్ట వినాయక్’ ఫిలిం కంపెనీ అసోసియేట్’ డైరక్టరు, జూనియర్’ ఆర్టిస్టు సప్లయరు.అవినాష్’ మాటల ప్రకారం , ‘శరణ్య’ అందాల అపరంజి బొమ్మ! 36,32, 36’ ఫిగరు! ధనస్సుల లాంటి కనుబొమలు, విశాలమైన ఆల్చిప్పల లాంటి కనురెప్పల మధ్య నవరసాలని పలికించగల తేజో పుంజాల లాంటి కళ్ళు, ‘నెలవంక’ లాంటి నుదురు, సుధా మధురాలు చిందించే ‘చేరరే’ పండ్ల లాంటి పెదవులు, గుండ్రని చందమామ లాంటి ముఖం, పసిమి లాంటి మేని ఛాయతో చూడు చూడుమనిపించే సినిమా హీరోయిన్’ లాంటి సౌందర్యవతి! కేవలం ముక్కు చివరన ఉండే వడ్లగింజని తొలగిస్తే చాలు, ఆమె చంద్రముఖి అవుతుంది! సినిమా అవకాశాలు వెతుక్కొంటూ వస్తాయి! అనేవాడు.
అయితే ఆ అవకరాన్ని తొలగించడానికి అయ్యే ‘కాస్మటిక్’ ఆపరేషన్’ ఖర్చు మూడు లక్షల రూపాయలు అవుతుంది! ఎక్స్’ట్రా వేషాలతో ఒక చిన్న చాల్’లో (గూడు లాంటి ఇల్లు) నిలకడ లేని ఆదాయంతో కాలం గడుపుతున్న ఆమె అంత డబ్బు ఎక్కడనుంచి తేగలదు? ఆమెకా మూడు లక్షలు ఎవరిస్తారు?
సరిగా అదే సమయంలో దినపత్రికలో కనిపించింది ‘పనాహ్’ వారి కరపత్ర ప్రకటన!
మూడు నెలల పనికి మూడు లక్షల పారితోషికం! మూడేళ్ళ కుర్రాడి బాగోగులు చ్చోసుకొనే ఆయా ఉద్యోగం. అది కేవలం మూడు పాటే! ఎలాంటి శిక్షణార్హతలు అవసరం లేదట!
ఉండడానికి వసతి, భోజనం వాళ్ళే ఇస్తారు. మూడు నెలల పాటు ఎలాంటి సెలవులు అడగకుండా, ఆ కుర్రాడితో పాటు అజ్ఞాత వాసం చెయ్యాలట!
అలా ఇష్టపడే వారే ఆ రోజు పది గంటలనుండి, రెండు గంటల లోపు నేరుగా ఇంటర్వ్యూకి రమ్మనమని వ్రాసి ఉందా ప్రకటనలో!
ఆ ప్రకటన చూడగానే, శరణ్య ఆలోచనలు రేసు గుర్రాలు ఎక్కాయి. ‘మూడు నెలల పాటు తను ఉంటున్న చాల’ ఖాళీ చేసి వెళ్లిపోవచ్చు. అద్దె బాకీ అని ‘చాల’ ఓనరు అప్పటికే తెగ నసపెడుతున్నాడు! త్న్దికికూడా వెతుక్కోనక్కర లేదు. మూడు నెలలు అజ్ఞాతంగా గడిపేస్తే చాలు మూడు లక్షలు తన స్వంతం అవుతుంది. అడ్వాన్సు చెక్కు కూడా ఇచ్చేస్తారట! దానితో క్రొత్త జీవితం మొదలుపెట్టవచ్చు’.
‘తన పరిస్థితికి తగినట్లే ‘టైలర్’ మెడ్’ ఆఫర్’ తన కోసమే వచ్చినట్లుంది’ అని ఆలోచించింది.
ఆకలి, ఆకాంక్ష, అవసరం మనిషిని పూర్వాపరాలు, ఉచితానుచితాలు ఆలోచిన్చానివ్వదు మరి!కనీసం తానూ ఎక్కడికి వెళ్తున్నదీ ప్రక్క గూడులో ఉండే స్నేహితురాలి కైనా చెప్పలేదు, అది కూడావచ్చేస్తుందని!అలా చెప్పి ఉంటే ఆ కరపత్రం తనకి మాత్రమే వచ్చిందని తెలుసుకొని ఉండేది!
ఉన్నంతలో అందంగా అలంకరించుకొని ఆ కార్యాలయానికి చేరుకొంది శరణ్య. సామాన్యమైన అలంకరణే అయినా అప్సరసలాగ కనిపించిం దామె ! ఆమె ముక్కు మీద వడ్లగింజ కూడ చూడగా, చూడగా బాగానే ఉంది!పదకొండు గంటలకే అక్కడకి చేరినా, ఆమె చివర వరసలో పడింది. ఆమెకన్న ముందు నలుగురు అభ్యర్థులు ఉన్నారు.
వారిలో ఇద్దరు ఆంటీలు, మరో ఇద్దరు అమ్మాయిలూ! అందరి వేష భాషలు సాధారణంగా ఉన్నాయి. వచ్చిన వాళ్లకి చిప్సు, కూల్’డ్రింకు ఇచ్చాడు అక్కడున్న ఒకే ఒక్క అటెండరు, కం గుమాస్తా కం వాచ్’మెన్’!
శరణ్య తర్వాత రెండు గంటల వరకు ఇంకెవరూ రాలేదు. దాంతో ఆ ఆఫీసు షట్టరు సగం వరకు మూసేసాడు వాచ్’మెన్. ‘అమ్మయ్య’ అనుకొంది శరణ్య. కారణం తనతో పాటు అక్కడ అయిదుగురు ఉన్నారు. అయితే ఉన్న నలుగురూ తనకన్న ముందే ఉన్నారు!
రెండు గంటలకి వాచ్’మెన్’ షట్టరు మూసేయగానే, ఇంటర్వ్యూ మొదలయింది. మొదటి ఆంటీ లోపలి వెళ్లి పావు గంట తిరిగి వచ్చింది. శరణ్య ఆత్రుతతో వెళ్లి ఆంటీని అడిగింది, “మేడం! ఏమయింది, అంత వేగం తిరిగి వచ్చేసారు?”
“ముదనష్టపోళ్ళు...” తిట్టింది ఆమె. “పెళ్ళయిన వాళ్లి పనికి రారంట! ఆ సంగతేదో మిందే వ్రాయాచ్చు గదా, అని అడిగాను..”
“ఏమన్నారు?”
“ఏమంటారు, సారీ అన్నారు, సచ్చినోళ్ళు!” అని విసుక్కొంటూ వెళ్ళిపోయింది ఆ ఆంటీ.
శరణ్య రెండవ ఆంటీ వంక చూసింది. ఆమె మేడలో నల్ల పూసల మంగళ సూత్రం ఉంది. వెంటనే వెళ్లి ఆమెకీ విషయం చెప్పింది.
“మేడం! పెళ్ళయిన వాళ్ళకి పని దొరకదట!” అని ! రెండో ఆంటీ ఆ విషయాన్ని కం’ఫర్మ్’ చేసుకొని తానూ కూడ తిరుగు దారి పట్టింది.
అంతలోనే మొదటి అమ్మాయి, ఆఫీసు గదిలోకి వెళ్ళింది. శరణ్య ఆతృతతో ఎదురు చూడసాగింది. ఆ అమ్మాయి మరో అరగంటకి బయటపడింది.
శరణ్య ఆమెని పలకరించింది. “లోపల ఎం ప్రశ్నలు అడిగారు మేడం?” అంటూ.
ఆ అమ్మాయి సుడిగాలి లాగ జవాబిచ్చింది. “నేను డిగ్రీ చదివానని చెప్పాను. అంత చదువుకొన్న వాళ్ళు మాకు అవసరం లేదు, అని పొమ్మన్నారు!” అంది శరణ్య గతుక్కుమంది. తను కూడా డిగ్రీ పూర్తీ చేసింది. అయినా ఆ సంగతి చెప్పకూడదని అనుకొంది.
రెండో అమ్మాయి బయటపడినా ఆమెని ప్రశ్నించే అవకాశం శరణ్యకి కలగలేదు. ఎందుకంటే వెంటనే లోపలికి వెళ్ళవలసి వచ్చింది. శరణ్య బిక్కు బిక్కుమంటూ లోపలికి వెళ్ళింది.
లోపల విశాలమైన టేబిల్’ వెనక ఇద్దరు ఆడవాళ్లు కూర్చొని ఉన్నారు. ఇద్దరికిద్దరూ తెల్లగా, స్థూలంగా, అందంగానే ఉన్నారు. వాళ్ల ముఖాలు ప్రసన్నంగా కాక గంభీరంగా ఉన్నాయి. శిలా సదృశమైన ముఖ భంగిమలు గల వాళ్ల, మనసు లోని భావాలు అతి గోప్యంగా ఉంటాయట!
“నమస్కారం మేడం!” ఇద్దరికీ నమస్కరించింది శరణ్య.
“మీ పేరేమిటి?” అడిగింది కుడిప్రక్క కుర్చీలో కూర్చొన్న మేడం.
“శరణ్య మేడం!”
“నీతో పాటు ఎవరేవరున్నారు, అంటే అమ్మా, నాన్న భాయి వగైరా..”
“నాకు ఎవరూ చుట్టాలు, అయిన వాళ్లు లేరు మేడం! ఒంటరిదాన్ని అయినా ఎనుకలా అడిగారు?” లాంటి ప్రశ్నని ఊహించలెదు శరణ్య.
“మా పని చేయడానికి మూడు నెలలు ఒంటరిగా గడపాలి. నేకు చుట్టాలు, పక్కాలు ఉంటే ఎదో ఒక మిషతో ఫోన్లు అవీ చేస్తూ ఉంటారు కదా, అది మా పనికి అడ్డు తగులుతుంది. అందుకని ఏ బాదర బందీలు లేని వారికే మేము పని ఇస్తాము.”
శరణ్యకి అనుమానం కలిగింది. “అంత రహస్యమైన పని ఏముంది మేడం?”
“మా పని రహస్యమైనదే! చాల రిస్కుతో ఉన్నది కూడా! ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించకుండా పనిచేసే వాళ్లే మాకు కావాలి. మేకు ఏవైనా అనుమానాలు ఉంటే వెళ్లిపోవచ్చు.”
“ఇంతకీ పని ఏమిటి మెడమ్?”
“మేము ప్రకటించినదే!మూడేళ్ళ కుర్రాడికి అన్ని పనులూ చేసిపెట్టే ‘ఆయా’ కావాలి.”
“కుర్రాడితో పాటు రహస్య జేవనం చెయ్యాలా?”
“అవును, మూడు నెలల పాటు వాడి పెంపకం రహస్యంగా జరగాలి.”
“ఆ కుర్రవాడు మీకేమవుతాడు?”
“కుడి ప్రక్క అసహనంగా కుర్చీలో కదిలింది. అది గమనించిన ఎడమ ప్రక్క మేడం, శరణ్య ప్రశ్నకి సమాధానం ఇచ్చింది. “చూడండి శరణ్య గారూ! మూడు నెలల పనికి మేము, మూడు లక్షల పారితోషికం ఇస్తున్నాం. అది కూడా అడ్వాన్సు పేమెంటు! రహస్యమైన పని కాకపొతే అంత సొమ్ము ఎందుకిస్తాం? మేమే చేసుకోవచ్చు కదా?”
శరణ్య ఆలోచించింది. “నిజమే! కుర్రాడి పెంపకంలో కష్టం ఏముంది, వాళ్లే చేసుకోవచ్చు కదా! కొంపతీసి కిడ్నాప్’ కేసు కాదు గదా!’ శరణ్యకి భయం వేసింది. ఆ మాట ధైర్యం చేసి అడిగేసింది.
ఎడమ ప్రక్క మేడం నవ్వింది. “గుడ్’ క్వోచ్చెన్’ శరణ్యా!మీరు చాల సాహసవంతురాలిలాగ కనిపిస్తున్నారు.మీలాంటి సాహస యువతే మాకు కావలసింది. మీరు అడిగినట్లు అది కిడ్నాప్’ కేసు కాదు. ఎందుకంటే ఆ కుర్రాడు మాకు మేనల్లుడే అవుతాడు! ఇదుగో ఈ ఆల్బం చూడండి, ఇది చూస్తె మీ అనుమానాలు తీరుతాయి” అంటూ డ్రాయరు సొరుగు లోంచి ఒక ఆల్బం తీసింది ఆమె. ఇదుగో చూడండి, ఇది మా ఫేమలీ ఫోటో.! మేము, మా తమ్ముడు , మరదలు, ఆమె ఒడిలో బాబు..” అంటూ ఆల్బం అంతా చూపించింది.
శరణ్య అనుమానం తీరింది.’కుర్రాడు ముద్దుగా, బొద్దుగా ఉన్నాడు. ఆ మేనత్తల ఒడిలో కూడా ఫోటోలు దిగాడు. ఇది కిడ్నాప్’ కేసు కాదు. అయినా పెంపకం విషయంలో రహస్యం దేనికో! ఆ మాట అడిగితె పోమ్మంటారేమో!’ఆమె మౌనం వహించింది. ఎక్కడి ప్రశ్న అక్కడే ఉండిపోయింది!
ఎడమ ప్రక్క మేడం నవ్వింది.”శరణ్య గారూ! మీ మనసులో ప్రశ్న నాకు తెలుసు. కుర్రాడు మూడు నెలలపాటు ఇండియాలో రహస్యంగా ఉంచాలి. మా దగ్గర వాడు రహస్యంగా ఎలా పెరగగలడు? రహస్యం బట్ట బయలయితే వాడి తాత వాడిని తోలుకొని పోతాడు. మూడు నెలల తరువాత మా తమ్ముడు వాడిని తీసుకొని అమెరికా వెళ్లి పొతాడు. అప్పుడు కూడా మీ సహాయం మాకు కావాలి. కుర్రాడి తల్లిగా మీరు అమెరికా వెళ్లాలి. మే ఖర్చులన్నీ మేమే భరిస్తాం. అదనంగా డబ్బు కూడా ఇస్తాం.చెప్పండి మీకు అంగీకారమేనా?”
శరణ్య మనసు ఆనందంతో చిందులు వేసింది. “అంగీకారమే మేడం! అదనంగా ఇచ్చే పారితోషికం నాకు అక్కర లేదు. అమెరికాలో నా ముక్కుకి కాస్మటిక్’ సర్జరీ చేయిస్తే చాలు!”
“గుడ్’ అయిడియా శరణ్యా! సర్జరీ కోసం అమెరికా వెళ్తున్నట్లు వీసా తీసుకోవచ్చు! ప్రోబ్లం ఉండదు. మీకు అంగీకారమయితే ఈ చెక్కు తీసుకోవచ్చు.” అంటూ ఒక చెక్కు వ్రాసి శరణ్యకి చూపించింది ఆమె.
“3 లక్షల రూపాయల చెక్కు, అదీ లోకల్! ఆ పైన ఫ్రీగా అమెరికా ప్రయాణం, సర్జరీ కూడా ఫ్రీగా అయిపోయే అవకాశం! ఇంకా ఆలోచన ఎందుకు?’ అనుకొంటూ చెక్కుని అందుకోండి శరణ్య.
“ఆగు!” కుడు ప్రక మేడం గర్జించింది. “కుర్రాడిని చూడడానికి మేము రహస్యంగా, రకరకాల వేషాలలో వస్తాము. మేము ఏం చేసినా నువ్వు ఏమీ అనకూడదు, అడగకూడదు!! నీ పని అయిపోయాక డబ్బు తీసుకొని వెళ్లి పోవాలి. నువ్వు వాడి ఆయావి, అంతే! ‘నోమోర్’’ క్వోచ్చేన్స్’ అర్థమయిందా?” ఆమె మాటలలో మర్యాద లోపించింది.
శరణ్య మౌనంగా చెక్కుని చేతిలోకి తీసుకోండి. ‘తానూ ఇప్పుడు ఆమె ఉద్యోగి. ఆమె తన యజమానురాలు! ఇంకా మర్యాద ఎందు కిస్తుంది!’ అనుకొంటూ. పాపం శరణ్య! తానూ నారా రూప రాక్షసుల చేతిలో పడిందని తెలుసుకోలేక పోయింది!!
(ఇంకా ఉంది)
Harrah's Hotel & Casino - Ohio, OH - Goyang County
ReplyDeleteHarrah's Casino 사카미치 마루 Hotel 윌리엄힐 in downtown Ohio is located in beautiful 바카라사이트총판 Western Ohio, one of 암호화폐란 the most beautiful gaming 한게임 포커 apk destinations in America.
The Best Casinos in Las Vegas - Dr.MCD
ReplyDelete1) MGM 전라남도 출장샵 Grand Las Vegas, NV, 89109, USA · 2) Encore at Wynn Las Vegas, Las Vegas, NV, United States 광양 출장마사지 · 이천 출장샵 3) Caesars Palace 의왕 출장샵 Las Vegas, Las Vegas, NV, 안산 출장안마 United States · 4) Wynn Las Vegas,