Skip to main content

కొరకంచులో ఇనప మేకు ---10

హారర్' నవల:

లౌంజులో తీరుబడిగా కూర్చొని తనకి వచ్చిన కొరియర్’ని శరణ్య. ఆ కవరులో తన తల్లి తండ్రుల చరిత్ర, నరేంద్ర గత జన్మ రహస్యం ఉండి ఉంటుందని ఊహించింది. 

మణికంఠ సిద్ధుడు పత్ర మూలకంగా వాటిని పంపిస్తానని అన్నాడు. అందుకని దానిని తీరుబడిగా చదవాలని తన పనులన్నీ ముగించు కొని లౌంజు లోని ఉయ్యాల మంచాన్ని ఆశ్రయించి దానిని విప్పింది.

ఎస్టేటు ఏజెంటు పటవర్ధన్’ తన కెదురుగా కూర్చొని ఉన్న నవ దంపతుల వంక, ముఖం క్రిందకి వంచి కళ్ళజోడు మీదుగా కనుబొమల మధ్యనున్న కోణం లోంచి చూసాడు! అలాంటి చూపుని సినిమాలలో పేటెంటు చేసింది ఎవరో గాని, అది మాత్రం ముమ్మాటికీ దొంగ చూపే!!

నవ దంపతులయిన ‘రమ-అనిరుద్దులకి’ మాత్రం ఆ ఏజెంటు తమ అవవసరం తీర్చడానికి వచ్చిన ఆపద్భాంద వునిలా,ఆ చూపు తమ పైన కురిపించిన కరుణా కటాక్షాల లాగ కనిపించి అనిపించాయి!

“మీకు  ఇష్టమయితే నా కారులో రండి. ఇల్లు చూపించి అక్కడనుంచి దగ్గరలోనే ఉన్న ‘లోకల్’ ట్రైను’ స్టేషన్’ దగ్గర దింపేస్తాను” అన్నాడు పటవర్ధన్. అనిరుద్ధు, రమ అంగీకారంగా తలలు ఊపి, అతనితో పాటు కారు ఎక్కారు. 

ఇల్లు చాల బాగుంది. పబ్లిక్’పార్కు చివర దానికి ఆనుకొనే ఉంది! పచ్చని బయళ్ళ మధ్య ఒంటరిగా అందంగా కట్టించిన రెండు గదుల ఇల్లు అది! ఇంట్లో ఫర్నిచర్, కర్టెన్లు, మోడ్యులర్’ కిచెన్, గదులలో వద్రోబు, రోజంతా ఉండే నీటి కొళాయిలతో, మంచి సీనరీ ఫిట్టింగులతో ఆధునికంగా కూడ ఉంది! “లక్ష రూపాయలు అడ్వాన్సు కట్టాలి. ఇల్లు ఫర్నిచర్’టో సహా నెలకి పదివేల రూపాయలు అద్దె!” చెప్పాడు పటవర్ధన్’ 

అనిరుద్ధు రమ కళ్ళ లోకి చూసాడు. “చాల బాగుందండి! మనం మన సామాను తీసుకొని నేరుగా వచ్చేయ 
వచ్చు! అద్దె కూడ రీజనబుల్’గా ఉంది” రమ ఉత్సాహంతో అంది. అనిరుద్దుకి కూడా ఇల్లు నచ్చింది. వెంటనే చెక్కు బుక్కు తీసి అక్కడికక్కడే లక్షా పదివేలకి చెక్కు వ్రాసి ఇచ్చాడు.

పట వర్ధన్’ ఇల్లు తాళం వేసి, తాళం చెవులు అనిరుద్ద్’ చేతికి ఇచ్చాడు. తరువాత వాళ్లని తన కారులో రైల్వే స్టేషన్లో తీసుకెల్లి  దింపాడు.

అనిరుద్ధు తన పర్సనల్’ సామాను తీసుకొని, మర్నాడే ఆ ఇంటికి వచ్చేసాడు. రమ రావడానికీ ఇంకా సమయం ఉంది.దుస్తులు వాడ్రోబు లోను, సామాన్లను కప్- బోర్డుల లోను సర్దేసి, తరువాత హోటలు నుంచి తెచ్చిన డిన్నర్’ ప్యాక్’ని డైనింగ్’ టేబుల్’ మీద పెట్టి మళ్ళీ చూసాడు.

ఆమె అటువైపే చూస్తోంది!

అనిరుద్’ బయటికి వచ్చాడు. ఆమె అతనిని చూసి నవ్వింది. ఆమె కళ్ళు చాలా నీలంగా ఉన్నాయి! 

"నమస్కారం! నా పేరు ‘నీలిమ” అంది, ఆమె అనిరుద్’ తన దగ్గరకి రాగానే!

“అలాగా! నమస్కారం, నాపేరు అనిరుద్!” అన్నాడు.

“ఈ ఇంట్లో ఎవరూ ఉండేవారు కారు! మీరు కొత్తగా వచ్చారా?” అని అడిగింది నీలిమ.

”అవును నేను ఈ రోజే వచ్చాను. నా భార్య రమ మూడు రోజుల తరువాత సామాన్లు తీసుకొని వస్తుంది”

“ఆవిడకి సెలవు దొరకలేదా?”

“లేదు! మీరు ఇక్కడకి రోజూ వస్తూ ఉంటారా?” 

“అవునండి, రోజూ మూసిఉండే  కిటికీలు, తలుపులు చూస్తూ ఉంటాను! ఈ రోజు మీ రాక వల్ల అవి తెరచుకోన్నాయి! నాకు ఒకసారి ఇల్లు చూపిస్తారా?” 

“ ష్యూర్! రండి” అంటూ అనిరుద్’ ఇంటి వైపు అడుగులు వేసాడు. నీలిమ అతని వెనకనే అడుగులు వేస్తూ ఉండగా, ’నీలిమ’ చాల అందంగా ఉంది’ అనుకొన్నాడు అనిరుద్.

రమ 3 రోజుల తరువాత తన సామాన్లతో ఆ ఇంటికి వచ్చింది. దారి పొడవునా ఒకటే ఆలోచన! ‘అనిరుద్’ ఫోను ఎందుకు చేయలేదు? సెల్’ ఆఫ్’ చేసి ఎందుకు కూర్చొన్నాడు? మాటా మంతి  లేకుండా 3 రోజులుగా ఏం చేస్తున్నాడు? తనే వెర్రిది! అతని కోసం కలవర పడుతోంది!’ అనుకొంటూ ఇంట్లోకి అడుగు పెట్టింది. అనిరుద్’ ఇంట్లో కూడా లేదు! ఆఫీసులో కూడ లేరని చెప్పారు!! ఏమయింది ఇతనికి..?’ 

(ఇంకా ఉంది)

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద