Skip to main content

కొరకంచులో ఇనప మేకు --11

హారర్' నవల:

రమ 3 రోజుల తరువాత తన సామాన్లతో ఆ ఇంటికి వచ్చింది. దారి పొడవునా ఒకటే ఆలోచన! ‘అనిరుద్’ ఫోను ఎందుకు చేయలేదు? సెల్’ ఆఫ్’ చేసి ఎందుకు కూర్చొన్నాడు? మాటా మంతి  లేకుండా 3 రోజులుగా ఏం చేస్తున్నాడు? తనే వెర్రిది! అతని కోసం కలవర పడుతోంది!’

అనుకొంటూ ఇంట్లోకి అడుగు పెట్టింది. అనిరుద్’ఇంట్లో కూడా లేడు! ఆఫీసులో కూడ లేరని చెప్పారు!! ఏమయింది ఇతనికి..?’

”మేడం , నమస్తే! గుడ్’మార్నింగ్! నేను లోపలి రావచ్చా? “నీలిమ అడిగింది ద్వారం దగ్గర నిలబడి.

“గుడ్’మార్నింగ్! ఎవరు మీరు? సరే, లోపలి రండి!”

“నా పేరు నీలిమ! మీరు ఈ రోజు వస్తారని అనిరుద్;గారు చెప్పారు లెండి!”
“అతనితో మీకు పరిచయం ఉందా! ఎక్కడున్నా రతను?” ఆతృతతో అడిగింది రమ.


“నీలిమ నవ్వింది, “మూడు రోజుల క్రితం చూసాను అతనిని! ఆ తరువాత కనిపించలేదు! మీరు ఈ రోజు వస్తారని ఆయనే చెప్పారు. మీరిద్దరూ కలిసే వస్తారని అనుకొన్నాను”

“అవునా! అతను మూడు రోజులుగా కనిపించడం లేదా?” అడిగింది రమ.

“నీలిమ వెటకారంగా నవ్వింది. ఆ నవ్వులో ఏదో రహస్యం ఉంది! రమ అదేదీ గమనించ లేని పరిస్థితి ఆమెది! అనిరుద్’ గురించిన ఆదుర్దాలో ఆమె ఇంకేదీ పటించుకొనే స్థితిలో లేదు!

నీలిమ ఆమెకి ధైర్యం చెప్పింది. “రమాదేవిగారూ! ధైర్యంగా ఉండండి! కావాలంటే నేను మీకు సహాయంగా ఉంటాను. ఈ రోజు రాత్రికే అనిరుద్దుగారు వచ్చేస్తారు!”

“మీకెలా తెలుసు, మీతో అలాగని చెప్పారా!?”

“లేదండీ! నాతొ ఎందుకు చెప్పుతారు! అలా అనిపించింది అంతే!”

“మీ మాట నిజం కావాలండీ! నాకీ రోజు సాయం పడుకోండి” అంది రమ.

 ఆ రోజు రమ గాఢ నిద్రలో ఉంది.

నీలిమ ఆమెని తట్టి లేపింది. “అనిరుద్ధుని చూపిస్తాను రా!” అంటూ. ఆమె మాటలలో మర్యాద లేదు, అయినా రమ పట్టించుకో లేదు. అనిరుద్ధుని చూడాలనే ఆదుర్దాతో ఆమె వెంట నడిచింది.

నీలిమ, ఆమె లేచాక ప్రక్క  పైన పడేసి, ఆ మంచాన్ని నిలువునా ఎత్తింది. రమ ఆశ్చర్య పోయింది, “ఎందుకలా చేస్తునారు?” అని అడిగింది.

“ఈ మంచం క్రింద సొరంగ మార్గం ఉంది! దానిని ఇప్పుడే కనిపెట్టాను. బహుశా అనిరుద్ధు ఆ సొరంగంలో ఉంది ఉంటాడు” మాట్లాడకుండా నాతో రా!” అంది.

రమ మంత్ర ముగ్దురాలి లాగ నీలిమ వెంట ఆ సొరంగ మార్గం మెట్లు దిగింది! నీలిమ ఆమెని ఒక గుహ లోకి తీసుకొని వెళ్ళింది. అక్కడ మంచం మీద అనిరుద్ధు పడుకొని ఉన్నాడు!

రమ ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంతో చూసింది! నీలిమ వానక తిరిగి “నీలిమా, అనిరుద్ధు! బాగా కనిపెట్టావు! ఇంతకీ అతను ఇక్కడ ఎందుకు ఉన్నారు?” అనట్టూ అనిరుద్ధు దగ్గరకి వెళ్ళబోయింది.

నీలిమ ఆమెని ఆపింది. “అనిరుద్ధుని నిద్రలేపకు! పద, మనం ఇంకా లోపలి వెళ్లి చూద్దాం పద!” అంది. రమ ఆమెని అనుసరించింది. రమని మరొక గుహ లోపలికి  తీసుకొని వెళ్లి, నీలిమ చెప్పింది.”రమా! నీ భర్త  అనిరుద్’ నా ప్రేమికుడు! నువ్వు అతనిని కలియడం నాకు ఇష్టం లేదు! అందుకని నిన్ను కొన్నాళ్ళ పాటు బందీగా ఈ సొరంగంలో ఉంచుతాను...”

“ఏమిటి నీలిమా? నా భర్త నీ ప్రేమికుడు అంటావేమిటి? నువ్వు నన్ను నీ బందీగా ఎందుకు చేసావు? దాని వల్ల నీకు కలిగే లాభం ఏమిటి?” అని ప్రశ్నల వర్షం కురిపించింది.

“రమా! తెలుసుకో గోరుతున్నావు కాబట్టి విను! నేను మానవ కాంతను కాను! నా పేరు నీలా సుందరి! నేను యక్షిణిని !! నే భర్త నాతొ పొందు కోసం క్రిందట జన్మలో తపస్సు చేసాడు! కాని అతను శైశవావస్థలో ఆట తపస్సు చేయడం వల్ల నన్ను పొందలేక పోయాడు! ఈ జన్మలో నేను అతని కోరిక తీర్చడానికి వచ్చాను! అతని కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూసి, చివరకి అతను ఈ గుహపైన కట్టిన భవంతి లోనే అడుగు పెట్టడం చూసి సంతోషించాను! అతనిని గత నాలుగు రోజులుగా అలరించాను!! కాని అతను ఇంకా నీ పేరుని మరచిపోలేదు! నా పరిష్వంగంలో కూడ నీ పేరే తలచుకోవడం నాకు చాల బాధగా ఉంది! ఇక్కడ నిన్ను శాశ్వతంగా బంధించి ఉంచి, అనిరుద్ధుతో నా ముచ్చట నీ ‘రో -హౌసులో’ తీర్చుకొంటాను! ఇప్పుడు అర్థమయిందా?” అంది నీలిమ.

రమకి తల తిరిగి పోయింది!

నీలిమ చెప్పిన మాటలు ముందు ఆమెకి అర్థం కాలేదు! కొద్ది కొద్దిగా అర్థమయింది. ‘ఆమెకి తన భర్తతో ఏర్పడిన సంబంధం గురించి! అయినా ఏమిటిది? గత జన్మ! తపస్సు!! ఏమటివన్నీ?’ ఆ మాటే అడిగింది.

“నీలిమా! నువ్వు మానవ కాంత లాగే ఉన్నావు! నా భర్తని నా నుంచి దూరం చేయాలని ఏవేవో కట్టు కథలు అల్లుతున్నావు!

 నా భర్త నీతో సంబంధం పెట్టుకోన్నాడంటే నేను నమ్మను! ఇప్పుడే అతనిని నిద్ర లేపి నిజాన్ని తెలియజేస్తాను” అంది రమ.

నీలా యక్షిణి పకపకా నవ్వింది. “నేను మానవ కాన్తనో కాదో చూడవే!” అంటూ తన రూపాన్ని పది అడుగులు పెంచింది!! ఆమె తల గుహ పైభాగాన్ని తగిలేలా ఆమె శరీరం పెరిగింది! ఎత్తుకి తగినట్లే ఉంది ఆమె చుట్టూ కొలత! ఒళ్లు గగుర్పొడిచే భయంకరమైన ముఖం, నోట్లోంచి బయటికి వ్రేలాడుతున్న మృత్యుదేవత కరాళ దంష్ట్రాలలాంటి ఆమె కోరలు, చూసే వారికి గుండె లయ తప్పేటట్లు ఉంది!

ఆ వెనువెంటనే కేవలం అడుగు పొడవుండే మరుగుజ్జు రూపాన్ని ధరించింది! మరుగుజ్జు రూపంలో కూడ ఆమె భయమకరంగానే ఉంది! నెలకి అడుగు ఎత్తులో ఉన్నా వికృత రూపం, కోతిలా ఒళ్ళంతా బొచ్చు, పొడవైన గోళ్ళు, కోరలు! ఆ పది అడుగుల రూపానికి చిన్న సైజు విగ్రహం లాగా ఉంది!!


తిరిగి సామాన్య రూపానికి మారింది నీలిమ. “చూసావా! ‘మహిమ, అణిమ, ‘లాంటి విద్యల వల్ల నేను ఈ రూపాన్ని మార్సుకోగాలిగాను. ఇది మానవ కాన్తలకి సాధ్యమేనా??” అంటూ ప్రశ్నించింది. రమకి అదన్తాక్ హూసి తల తిరిగింది. వెంటనే తల పట్టుకొని క్రింద పడి  పోయింది. ఆమెని మంత్ర శక్తితో బంధించి నీలిమ, అనిరుద్ధుని గుహ బయటికి ఆ ఇంటి లోపలికి తీసుకొని పోయింది!

అంత వరకు చదివిన శరణ్య ఆలోచనలో పడింది! ఆ కథ లోని ‘రమా- అనిరుద్దులు’ తన తల్లి తండ్రులని అర్థమయింది! ఒక యక్షిణి మాయలో పడి తన తండ్రి, ఆమెకి బందీగా చిక్కిన తన తల్లి , ఎలా బయటపడ్డారో తెలుసుకోవడానికి ఆమె మనసు తహతహ లాడింది! కాని ‘టెలిఫోను’ రింగు అవడం  వల్ల చదవడం ఆపి దానిని అందుకొంది!

(ఇంకా ఉంది)

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.   ...

శ్రీ రంగ నీతులు. (మరచిపోయిన జానపద కళ)

 శ్రీ రంగ నీతులు. (శ్యామలా ఆర్ట్స్’ వారి ప్రస్తుతి!  “శ్రీరంగ నీతులు ‘ అనే ‘జానపద కళా ప్రదర్శన’  అని వ్రాసి ఉంటుంది) (వాద్య బృందం, స్టేజి పైనే కూర్చొని ఉంటారు. రాజా-రాం అనే యువకుడు చెంచు యువకుని వేషంలో కనిపిస్తాడు. వాద్య బృందం లోని  వారి సహకారంతో రాజా రాం పాట అందుకొంటాడు) రాజా రాం : ఒహోయ్ ! చెంచులూ ! చెంచు పెద్ద చెప్పే శ్రీ రంగ నీతులు వినడానికి ఎంత మంది వచ్చారో చూసార్రా? అందరూ : చూసాము ,చూసాము నాయకా ! [[నందానా]] రాజా రాం : అదేమర్రా? మర్యాదలు మర్సిపోయారా? అందరూ : ఏం సేయమంటావు నాయకా! [[నందానా]] రాజా రాం : పదం అందు కొండి చెంచులూ! అందరూ : ----[[అవునవును ]] రాజా రాం:  కార్య నిర్వాహక సభ్యులకి నెనర్లు! అందరూ: ----[[అవునవును, నెనర్లు ]] రాజారాం :  పెద్దవారికి ఐదు పది సేతలు! (రెండు చేతులూ జోడిస్తాడు) అందరూ : ----[[అవునవును, చేతులు జోడిస్తారు ]] రాజారాం : సమ వయస్కు లయిన స్త్రీ పురుషులందరికీ వెన్నెల! అందరూ : ---[[అవునవును, వెన్నెల--]] రాజారాం :   ఔత్సహకులయిన యువతీ యువకులకి డింగిడీలు! అందరూ : ----[[అవునవును,...

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ...