Skip to main content

కొరకంచులో ఇనప మేకు --12

హారర్' నవల:

“హలో ! మేడం! నేను శ్యాంని మాట్లాడుతున్నాను.”

 “హలో! చెప్పు”

“మేడం! నవల్కర్’ సార’కి మీ ‘రిజ్యూం, ప్రొఫైల్’ నచ్చింది. అతను ఇంప్రెస్ ’ అయ్యారు!”

“అయితే ఆడిషన్’కి ఎప్పుడు పిలుస్తారు?”

"ఈ రోజే పిలిచారు మేడం! మరొక గంటలో మీరు బయలుదేరి, చేమ్బూరు లోని ‘ఆర్.కె.స్టూడియోకి’ రావాలి.అక్కడ ఫ్లోర్’ నెంబరు ఎనిమిదిలో నవల్కర్’ సర్’ తీయబోయే మరాఠీ సినిమాలో హీరోయిన్’ ఆడిషన్’లు మొదలయి పోయాయి! మధ్యాహ్నం రెండు లోగా మీరు వస్తే పని అయిపోతుంది”

“మరో అరగంటలో బయలుదేరి వస్తాను. డ్రెస్సు సజెస్టు చెయ్యి, ఏ రకం ధరించాలి?” “ మీ సారీ క్లాడ్’ ఫోటో అతనికి నచ్చింది. అందుకని చీర కట్టుకొనే రండి.” “ అలాగే చీరనే కట్టుకొని వస్తాను” అంటూ ఫోను పెట్టేసి నరేంద్రని ఆ భవంతిలో ఒంటరిగా వదలి వెళ్ళడం ఇష్టం లేక వానిని తీసుకొనే బయలుదేరింది.

నరేంద్ర ‘గుప్ -చప్’గా తన ఆయుధాన్ని పోలితీన్’ కవరులో పెట్టుకొని బయలుదేరడం ఆమె చూడలేదు! ఇద్దరూ కారులో ఆర్.కె.స్టూడియోకి’ చేరేసరికి సమయం ఒంటి గంట అయింది. గేటు బయట శ్యాం ఆతృతతో ఎదురుచూస్తూ కనిపించాడు!

ఆమెని చూడగానే శ్యాం తొందరపడ్డాడు. “మేడం! త్వరగా ఫ్లోర్’కి పదండి! నరేంద్రని నేను తీసుకొని వస్తాను” అంటూ కారు డ్రైవరుకి అక్కాడకి చేరుకొనే మార్గం చెప్పాడు. ‘అతను తనతో ఎందుకు రాలేదో శరణ్యకి అర్థమయింది. ఎందుకంటే అతను ఇంకా సాధారణ ఫోటోగ్రాఫరు! కాబోయే తారతో కలసి వెళ్తే ఆమెకి గౌరవ భంగం కలగవచ్చు!”

 శరణ్య ఆ ఫ్లోర్’ లోపల అడుగు పెట్టీముందు , ఏం చిత్రమో లైట్లు ఆరిపోయాయి. వాళ్ళు జనరేటరు స్టార్టు చేద్దామని అనుకొనెంతలో శరణ్య అక్కడ అడుగు పెట్టడం లైట్లు రావడం జరిగాయి!! అందువల్ల  అందరి దృష్టిని వేశేషంగా ఆకర్షించింది!!

నరేష్’ చంద్ర నవల్కర్’ ఒక పొలిటీషియన్’ కొడుకే అయినా, ఫిలిం నిర్మాణ, దర్శకత్వ కళలలో ఆశక్తి కలిగి, అందులో డిగ్రీ స్థాయిలో  తన ప్రతిభని కనబరచాడు. గవర్నమెంటు మరాఠీ సినిమా ప్రోత్సాహానికి ఇచ్చే సబ్సిడీని దృష్టిలో పెట్టుకొని, తన మొదటి సినిమా మాతృభాష లోనే తీయాలని సంకల్పించాడు. ‘చీర కట్టులో ఉండే సాప్రదాయ మరాఠీ మహిళ ‘పాత్ర కోసం అతను ఆడిషన్’లకి పిలిచాడు. అంతవరకూ జరిగిన ఆడిషన్లు అతని లోని దర్శకుణ్ణి సంతృప్తి పరచలేక పోయాయి!

శరణ్య ఆకర్షణీయమైన ఎంట్రీ అతనిని అలరించింది! క్విక్ మేకప్’ చేయించి ఆమెని తీసుకొని రమ్మని, కొన్ని హిందీ సినిమా డైలాగులు వ్రాసిన స్క్రిప్టుని ఆమెకి అందజేయమని, అసిస్తేన్తుకి చెప్పాడు. శరణ్య మేకప్’ అవుతూ ఉండగానే వాటిని చదివి అప్పటికప్పుడే బట్టీ పెట్టేసింది!

మేకప్’ పూర్తి  కాగానే శరణ్య లేచి ఆ గదిలోకి తొంగి చూస్తున్న శాల్తీని చూసి గాభర పడింది. ఆ శాల్తీ ఇంకెవరో కాదు, ‘బాబూరావు గోరే ‘! శరణ్య తన చూపుని మరల్చుకొంది. గోరే మాత్రం చీర కట్టులో ఉన్న ఆమెని పట్టి పట్టిచూసి, అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇంతలోనే నరేంద్రతో అక్కడకి వచ్చిన శ్యాంని చూసి అడిగింది శరణ్య.

“శ్యాం! బాబూరావు గోరేని చూసావా?”

“చూసాను మేడం! గోరె మీ గురించి అడిగాడు!”

“ఏమని అడిగాడు?”

“భూషణ్ ’ సర్’ భవంతిలో , మోడరన్’ డ్రెస్సుతో కనిపించినది మీరేనా ? అని అడిగాడు! నేను అది మీరు కాదని, మీకు భూషణం సార’టో గాని, ఆ భవంతితో  గాని మీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాను.”

“నమ్మాడా?”

“అతను ఈ యూనిట్’కి స్టంట్’ డైరక్టరు! అతను నా మాటలు నమ్మాడో లేదో తెలియదు!”

“అర్థమయింది, ఈ సారి నా గురించి రెట్టించి అడిగినా, నన్ను ఫిలిం నుండి తప్పించాలని ప్రయత్నం చేసినా, ఆ మాటలు అనేందుకు వేలు లేకుండా ‘నాలిక’ పీకేస్తానని చెప్పు!” అంది శరణ్య. నరేంద్ర ఆ మాటలు విని పకపకా నవ్వాడు! ఇంతలో ఆమెని పిలవడానికి లైటుబాయ్’ వచ్చాడు. ఆ బాయ్’ వెనకనే శరణ్య సెట్’ మీదకి వెళ్ళింది. నరేంద్ర అదంతా గమనిస్తూనే ఉన్నాడు! శరణ్య రాకకి ముందు లైట్లు ఆర్పెసినది, ఆమె అడుగు పెట్టగానే వాటిని తిరిగి వెలిగించినది, నరేంద్ర  అని, శరణ్యకి గాని, శ్యాంకి గాని తెలియదు! వాళ్ళు అతనిని ఇంకా పసిపిల్లవాని గానే  భావిస్తున్నారు! గోరే, శ్యాం మాటల్ని నమ్మలేదని ఆడిషన్’ కాగానే శరణ్యని అక్కడ నుంచి తప్పించాలని అనుకొంటున్నాడనీ నరెంద్రకి తెలిసిపోయింది!

అక్క కోసం గోరే అడ్డుని తొలగించాలని భావించిన నరేంద్ర ‘టాయిలెట్’లో కాపలా కాసాడు.

సెట్’ పియన్ ఫుల్’ లట్లు వెలిగాయి. శరణ్య , గణేష్’ భగవానుని ఫోటో ముందు నిల్చొని ఉంది! ఆస్పత్రి పాలు అయిన తన భర్త, అనారోగ్యం కాపాడమని, తన సౌభాగ్యాన్నినిలబెట్టమని, గణేష్’ని ప్రార్థించే సన్నివేశం అది!

శరణ్య పతివ్రతల  పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి, తన మనసుని పరిభ్రమింప చేసింది! తనకి ఇచ్చిన డైలాగుని దీనంగా  మనస్సు లోని సంవేదనని భగవంతునికి విన్నవించు కొనే విధంగా కంఠంలో మాధుర్యాన్నీ, అనుకంపపననీ, మేళవించి మనసు కరిగించేలా చెప్పింది!! డైలాగు ముగించేసరికి ఆమె బుగ్గల మీద కన్నీటి భాష్పాలు జాలువారాయి!

దర్శకుడు నవల్కర్’తో సహా అందరూ స్థబ్దులయ్యారు!! ‘సన్నివేశంలో ఇంత  తాదాత్మ్యతా! గ్లిసరిన్’తో నిమిత్తం లేకుండా కన్నీల్లు ఎలా తెప్పించ గలిగింది?! ‘ వెంటనే చప్పట్లు కొట్టి , తమ అనుభూతిని ప్రదర్శించారు. నవల్కర్’ కూడ చప్పట్లు కొట్టాడు.

బాబూరావు గోరే కూడ ఆ దృశ్యాన్ని చూసాడు. ‘ఎంత జాణ ఇది! ఆ రోజు మగరాయుడి వేషంలో తామందరినీ హడలు కొట్టేసింది! ఇప్పుడు సాధ్వి పాత్రలో ఇరగదీసింది!! దీనికి పాత్ర ఖాయం చేసే ముందే, దీని నిజ స్వరూపాన్ని నవల్కర్’ సర్’తో చెప్పాలి! అతని చేత నిరాకరిమ్పజేయాలి!” అనుకొంటూ ముందుగా ముఖం కడుక్కొనేందుకు టాయిలెట్’ లోకి దూరాడు.

అక్కడ నరేంద్ర ‘వాష్’ బేసిన్’ అడ్డం ముందు నిలబడి తన నాలుకని పొడవుగా చాపి, దానితో తన ముక్కుని
అందుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తున్నాడు!

గోరే ఆ కుర్రవాడిని చూసి ముచ్చట పడ్డాడు. “ఏమిటి బాబూ? ఏం చేస్తునావు?” అని అడిగాడు.

“నాలికతో ముక్కుని అందుకోవాలని చూస్తున్నాను అంకుల్! అలా  చేస్తే కోరిన కోరికలు తీరుతాయట !” అని, “అంకుల్! మీరు అలా ఒకసారి చేసి చూపిస్తారా?” అని అడిగాడు.

“అలాగే, దానికేం భాగ్యం?” అంటూ గోరే అలా చేయడానికి తన నాలికని పొడవుగా చాపాడు. అంతే!!!

నరేంద్ర ప్లాస్టిక్’ సంచీలో తెచ్చుకొన్న తన కొరకంచుని బయటికి తీసి, దాని ఇనప మేకుకి గోరే నాలికని గురి పెట్టి, గాలిలోనే ముమ్మారు మెలిత్రిప్పి  లాగాడు!

గోరే ఎలుగెత్తి అరవాలని అనుకొన్నాడు. కాని అతని అరుపు గొంతులోనే ఆగిపోయింది! తన నోట్లోంచి బయటికి దూకుతున్న రక్త ప్రవాహాన్ని చూసి, గోరే స్పృహ కోల్పోయాడు! నరేంద్ర ఏమీ తెలియనట్లు అక్కడ నుంచి జారుకొన్నాడు!

శరణ్య మరాఠీ ఫిలింకి సెలెక్టు అయిపొయింది. పది లక్షలకి అగ్రిమెంటు వ్రాసుకొని, అడ్వాన్సుగా నాలుగు లక్షలు ఇచ్చేసాడు నవల్కర్.

శ్యాంని తన సెక్రటరీగా పరిచయం చేసి, నాలుగు లక్షలలో పది శాతం అంటే నలభై వేల రూపాయలు  ఇచ్చేసింది శరణ్య. శ్యాం సంతోషానికి మేర లేకుండా పోయింది! అతన్ని ఇంతలా నమ్మి ఆదరించిన వ్యక్తులు ఇంకెవరూ లేరు  మరి!! “మేడం! పార్టీ ఇస్తాను. మీకూ, నరేంద్రకీ!!” అన్నాడు.

“అలాగే! ఎక్కువ ఖర్చు చెయ్యకు! చిన్న రెస్టారెంటులో ఇయ్యి. ఇంకో మనిషిని కూడా పిలవాలి!”

“ఎవరిని పిలవాలి?”  “అవినాష్’ని! అతను జూనియర్’ ఆర్టిస్టు సప్లయరు!”

“అతను నాకు తెలుసు! మేడం! తప్పక పిలుస్తాను.” అన్నాడు శ్యాం. ఆ తరువాత వాళ్లిద్దరూ కారులో తిరుగు ముఖం పట్టారు. ఇంటికి చేరుకోన్నాక శరణ్య ఆదుర్దాతో మణి కంఠ సిద్ధుడు పంపిన స్క్రిప్టు తీసి చదువ సాగింది.


(ఇంకా ఉంది)

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.   ...

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ...

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని ...