Skip to main content

కొరకంచులో ఇనప మేకు ---14

“బ్లూ వేం వద వద  త్రీం హం ఫట్ !” అంటూ  తననే  ధ్యానిస్తున్న ఆ  బాలకునికి, పన్నెండేళ్ల  బాలికలా  దర్శన మిచ్చింది  నీలా సుందరి, పట్టుపరికిణీ, జాకెట్టు, రెండు  జడలతో!

“ హే!! బాలకా!!  నా పేరే  నీలా సుందరి!!  నన్నెందుకు  పిలుస్తున్నావు?”

“నువ్వేనా నీలా సుందరివి!! నువ్వింకా పెద్ద దానివని దుర్గా దేవి విగ్రహంలాగ ఉంటావని అనుకొన్నాను.” అన్నాడా బాలుడు.

“నేను ఎలాగైనా మారగలను.నువ్వు బాలుడవు గనుక ఇలా వచ్చాను. నాతో ఏం పనో చెప్పు?”

 “మంత్ర జపం  చేస్తే  నువ్వు  వస్తావో  రావో  అని, వస్తే ఎలాగుంటావో  చూడాలని పిలిచాను.  నువ్వు  చాలా  ముచ్చటగా  ముద్దులొలుకుతూ  ఉన్నావు. నాతో  ఆడుకొంటావా?ఎన్నో  ఆటలు  నేర్పుతాను.  మా అమ్మని, చెల్లాయిని  కూడ  చూపిస్తాను.”

“ నీకు  చెల్లాయి  కూడా ఉందా?”

“ అవును,  చాల  పెంకిది,ఎప్పుడూ  అమ్మ ఒళ్లోనే ఉంటుంది.  పాలు  తాగుతూ ఉంటుంది.”

“అమ్మఒళ్లో  పాలు  తాగుతుందా? “ నీలా సుందరికి  ఆ  విషయం, విస్మయం  కలిగించింది.

"అవును  రా!!  చూపిస్తాను.  “అంటూ  ఆమెను  తమఇంటికి  తీసుకెళ్లాడు.  అక్కడ ఆ  బాలుని  తల్లి, పాపాయిని  చేతుల్లోకి  తీసుకొని, గట్టిగా  గుండెలకి  హత్తుకొని,  తన కంచుకాన్ని  వదులు  చేసి,  చనుబాలు  త్రాగిస్తోంది.  ఆ  శిశువు  తన చిట్టి చేతులతో  తన తల్లి  స్తనాలను  పట్టుకొని, అరమోడ్పు  కనులతో  తృప్తిగా  పాలు  త్రాగుతోంది.

ఆ  మాతృమూర్తి  కూడ  పిల్లకు  పాలిస్తూ,  తన్మయత్వంతో  కనులు  మూసుకొని ఆనందాన్ని అనుభవిస్తోంది.  ఆ  మాతా  శిశువుల అనుభూతి ఎలాంటిదో  నీలా సుందరికి  తెలిసి  పోయింది.


 బాలుడు ఆమెను  తల్లికి  ఫరిచయం  చేయబోయాడు.  నీలా సుందరి  వారింఛింది, “నేను  నీకు  మాత్రమే కనిపిస్తాను. ఇంకెవరికీ  కనిఫించను, “ అంటూ.

“ ఎందుకని??”

 “నువ్వుఒక్కడివే  నన్ను  ధ్యానించావు  గనుక!!”

“అయితే  ఫద!  మనమిద్దరం  ఆడుకొందాం.”

“అలాగే! ఈ రోజే  నీతో  ఆటలాడుతాను. రేపు  మా రాజుగారి  భవనానికి  వెళ్లిపోవాలి”.

“మరి  రావా??”

“ రాను,  రాలేను. నువ్వు  పెరిగి  బాగా  పెద్దవాడివి  అయేంతవరకు,  నా  మంత్రమే  కాదు, ఇంకే  మంత్రమూ  జపించకు.  పెద్దయ్యాక  వివేకంతో  నిర్ణయం  తీసుకో.”

************

అంత వరకు చదివిన శరణ్యకి, విషయం చాల వరకు  అర్థమయింది. సొరంగం క్రింద నున్న ,ఆ ఇంట్లోనే తననీ  నరేంద్రనీ, రాఖీ జాకీలు పొరపాటున ఉంచారనీ, అందుకే తాము తప్పించుకో గలిగారనీ తెలుసుకొంది. మూడేళ్ల నరేంద్ర ‘ క్రిందటి జన్మలో తన తండ్రి  అనిరుధ్ధ్’ అని  గుర్తించిన , ఆమె  మేను కంపించింది ! తన తల్లి తండ్రులు నీలా సుందరి చెరలో నుండి ఎలా తప్పించుకో గలిగారో నని  ఆమె మనసు ఆతృత పడింది.

అంతలో మళ్లీ టెలిఫోను మ్రోగింది. అవతలి నుండి శ్యాం అని చూసి, ఆమె ఫోను తీసింది.

“మేడం ! నేను శ్యాంని మాట్లాడుతున్నాను. బాబూరావు గోరే చనిపోయాడు, అతని మరణం విచిత్రంగా ఉంది. నాలిక బలవంతంగా పెకిలించడం వల్ల , అతని శ్వాస నాళం దెబ్బ తిని మృతి చెందాడని అనుమానిస్తున్నారు. ”

“ అలాగా ! అతని నాలికని ఎవరు పీకేసి ఉంటారు ?”

“ ఏమో మేడం! భూషణ్ సర్ ,దున్నపోతు శీను మిమ్మల్నే అనుమానిస్తున్నారు. అంతే కాదు మేడం మిమ్మల్ని చంపెయ్యడానికి పథకాలు వేస్తున్నారు.”

“ శ్యాం ! గోరే మృతికి నేను కారణం కాదు. అయినా  ఆ రాక్షసులతో తర్కించి లాభం లేదు. ఇంతకీ వాళ్లు నా చావుకి ఎలాంటి పథకాలు వేస్తున్నారు ?”

“ తెలియదు మేడం ! తెలిస్తే తప్పక చెప్తాను. మీరు జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను గుడ్ నైట్!”

“ అలాగే గుడ్ నైట్ శ్యాం !” అంటూ ఫొన్ పెట్టేసింది.

గోరే చావు కబురు విని ఆమె  ఆలోఛనలో పడింది. ‘ తను శ్యాంతో , ఆ రోజు సెట్లో  ‘గోరే’  తన విషయంలో జోక్యం చేసుకొంటే  ‘నాలిక పీకేస్తానని’ చెప్పమంది. ఆ మాట విని నరేంద్ర పకపకా నవ్వాడు. అంటే నరేంద్ర  దానిని  అమలు పరచాడన్న మాట !’

శరణ్య  నరేంద్ర దగ్గరకి వెళ్లింది, నరేంద్ర నిద్ర పోతున్నాడు ! నిద్ర లేపి ఆ మాట అడగ వలసినంత అవసరం లేదని, వాడి తల మీద ముద్దు పెట్టుకొని, తిరిగి తన ఉయ్యాల బల్ల మీద కూర్చొంది. అప్పుడామెకి మానసి మాటలు గాలిలో వినిపించాయి! “శరణ్యా! గోరే చావు నాకు సంతోషం కలిగించింది.”

“నాకు కూడా మానసీ! నీ రేపిస్టు ఒకడు  దిక్కులేని చావు చచ్చాడు, నాలిక ఎవరు పీకేసారు ?”

“మన నరేంద్రే శరణ్యా!చిన్న వాడే అయినా ఎప్పుడేం చేయాలో తెలిసిన ముదురు వాడు !”

“ ఎలా పీకేసాడు ?”

“ కొరకంచులో ఇనప మేకుతో !”

“నరేంద్ర ఆ ఆయుధాన్ని తీసుకొని రావడం నేను చూడలేదు. ”

“ అంటే  గోరే మృతికి నువ్వు చింతిస్తున్నావా ?”

“ లేదు, నా ఉద్దేశం అది కాదు !”

“ నీ మాట ఎలాగున్నా, ఒక రేపిస్టు చనిపోయినందుకు  నాకు మాత్రం చాల ఆనందంగా ఉంది.”

‘‘ మానసీ ! గోరేలాగే  తక్కిన రేపిస్టులకి కూడా  మరణ శిక్ష  పడాలంటావా ? ”

“అవును, అలా జరగిన  తరవాత, నాకు  పిండ ప్రదానం జరిగితే, నా ఆత్మ శాంతిస్తుంది.”

“ అలాగే  మానసీ ! వాళ్లందరికీ నేనా శిక్ష పడేలా చూస్తాను.”

“శరణ్యా ! దున్నపోతు శీను నిన్ను చంపాలని పథకం వేస్తున్నాడు. నువ్వు షూటింగ్  కోసం,       ‘పంచాగ్నికి’  రేపో ఎల్లుండో వెళ్తావు కదా, దారిలోఒక రోడ్డు మలుపు ఉంది.అక్కడ ఇంత వరకు  67 ఏక్సిడెంట్లు అయ్యాయి. వాటిలో దాదాపు అందరూ చనిపోయారు. ఆ స్పాట్లో నీ కారుని ఏక్సిడెంటుకి గురిచేసి, నీ పీడ వదిలించుకోవాలని ప్లాను చేసారు.”

“ఆశ్చర్యంగా ఉంది మానసీ ! ఈ విషయాన్ని నువ్వెలా తెలుసుకొన్నావు?”

“ నీతో శ్యాం మాట్లాడిన మాటలు విన్నాను. వెంటనే భూషణం హోటల్’కి  వెళ్లి, అక్కడి ఆఫీసు రూములో వారిద్దరూ మాట్లాడుకొన్న మాటలు విన్నాను. దున్నపోతు శీను పంచాగ్నిలోని ఒక గెస్టు హౌసు మేడ మీద నుండి, ఆ ఏక్సిడెంటు జరిగినదీ, లేనిదీ స్వయంగా బైనాక్యులర్లతో చూసి వెంటనే భూషణానికి చెప్తాడు.”

“ నేను ఎల్లుండి పంచాగ్నికి వెళ్తున్నాను, నవల్కర్ సర్  అక్కడి లొకేషన్లలో ఒక పాట రికార్డు  చేస్తారట ! షూటింగు మానేయడానికి వీలు లేదు, ఎందుకంటే నా కోసం పూర్తి యూనిట్ ఆగిపోవాలి ! అందుచేత నేను దాని నుండి, తప్పించుకొనే  మార్గం ఆలోచిస్తాను”

మానసికి  బదులు చెప్పి, శరణ్య  కలత చెందిన మనసుతో  ఆలోచిస్తూ మంచం మీద  పడుకొని నిద్రకి ఉపక్రమించింది. అలసిన ఆమె కనులు బరువుగా  మూతపడ్డాయి.


మరునాడు, శరణ్య, శ్యాం ఇస్తానన్న లంచ్ పార్టీకి వెళ్లింది. ఆ పార్టీకి  అవినాష్, నరేంద్ర, ఆమె కారు డ్రైవరు  ఆలీ అహ్మద్  హాజరయ్యారు. అవినాష్ , శరణ్య  క్రొంగొత్త మన్మోహన రూపాన్ని చూసి నమ్మలేక  పోయాడు !

“నువ్వేనా శరణ్యా ? ఎంత అందంగా ఉన్నావు. వర్తమాన మరాఠీ అందాల సూపర్ స్టార్ అయిన ‘సోనాలీ బెంద్రే కన్నా 4 రెట్లు అందంగా ఉన్నావు!! నీ సినిమా తప్పకుండా సూపర్  హిట్ అవుతుంది.” అన్నాడు  అవినాష్.

“అవినాష్ ! నేను వెళ్లిన ఇంటర్వ్యూ  ఫాల్స్  అని తెలిసినా, నాకు చెప్పకుండా దాచావు. నీ మీద నాకు చాల కోపంగా ఉంది.” అంది శరణ్య.

అవినాష్  తల దించుకొన్నాడు.“సారీ ! శరణ్యా ! నీకు మంచి జరుగుతుందని అనుకొన్నాను --” అని నసిగాడు.

శరణ్య అతనిని క్షమించేసింది,“అవినాష్ ! జరిగిన దంతా చెప్పడానికి చాల సమయం పడు తుంది. నిన్ను ఎందుకు పిలిపించానంటే, ఈ నరేంద్ర తాత గారిని  వెతికే ప్రయత్నంలో నీ సహాయం కావాలి.రాఖీ జాకీలు, ఇప్పుడు ఏం చేస్తున్నారు.నరేంద్ర ‘మిస్సింగ్’ అని పోలీసు రిపోర్టు ఇచ్చారా లేదా ?

ఒక వేళ ఇచ్చి ఉంటే నా పేరు దానిలో ఇరికించారా లేదా ? నరేంద్ర తాత గారు ఎక్కడ ఉంటున్నారు ? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు నువ్వే సంపాదించాలి. అవసరమని  అనుకొంటే ఎవరైనా  ప్రైవేటు డిటెక్టివ్ ఏజన్సీసహాయం అడుగు. దానికి డబ్బుఎంత ఖర్చుఅయినా ఫరవా లేదు ”అంది.

(ఇంకాఉంది)

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.   ...

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ...

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని ...