Skip to main content

కొరకంచులో ఇనప మేకు ---15

“శ్యాం ఎల్లుండి జరగ బోయే అవుట్ డోర్ షూటింగులో  నువ్వు నాతో రావద్దు. ఎందుకంటే నాకోసం ప్రమాదం పొంచి ఉంది.” అంది.


శ్యాం  అర్థం కానట్లు చూసాడు. కారు డ్రైవరు ఆలీ మాత్రం ఆమె మాటలకి  స్పందించాడు,


“మీకు ప్రమాదం పొంచి ఉండడం ఏమిటి మేడం ! మీరు ప్రమాదాలకే ప్రమాదమయితే !” అన్నాడు.

“ఆలీ ! పంచాగ్ని వెళ్లే దారిలో ఒక ఏక్సిడెంటు స్పాట్ ఉందట కదా ?” అడిగింది శరణ్య.

“అవునమ్మా!ఘాట్  రోడ్డు మలుపులో ఒక ఏక్సిడెంట్  స్పాట్ ఉంది. అక్కడ ఇంత వరకు 67 దుర్ఘటనలుజరిగాయి ”

“ రేపు జరగబోయే 68వ దుర్ఘటన బహుశా నాదే అవుతుంది  ఆలీ !”

“అలాంటిదేమీ జరగ దమ్మా ! షావలీ బాబా  భక్తులకి  ఆ స్పాట్లో ఎలాంటి  అపాయాలూ జరగవు. నేను అతని మజార్’కి  తరచు వెళ్తూ ఉంటాను.” అన్నాడు ఆలీ.

“షావలీ బాబా  మజార్  ఎక్కడ ఉంది ఆలీ ?”

“చించి పోకిలీ  రైల్వే స్టేషను దగ్గర ఉంది  మేడం ! ”

“నన్ను, నరేంద్రనీ  అక్కడకి తీసుకొని వెళ్తావా ఆలీ !”

“తప్పకుండా తీసుకెళ్తాను  మేడం, మనం తిరుగు దారిలో అక్కడకి వెళ్దాం” అన్నాడు ఆలీ.

ఆ తరువాత  శరణ్య  వాతావరణాన్ని ఆహ్లాదకరంగా  మార్చేసింది. అందరూ కలిసి, నవ్వుతూ, కేరింతాలు కొడుతూ భోజనం చేసారు. లంచి పూర్తయ్యాక  శరణ్య , నరేంద్రతో కలిసి, షావలీ బాబా మజారుకి ఆలీతో పాటు వెళ్లింది. దారిలో నరేంద్రకి విషయమంతా చెప్పింది శరణ్య.

“నరేంద్రా ! పంచాగ్నికి వెళ్లే దారిలోని ఆ ఏక్సిడెంటు స్పాటులో  నన్ను చంపేందుకు  పథకం వేసారు, దున్నపోతు శీను, విభూతి భూషణ్లు. దాని నుంచి తప్పించుకోవడానికే  ఈ షావలీ బాబా మజార్’కి  వెళ్తున్నాం. అక్కడ భక్తి  శ్రధ్ధలతో , బాబా  ప్రార్థన చేయాలి, తెలిసిందా ?” అని.

నరేంద్ర  సరే నన్నట్లు తల ఊపాడు.

ఆలీతో పాటు , శరణ్య , నరేంద్రలు  కూడా  బాబా షావలీ  సమాధి ప్రక్క,  మోకాళ్ల  మీద కూర్చొని, చేతులు చాపి, ‘ఇబాదత్’ చేసారు.

“ బాబా ! ఏ పాపమూ ఎరుగని దీనురాలైన  ఈ శరణ్య  మిమ్మల్ని, చేతులు చాపి ప్రార్థిస్తూంది. నన్ను ‘పంచాగ్ని’ మలుపులోని  దుర్ఘటనా  స్థలంలో ఇరికించి చంపేయాలని చూస్తున్నారు కొంత మంది  దుర్మార్గులు. బాబా ! ఆ స్థలం మీ అధీనంలో ఉన్నమాట  నిజమే అయితే, నన్నూనరేంద్రనీ కాపాడండి.. మీకు అదే స్థలంలో మజార్ నిర్మాణం  చేయిస్తాను.” అంటు శరణ్య కళ్లు మూసుకొంది.

నరేంద్ర ఎప్పుడు తన స్థలం నుండి లేచి వెళ్లాడో, శరణ్య  గమనించ లేదు.ఆమె మనసంతా బాబా జవాబు కోసం ఎదురు చూస్తోంది. మరుక్షణం  ఆజానుబాహుడు, తెల్లని పట్టుకుచ్చుల్లాంటి  దీర్ఘ శ్మశ్రు  పటలంతో, దివ్య తేజస్సుతో నిండిన , స్ఫురద్రూపి అయిన  ఒక  వృధ్ధుడు కనిపించాడు. “ బేటీ శరణ్యా ! నరేంద్ర నా మసీదు లోపలికి ప్రవేశించి నీ అవసరాన్నీ, ఆవేదననీ తెలియ జేసాడు. పంచాగ్నిలోని ఆ స్థలం నాకు గురు స్థానం ! అందుచేత  నా సంవేదనని అక్కడి ఆత్మలు అర్థం చేసుకో గలవు.! అవి అక్కడ  మృతి చెందడం  వాటి లలాట లిఖితం ! అలా మరణించిన వారిలో, భక్తులు, పుణ్యాత్ములు ఎవరూ లేరు. కేవలం పాపులు, దుర్మార్గులు మాత్రమే  కాలధర్మం చెందారు. నువ్వు నా  శరణు జొచ్చావు గనుక నీ కేమీ  కాదు ! నిర్భయంగా  వెళ్లి  రా ” అన్నాడు.

“బాబా ! పాపులని శిక్షించడమే జరిగితే, అది నరకం లాంటి  పైలోకాల లోనే జరగాలి.ఒక రోడ్డు చివర  మృత్యు దేవత తన స్థావరాన్ని ఏర్పరచుకోవడం ఎంత వరకు న్యాయం? మీరూ మీ గురుదేవులూ దీనిని ఎలా సమర్థిస్తున్నారు?

అక్కడ చనిపోయి ప్రేతాలుగా మారిన  అసంఖ్యాక మయిన  నిస్సహాయ  ఆత్మలకి  ముక్తి ఎలా లభిస్తుంది ? వారికి వారి వారి నమ్మకాల ప్రకారం అంత్య క్రియలు ఎవరు చేస్తారు ? నేను మీ మజారుని అక్కడ కడతానన్నది  ఈ ప్రశ్నలకి జవాబు కోసమే ! దయచేసి సమ్మతించండి.”

“శరణ్యా ! చాలా ప్రశ్నలు వేసావు. వాటి సమాధానాలు నేను నా గురుదేవుల దగ్గర రాబడుతాను. నువ్వు చేస్తానన్న పని వల్ల నాకు అక్కడ జరగబోయే, జరుగుతున్న దుర్ఘటనలని  నా గురుదేవులకి దగ్గరగా ఉండి  చూపించి నట్లు అవుతుంది. అలాగే చెయ్యి ! ఇక లేచి రా !” అన్నాడు.

శరణ్య  కళ్లు తెరచి లేచింది. ఆంత వరకు ఆమె ముందు నిలబడిన వృధ్ధుడు అదృశ్యమయ్యాడు. నరేంద్ర అక్కడ నిల్చొని చిరునవ్వుతో చూస్తున్నాడు. శరణ్య లేచి నరేంద్రని  ముద్దు పెట్టుకొని బయలు దేరింది.దారిలో ఆమె ఆలీతో తనకీ, షావలీ బాబాకీ జరిగిన సంభాషణని  చెప్పి, అక్కడ  మజారు నిర్మింఛే పక్షంలో  తను 5 లక్షలు డొనేషను ఇస్తానని చెప్పింది.

ఆ మాటలు విన్న ఆలీ ఆనందంతో పొంగిపోయాడు సమాజం వారితో , సంప్రదింపులు జరిపి  మజారు కట్టే  విషయంలో  సహమతి తీసుకొస్తానని అన్నాడు.
****

పథిక్ గెస్ట్ హౌసులోని  మేనేజరు గదిలోని, ఎ.సి.చల్లదనంలో, విస్కీ సేవిస్తూ, మాట్లాడు కొంటు న్నారు వాళ్లిద్దరూ. ఒకడు భూషణం, రెండవ వాడు దున్నపోతు శీను..,

“శీనూ ! శరణ్య  ఏక్సిడెంటు ఎలా ప్లాన్ చేసావ్ ? ఏదైనా ట్రక్కుతో గుద్దిస్తావా, లేక లేండ్ మైన్ డెటినేటర్ పెట్టి, ఆ స్పాటుకి రాగానే  దానిని పేల్చేస్తావా ?” భూషణం అడిగాడు.

“అవేవీ వర్కవుట్  అవవు ! సపోజ్ అది తన కారును మార్చి, ఇంకో కారులో వచ్చిందనుకో, ఈ రెండు ప్లానులూ పని చేయవు.అందువల్ల వేరే పథకం వేసాను.”

“అదే ఎలాగని ?”

“అక్కడ జరిగిన ఏక్సిడెంట్లకి ప్రేతాత్మలే కారణం అనే నమ్మకం ఉంది కదా ! వాటిలో ఒక ప్రేతాత్మనే నే నీ పనికి ఎన్నుకొన్నాను.”

“ఇంటరెస్టింగ్ ! వివరంగా చెప్పు,” అన్నాడు భూషణ్.

“అక్కడ జరిగిన ఏక్సిడెంటులో మనవాడు ఒకడున్నాడు. వాడి పేరు‘జగ్గు’.వాడి ఆత్మ ఇంకా అక్కడ తిరుగుతూనే ఉంది”

“అది సరే ! ఈ ఆత్మలని ఎలా కంటాక్ట్ చేసావ్ ?”

“శరణ్య, మానసి ఆత్మని కంట్రోల్ చేసి, మనతో ఆటలాడుకోలేదూ ? అలాగే నేను ఒక తాంత్రికుడిని పట్టుకొన్నాను.”

“అలాగా!  ఆ తాంత్రికుడు ఏం చేస్తాడు ?”

“జగ్గు ఆత్మని లేపి, కంట్రోల్ చేసి, దాని మీదకి ఉసిగొలుపుతాడు.”

“వర్కవుట్  అవుతుందా ? జగ్గు ప్రేతాత్మ దానిని ఎలా పోలుస్తుంది ?”

“ ప్రేతాత్మలు మనుషుల రూపు రేఖలని బట్టి  పోల్చవు ! వాళ్ల చెమట, ఒంటికి పట్టిన మట్టి, జుత్తు, గోళ్లు లాంటి వాటి ద్వారా  తమ ‘టార్గెట్’ని  గుర్తిస్తాయి.”

“ శెభాష్ శీనూ ! దాని చెమట వగైరా ఎలా సంపాదించావ్?”

“చాలా సులభం భూషణ్ ! అది సినిమా వేషం వేస్తోంది కదా ? దాని మేకప్ మేన్ నుంచి  జుత్తు గోళ్లు, అది తొడిగి విడిచిన బట్టల ద్వారా చెమటనీ, దాని హెయిర్ డ్రెస్సర్ ద్వారా జుత్తునీ సంపాదించాను. వాటిని తీసుకెళ్లి ఆ తాంత్రికుడికి ఇచ్చాను, రేపు అది కారు మార్చినా, డ్రెస్సు మార్చినా, చివరికి మేకప్పుతో రూపు రేఖలు మార్చినా , ఏం చేసినా  జగ్గు ప్రేతాత్మ తన పని తాను చేసుకొని పోతుంది  అది ఖచ్చితంగా చావు నుంచి తప్పించుకోలేదు.”

“బాగుంది శీనూ ! చాలా బాగుంది. ఇది వర్కవుట్ అయితే మనం  చాలా మర్డర్లు  ప్లాన్  చేయవచ్చు.”

“నా ఉద్దేశంలో అక్కడ జరుగుతున్నది  అదే భూషణ్ ! ఆ తాంత్రికుడికి , ఆ స్పాటు వల్ల,‘నిత్య కళ్యాణం,పచ్చ తోరణం’ అయింది. నేనా స్పాటుకి వెళ్లి  ఏక్సిడెంట్ల గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటే , వాడు కనబడ్డాడు. నా డబ్బు వాడికి, వాడి అవసరం  నాకూ ఉంది, కాబట్టి డీల్ జరిగి పోయింది. ”

 "ఎంత ఇస్తున్నావేమిటి ?”

“ లక్ష రూపాయలు. సగం ముందే ఇచ్చాను, తక్కినది పని జరిగాక !”

“ లక్ష రూపాయలు ఆ తాంత్రికుడు ఒక్కడే తీసుకొంటాడా? జగ్గుకేమీ దక్కదా ?”

(ఇంకా ఉంది)

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద