Skip to main content

కొరకంచులో ఇనప మేకు ---16

“ జగ్గు డబ్బేం చేసుకొంటాడు భూషణం ! వాడికి ఆ తాంత్రికుడు ఏదో బలి ఇస్తాడు.”

“ బలే బాగుంది శీనూ ! నువ్వు ఆ దృశ్యాన్ని కళ్లారా చూసి , నాకు రిపోర్టు ఇస్తావా ?”

“ అవును,అందుకని ఆ స్పాటు కనిపించేలా,ఎదురుగా నున్న ‘గెస్టు హౌసులో’ రూము బుక్' చేసాను.ఆ స్పాటుకి దగ్గరగానే ఒక కొండ గుట్ట ఉంది. ఆ గుట్ట మీద తాంత్రికుడు ఒక పూరి పాక  వేసాడు. వాడు అక్కడ నుండే జగ్గు ఆత్మని కంట్రోల్ చేస్తాడు.

“ అయితే దాని పని రేపు రేపటికి పూర్తి అయిపోతుందన్నమాట ! శరణ్య పోయినా  ఇంకా నా పీకల మీదకి  ‘మానసి’ తగలడింది. దానిని కూడా ఆ తాంత్రికుడికి చెప్పి, క్లియరెన్సు చేయించు.”

“తప్పకుండా ఆ పని కూడా చేద్దాం. ముందు శరణ్య రాక్షసిని ,మానసి దగ్గరకి పంపి, తీరుబడిగా రెండు ఆడ దెయ్యాలని, జగ్గుకి అప్పచెప్పుదాం.వాడు పండగ చేసుకొంటాడు వాళ్లతో.” అంటూ వాళ్లిద్దరూ పగలబడి నవ్వుకొన్నారు.

ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.

ఆలీ కారుని ముందుగా ‘షావలీ బాబా  మజార్’ దగ్గరకి తీసుకెళ్లాడు. శరణ్య, నరేంద్ర ఆలీతో బాటు లోపలికి వెళ్లి, బాబాని ప్రార్థించి వచ్చి, కారులో కూర్చొన్నారు.

కారు పంచాగ్ని వైపు బయలుదేరింది. అది ‘ అసుర సంధ్య వేళ, ఆ దుర్ఘటనా స్థలానికి సమీపంగా వెళ్లింది.ఆ స్థలానికి ఆనుకొని ఉన్న ఒక కొండ గుట్ట, ఆ గుట్ట మీద  వెయ్యబడిన ఒక పూరి గుడిశె ముందు  రాజేసిన హోమగుండం దగ్గర ఒక తాంత్రికుడు, జరగబోయే విధ్వంస కాండకి సారథ్యం  వహిస్తున్నాడు.

ముందుగా ఆ తాంత్రికుడు,‘ జగ్గు’  ప్రేతాత్మని అక్కడికి పిలిచాడు. మంత్రించ బడిన నిమ్మకాయ  తీసాడు. దానిని  కోయగానే ‘ఎర్రని రక్తం’ విరజిమ్మింది !

దానిని ప్రేతాత్మ ఆగమన సూచకంగా భావించాడు ఆ తాంత్రికుడు. కాని వానికి తెలియని విషయం ఇంకొకటి ఉంది!

ఇద్దరు  మహా పురుషుల దివ్యాత్మలు అదే  షావలీ బాబా, అతని గురుదేవుల ఆత్మలు, అదే సమయంలో జాగృత మయి, తన సన్నిధికి వచ్చే  ముందే, ‘ జగ్గుని’ తమ ఆదేశంతో బంధించి వేసారనీ, నిమ్మకాయ కోయగానే బయటికి స్రవించిన రక్తం, తన  తాంత్రిక ప్రయోగం వల్ల, దుర్ఘటనకి గురయి మృతి చెందిన, ఇంకొక ప్రేతాత్మ  ప్రవేశానికి చిహ్నమని  తెలుసుకోలేక పోయాడు !!

“ చెప్పు,,ఎవరు నువ్వు?” కోసిన నిమ్మకాయ చిప్పలు విరుధ్ధమైన దిశలో విసిరేసి, అడిగాడు తాంత్రికుడు.,

‘హ,హ,హ నవ్వు !’

“ చెప్పమంటే చెప్పవేం అలా నవ్వుతావెందుకు?” హోమ గుండంలో మరింత గుగ్గిలం వేస్తూ అడిగాడు .

“ నేనురా, క్షుద్ర  పూజారీ, నీ పాలిటి పిశాచాన్ని, ‘ శాంభవిని’ !”

“శాంభవా !” తాంత్రికుడు నివ్వెర పోయాడు.“నువ్వెందుకు వచ్చావ్, నేను జగ్గును పిలిచాను?”

“జగ్గు ఎలా వస్తాడురా ? వాడు షావలీ బాబా చేతిలో గిజగిజ లాడుతున్నాడు. వాడికి బదులు నేను వెళ్తానంటే బాబా  అనుమతిని  ఇచ్చారు.”

“ నేను నిన్ను పిలువలేదు శాంభవీ ! నువ్వు మరలి పో ! కావాలంటే బలి ఇస్తాను.”

“ నన్ను నీ ప్రయోగానికి బలి చేసి, నాకు బలి ఇస్తానంటావా  క్షుద్ర  పూజారీ! నీ పాలిటి పిశాచాన్నై వచ్చాను, నాకు నీ నిమ్మకాయలు, పెరుగు అటుకులు  బలి అక్కర లేదు.”

“మరి నరబలి కావాలా, అలాగే తప్పక పెడతాను. మరి కొంత సేపట్లో, ఈ కొండ మలుపు దగ్గర, ఒక అమ్మాయి వస్తోంది. దాని పేరు శరణ్య. దాని జుత్తు, గోళ్లు, చెమట నీకు వాసన చూపిస్తాను. వెళ్లి దానిని లోయలోకి తోసేసి, నీ ఆకలి తీర్చుకో !.”

“జగ్గు చేయబోయే పనిని నాకు అప్పగిస్తావా క్షుద్ర  పూజారీ, నేను నీ  పాలిటి పిశాచాన్ని, నాకు కావలసింది నా చావుకి ప్రతీకారం ! ఆ అమ్మాయిని చంపితే  నా పగ ఎలా తీరుతుంది ?”

“వద్దు, శాంభవీ ! నన్ను వదిలెయ్యి, కావాలంటే  నీకు ప్రతీ రోజూ బలి ఇస్తాను. నన్ను చంపితే నీకు ప్రతీ రోజూ లభించే బలిని కోల్పోతావు, ఆలోచించు.”

“ నాకు మరో ఆలోచన లేదురా ! క్షుద్ర  పూజారీ, నేను నీ పాలిటి పిశాచాన్ని,” అని  శాంభవి, హోమగుండం  నుండి , మండుతున్న తన రెండు చేతులనీ బయటికి చాపింది. తాంత్రికుడు ఆ చేతులనీ, భగ భగమని  మండుతున్న వాటి గోళ్ల చివర్లనీ  భయంతో చూసాడు.

“ శాంభవీ ! వద్దు, వద్దు, నన్ను వదిలెయ్ !” అంటూ పరుగు తీసాడు.

శాంభవి తాంత్రికుణ్ని వదల లేదు, తన చేతులని , భూగర్భం  లోంచి భూమిని చీల్చుకొంటూ అతను పరుగెడుతున్న  దిక్కు వెంబడి తరమ సాగింది. తాంత్రికుడు భయంతో, పొలికేకలు పెడుతూ పరుగెత్తబోయి, తడబడి నేలపై పడ్డాడు.

అంతే ! భూగర్భం లోని చేతులు రెండూ , అతని కాళ్లని దొరక బుచ్చుకొన్నాయి, ఆ కాళ్లని పట్టుకొని అతనిని భూమిలోకి లాగేసాయి!! తాంత్రికుడు హృదయ విదారకంగా  అరుస్తూ ఆ చేతుల మధ్య గిలగిల లాడాడు ! ఆ తరువాత  ఏమీ జరగనట్లే రెండు పాయలుగా చీలిన భూమి తిరిగి కలిసి పోయింది.
 
అదే సమయంలో  శరణ్య కారు ఆ కొండ మలుపుని సురక్షితంగా దాటి పోయింది.

దూరంగా, గెస్టుహౌసు మేడ మీద నిలబడి, బైనాక్యులర్లతో ఆ కారు దాటి పోయిన దృశ్యాన్ని చూసిన దున్నపోతు శీను ఆశ్చర్య పోయాడు!

‘ఏమిటిది ? ఎందుకిలా జరిగింది ? ’ అనుకొంటూ వెనక్కి తిరగబోయిన  అతను, ఎవరో తనని పట్టుకొన్నట్లు అనిపించి, ఎవరది, నన్నెందుకు పట్టుకొన్నారు ?” అంటూ పొలికేక పెట్టాడు,      

“నేనేన్రా మానసిని ! నన్ను  నిండు గర్భిణిని  బలవంతంగా  చెరచావు కదా ఆ రోజు, ఇవాళ నా వంతు ! నా కాళ్లు పట్టుకొని, సాగదీసి, నీ మిత్రులకి, నన్ను చెరిచేందుకు సాయ పడ్డావు కదూ, దాని ఫలితం అనుభవించు !” అంటూ అతని కాళ్లని ఎత్తి మేడ మీద నుంచి ఎత్తి కుదేసింది మానసి. అంతే !

దున్నపోతు శీను కాళ్లు రెండూ గాలిలో తేలాయి. అతని శరీరం క్రింద పడింది. తల నేలకి తగిలి, కొబ్బరికాయలా రెండు చిప్పలయింది.


(ఇంకా ఉంది)

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద