Skip to main content

కొరకంచులో ఇనప మేకు---17

 మణికంఠ సిధ్ధునికి, నీలా  సుందరితో పొందిన  అనుభవం ద్వారా, ‘ కుండలినీ  జాగరణ ’ జరిగినా, అతడు అసూయనీ , అహాన్నీ జయించ  లేక పోయాడు .

‘అసూయ’ , ఆమె  తనతో  వృధ్ధురాలి వేషంలో వచ్చి, సంభోగించినందుకు ! అహం తనంతటి సాధకుడు ఉండగా ఆమె ఒక ముక్కు పచ్చలారని బాలకుని సాధనని కూడా అంగీకరించినందుకు. అతడు  మోసగింప బడ్డాడని తలచాడు, దానితో క్రోధానికి తల వగ్గాడు. అసూయ, క్రోధము, అహము  ఎప్పుడైతే అతనిలో చేరాయో అతని వివేకం నశించింది.

పధ్నాలుగేళ్ల బాలుణ్ని,‘కృత్య’ అనే భయంకర పిశాచశక్తి ద్వారా అంతమొందింఛేందుకు దానిని ఆహ్వానించాడు. అది వాని ముందు వచ్చి నిలిచింది. దాని భయంకర రూపం వర్ణణాతీతం. దాని నాలుక  అగ్ని జిహ్వలాగ  ఉంది, దాని కోరలు ఏదుపంది ముళ్లలా ఉన్నాయి. దాని మిడి గ్రుడ్లు, గుడ్ల గూబకే  వణుకు  పుట్టించేలాగ  ఉన్నాయి. దాని శరీరం సగం విరిగి పడిన అగ్ని పర్వత  శిఖరం లాగ  ఉంది.  కాళ్లు చేతులు తాటి చెట్టు  కాండాలలా ఉన్నాయి.

“మణికంఠా ! ఏమాఙ్ఞ ?” అని అడిగిందా భయానక  పిశాచం

నీలా సుందరి  సాధకుడైన, ‘ ఒక బాలకుణ్ని’ సంహరించాలని చెప్పాడు  మణి కంఠుడు.

కృత్య వెంటనే  వెళ్లి, సరస్సులో స్నానమాడుతున్న ఆ బాలకుణ్ని చూసింది. మొసలి ఆకారం దాల్చి, ఆ బాలకుని మృదువైన శరీరాన్ని నమిలి, నమిలి  భక్షించింది.

నీలా సుందరి, మంత్ర పఠనం వల్ల వివశురాలై, ఆ రాత్రి  తన దివ్య సుందర  సౌమ్య రూపంతో , అతనిని అలరించింది. ఆ కలయిక, మునుపటి వలె కాక, కామంతో కూడి, కోరికతో జ్వలించి, తనని హింసించే పనులతో ముగియడం ఆమెకి, నచ్చలేదు ! తనతో రతిని సాధనగా తలచిన ఒక  ఆరాధకుడు కామంతో  తనని  బలాత్కారం చేసినట్లు ఆమెకి తోచింది ! ఆమెకి  కూడ కోపం వచ్చింది !

అంతే!ఆ రోజు రాత్రి, నీలా సుందరికి , మణి కంఠునికి ఆ బాలకుని హత్య  విషయంగా వాగ్వాదం జరిగింది. నీలా సుందరి తన ప్రియుడు , రక్షకుడు రాజు అయిన , నలకుబేరునికి ఈ విషయాన్ని వివరంగా చెప్పింది.

కేవలం సంభోగం కోసం, మంత్ర శక్తికి అధీనురాలై వచ్చిన యక్షిణిని కూడా బలిమిని చెరబట్ట  కూడదని అతనికి తోచలేదు !! నీలా సుందరి తనని ఏమీ చేయలేదని, మణి కంఠుడు భ్రమ పడ్డాడు. కాని నలకుబేరుని సంగతి అతనికి తెలియదు ! నలకుబేరుని శాప ఫలితంగా అతడు భూగర్భం లోని, ఒక గుహలో,కర చరణాలు శక్తి హీనమయిన అవిటి వాడుగా మారి, బంధితుడయ్యాడు !!

నీలా సుందరి, తనని ఆరాధించి హత్యకి గురి అయిన  బాలకుని, మరుజన్మ  కోసం ఎదురు చూసింది . ఆ బాలకుడు, ‘అనిరుధ్ధ్’ నామధేయంతో  తిరిగి జన్మించాడు. అనిరుధ్ధ్ తన భార్య రమతో, ఆ గుహలపై, నిర్మింప బడిన ఒక  ఇంటికి అద్దె కోసం రావడంతో, మళ్లీ ‘ నీలా సుందరి’ కథ మొదలయంది.

నీలా సుందరి తనకీ, తన సాధకునికీ అడ్డుగా నిలిచిన ,‘ రమని’ ఆ భవనం క్రింద గుహలో బంధించింది. అనిరుధ్ధ్’ని  తన మోహ పాశంతో, తన వాడిగా చేసుకొంది !

రమ ఆధునిక  యువతి అయినా  పతివ్రత ! పతివ్రతలు ఏ కాలంలో నైనా సమర్థులే ! వాళ్లు ‘సమర్పణ’ అనే సాధన  ద్వారా, తమ  పతి యందు స్థాపించబడిన  భగవంతునితో, సారూప్యం పొంది తరించి, తమతో పాటు తమ భర్తలను కూడా తరింప చేస్తారు.

రమ ఆ పనినే , అంత నిస్సహాయ స్థితిలో కూడ  సాధించింది ! అనిరుధ్ద్  తప్పు ఏమీ లేదనీ, నీలిమ  అతనిని సమ్మోహన  పరచిందని, రమ  అర్థం చేసుకొంది. ముందుగా, తన భర్తకి  తన గురించి, ఙ్ఞాపకం చేయడం తన కర్తవ్యం అని , ఆ తరువాత తన భర్తే , తక్కిన దంతా చూసుకొంటాడని  భావించింది. భర్తకి  తనను గుర్తు చేయమని, రాత్రిం పగల్లు ఆమె భర్త నామ జపాన్ని చేసింది.

చివరికి  ఒక రోజు, నీలిమ కౌగిలిలో  పడుకొని ఉన్న, అనిరుధ్ధ్  కలలో , రమ కనిపించింది. ఆ రాత్రే కాదు, ప్రతీ రాత్రీ తన రూపాన్ని భర్త కలల్లో  కనిపించేలా చేసింది. అతనికి కలలోనే , తన దీన గాధని  వినిపించింది !

అనిరుధ్ధ్  జాగృతుడయ్యాడు. క్రమ క్రమంగా, నీలిమ మానవ కాంత  కాదనీ, ఆమె ‘ రతి ప్రియ’ అయిన యక్షిణి’ అని  తెలుసుకొన్నాడు. ఒకనాడు తన  మంచం క్రింద  ఉన్న, సొరంగ మార్గం సంగతి తెలుసుకొని, దాని గుండా వెళ్లి, ‘ రమని’ కలిసాడు. అప్పుడతనికి  విషయమంతా  అర్థమయింది.

రమ సలహాతో అతను, నీలిమతో  తగవు పెట్టుకోలేదు. ఆమెని మరింత  సంతోష  పెట్టేందుకు, రతిలోని మరికొన్ని భంగిమలని గురించి అడిగి, తెలుసుకొని, ఆచరించాడు.

ఒక  రోజు అతడు పశువుల రూపంలో, సంభోగం  చేయాలనే కోరికని వెలిబుచ్చాడు. నీలిమ అతనికి  ఒక మంత్రాన్ని ఉపదేశించింది. దాంతో అతను జింకగా మారాడు. నీలిమ ఆడు జింకగా  మారి, అతనితో  భోగించింది. అలా వారు పాముల లాగ, పశువుల లాగ, పక్షుల లాగ  మారి, తమ అనుభవాన్ని  పంచుకొన్నారు. అనిరుధ్ధ్ , నీలిమ ద్వారా,‘అణిమాది అష్ట సిధ్ధులని’ ఉపదేశం పొంది , ఆమెతో రక రకాలుగా కేళీ విహారాలు చేసాడు.

అలా మంత్ర సిధ్ధుడైన  అనిరుధ్ధ్, ఆ నేలమాళిగలోనే  ఉన్న ,‘మణికంఠ’  సిధ్ధున్ని బాగు చేసాడు. అతనికి  తన మంత్ర శక్తిని ఇచ్చి,అతడు  ‘నీలిమని’  తిరిగి పొందేలా  చేసాడు ! మణికంఠుడు , నీలా సుందరిని వశం చేసుకొన్నాక, అనిరుధ్ధ్  , రమని తీసుకొని, ముంబయి  వదిలి, పారిపోయాడు.

 ఆ తరువాత తనకి లభించిన మంత్ర శక్తితో లోకులకి  ఉపకారం చేస్తూ, రమతో పాటు గృహస్థ ధర్మాన్ని నెరవేర్చాడు, కాని  మణికంఠ సిధ్ధుడు మరణించడంతో, విడుదల అయిన , నీలాసుందరి కోపాగ్నికి, గురి అయి, యాత్రలో ఉండగా, అపాయానికి  లోబడి, ప్రాణాలని  పోగొట్టుకొన్నాడు.

తన తల్లి తండ్రుల  చరిత్రని తెలుసుకొన్న, ‘శరణ్య’  కళ్ల వెంబడి కన్నీరు ధార కట్టగా, విలపించింది. వాళ్ల పుణ్య ఫలమే తనని అడుగడుగునా రక్షిస్తోందని , తన తండ్రి తిరిగి, ‘నరేంద్రగా’ జన్మించి తనకి అండగా నిలిచాడని  అర్థం తెలుసుకొంది. తన తండ్రిని తలచుకొంటూ నరేంద్రని ముద్దులాడింది.

(ఇంకా ఉంది)

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద