Skip to main content

కొరకంచులో ఇనప మేకు ---18

 అవినాష్ , శరణ్య తనకిచ్చిన  పని చేసేందుకు స్వయంగా ఉద్యుక్తుడయ్యాడు.

ముందుగా చెంబూరు లోని, పదిహేడు అంతస్తుల భవనం ,గ్రౌండ్ ఫ్లోరులో ఉన్న ‘ శరణ్య అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసుకి’ వెళ్లాడు. అక్కడ  ఒక కంప్యూటరు ముందు కూర్చొని ఉన్న, గుమాస్తాకి, నమస్కారం చేసి నిల్చొన్నాడు. గుమాస్తా.తన ముందు నిల్చొని ఉన్న, అవినాష్ వంక  చూసాడు.


అవినాష్  సాధారణంగా ఉన్నాడు, తెల్ల  చొక్కా ని, నీలం రంగు జీన్సు ఫేంటులో  టక్  చేసి, సాధారణమైన బెల్టు పెట్టాడు. నల్లని బూట్లు వేసుకొన్నా, అవి నిగ నిగ లాడుతూ  లేవు, పైగా బైక్ మీద వచ్చాడు ! అతనిని ఎగా దిగా చూసి,“ ఏం కావాలి ?” అని అడిగాడు  గుమాస్తా.

“ మీరు ఈ కమర్షియల్ కాంప్లెక్సులో, ఆఫీసు ఫ్లోర్’లను  అద్దెకి  ఇస్తారని విన్నాను, --- ”

“ ఏం నీకు కావాలా ?” మాట మధ్యలోనే ‘కట్’ చేసి  అడిగాడు గుమాస్తా.

“ అవునండి !”

“ కమెర్షియల్ కాంప్లెక్సులో, ఆఫీసు రూములు అద్దెకిచ్చే మాట నిజమే, కాని బాగా తెలిసిన వ్యక్తులకి, మంచి రిప్యుటేషన్  ఉన్న వాళ్లకి మాత్రమే ఇస్తాం ! మీ లాంటి  అపరిచుతులకి ఇవ్వం.”

“ నిజమేనండి, ఆ మాటే వాళ్లూ చెప్పారు.”

“ ఏ మాట, ఎవరు చెప్పారు ?”

“ ఫనాహ్ కంపెనీ  హెచ్. ఆర్. ఒ , రాఖీ, జానకి  మేడం గార్లు చెప్పారు, మీరు ఏప్రిల్ పదమూడవ తారీఖు నాడు, వాళ్లకి, పదమూడవ అంతస్తులో  ఒక ఆఫీసు ఫ్లోరు అద్దెకిచ్చారట కదా ?”

గుమాస్తా వేళ్లు కంప్యూటరు కీ బోర్డు మీద చక చకా పని చేసాయి. అవినాష్ చెప్పినది నిజమే అని తేల్చు కొన్నాక ఇలా అడిగాడు,“వాళ్ల దగ్గర నుండి ఏదైనా,‘రికమెండేషన్ లెటర్’ తెచ్చావా ?” అని.

“ లేదండి, వాళ్ల చిరునామా కార్డు పోగొట్టుకొన్నాను, అందుకని  మీరు దయచేసి ఆ అడ్రస్సు ఇస్తే, అక్కడికి వెళ్లి లెటర్ పట్టుకొస్తాను.” అన్నాడు అవినాష్.

గుమాస్తా అవినాష్ వంక గుంభనగా చూసి, లోలోపల నవ్వుకొన్నాడు. వెంటనే ఒక కాగితం స్లిప్పు మీద, ఆ అడ్రెస్సు  వ్రాసి ఇస్తూ,“నే నొక మాట అడుగుతాను, కోపం తెచ్చుకోరు కదా?” అని అడిగాడు

“ అడగండి సార్ !” పని జరిగి పోయింది కదా, అని సంతోష పడుతూ అన్నాడు అవినాష్ !

“ మిమ్మల్ని చూస్తే ఆఫీసు అద్దెకి తీసుకొనే మనిషి లాగ అనిపించ లేదు, పోతే, ఆ రాఖీ, జాకీ మేడం గార్ల దగ్గర ఏదో  తేడా వచ్చి, పేమెంటు ఆగి పోయిన బాపతు లాగ అనిపిస్తున్నారు, అవునా ?”

గుమాస్తా మాటలు  అర్థమవడానికి కాస్త సమయం పట్టింది అవినాష్’కి. వెంటనే నవ్వుతూ,“ ఏం సార్! మీ కమీషన్ కూడా వాళ్లు ఇవ్వలేదేంటి ?” అని ప్రశ్నకి బదులుగా మరో ప్రశ్న వేసాడు.

గుమాస్తా నవ్వేసాడు,“ఎలాగూ వెళ్తావుగా, నా కమీషన్ సంగతి కూడా ఙ్ఞాపకం చెయ్యి,”

“ అలాగే సార్ ! తప్పకుండా చేస్తాను” అని ఆ బిల్డింగు బయట పడ్డాడు అవినాష్.

‘నెరుల్’ లోని, కల్పతరు హౌసింగ్ సౌసైటిలోని ఆరవ అంతస్తు లోని రాఖీ, జాకీల ఇంటి కాలింగ్ బెల్  నొక్కాడు అవినాష్.

జాకీ తలుపు తీసింది. “ అవినాష్’ని చూసి, ఎవరో అర్థం కాక, “ ఎవరు కావాలి ?” అని అడిగింది. ఆమె నల్ల కళ్లజోడు ధరించి ఉంది !

“ మేడం ! నేను  అవినాష్’ని. మీకు ‘ జూనియర్ ఆర్టిస్టులని  సప్లయి చేసాను, గుర్తు రాలేదా?”

“ అవును, గుర్తుకొచ్చింది ! ఏం పని మీద  వచ్చావ్ ?”

“ నా గర్ల్ ఫ్రెండు శరణ్య గురించి  కనుక్కోవాలని వచ్చాను.ఆమెకి మంచి ఆఫర్ వచ్చింది, మీ పని ముగిసిపోతే , ఆమెని రిలీజ్ చేస్తారేమోనని --- ” అంటూ నసిగాడు అవినాష్.

“ ఓహ్ ! శరణ్యా ! అది ఎప్పుడే పని మానేసి వెళ్లిపోయిందే ! నిన్ను కలియ లేదా ?”

“ శరణ్య  పని మానేసి వెళ్లిపోయందా ! నేను నమ్మలేక  పోతున్నాను మేడం ! అది చాల సిన్సియర్ మనిషి !”

“ ఏమి సిన్సియారిటీవో ! నీ గర్ల్ ఫ్రెండ్ కదా, అందుకే సపోర్టు  చేస్తున్నావ్, ముందుగా పేమెంటు చెయ్యడం మా పొరపాటు అయిపోయింది.” అంది జాకి.

అవినాష్ నరేంద్ర గురించి అడగాలని అనుకొన్నాడు, ఎలా అడగాలో తోచలేదు, ఇంతలో ఒక ఉపాయం తోచింది, “ నిజమే మేడం ! ఎడ్వాన్సు చెక్కు ఇవ్వడం మీదే పొరపాటు, నా దగ్గర మరొక అమ్మాయి ఉంది మేడం , చాలా నెమ్మదయినది, చిన్న పిల్లల ఆయాగా  పని చేసిన అనుభవం ఉంది. పంపించమంటారా ?”  అని అడిగాడు.

“ నా కిప్పుడు ఆయా అవసరం లేదు, మా మేనల్లుడిని మేమే కంటికి రెప్పలా చూసుకొంటు న్నాము, ఇక నువ్వు వెళ్లవచ్చు,” అంది జాకి.

అంతలో గదిలోంచి పసి పిల్లవాడి ఏడుపు వినిపించింది. అవినాష్ వెంటనే రియాక్ట్ అయ్యాడు,    “మేడం ! మీ మేనల్లుడిలాగ  ఉన్నాడు, నేనొక సారి చూడవచ్చా ?” అని అడిగాడు.

ఇంతలో బయటి నుంచి  రాఖీ వచ్చింది. ఆమె కూడా నల్ల కళ్లజోడు పెట్టుకొనే ఉంది. అవినాష్’ని చూసి అడిగింది. “ వీడెందుకు వచ్చాడే జాకీ ? ఎలా రానిచ్చావు ?” అంటూ.

“ శరణ్య  గురించి  అడగడానికి వచ్చాడు., కొత్త  ఆయాని  తెస్తాడట ! లోపల బాబు ఏడుపు వినిపిస్తే చూస్తానని అంటున్నాడు, ఏం చెయ్యమంటావ్ ?”

“మన బాబును చూపించడానికి మనకెందుకు భయం ? పోతే శరణ్యే కాదు, ఎలాంటి  ఆయా అక్కర లేదు, అది చాల డర్టీ జాబ్ చేసి వెళ్లింది” అంది రాఖీ.

జాకి, అవినాష్’ని గది లోపలికి తీసుకెళ్లింది.అక్కడొక  మంచం మీద పడుకొని ఉన్నాడు ఒక మూడేళ్ల బాబు ! బాబు చాలా చిక్కిపోయి ఉన్నాడు, ఏడుపు కూడా సన్నంగా  వినిపిస్తోంది. వాడిలో నరేంద్ర  పోలికలు  వెతికాడు అవినాష్ . ఆశ్చర్యం ! ఆ బాబు నరేంద్ర లాగే ఉన్నాడు !!

అవినాష్  గదినుండి బయటికి వచ్చాడు. రాఖీ అతనీతో ఇలా  చెప్పింది,“శరణ్య కనిపిస్తే చెప్పు.  మా సొమ్ము పోయినందు కు  మేము బాధ  పడడం లేదు, తిరిగి సంపాదించు కోవడం మాకు తెలుసు, కాని మళ్లీ మా జోలికి వచ్చిందో దానికే పుట్టగతులు లేకుండా పోతాయి. ఎక్కడి వాళ్లు అక్కడ ఉంటేనే మంచిది, ” అని.


ఇంకా ఉంది)

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.   ...

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ...

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని ...