Skip to main content

కొరకంచులో ఇనప మేకు --19

  “ అలాగే మేడం !” అంటూ బయట పడ్డాడు అవినాష్. అతనికి తల దిమ్మయి పోయింది. ముఖ్యంగా రాఖీ మాటలు, ‘మా సొమ్ము పోయినందుకు మేము బాధ  పడడం లేదు, తిరిగి సంపాదించు కోవడం మాకు తెలుసు’ అన్నవి!  ఆ మాటలకి అర్థం ఏమిటి ? నరేంద్ర  పోయినందుకు మాకు చింత లేదు, మళ్లీ  మరో నరేంద్ర ని సంపాదించాం అనా !? ఈ విషయం  శరణ్యకి వెంటనే వెళ్లి చెప్పాలి, అనుకొన్నాడు.


అవినాష్  వెళ్లిపోయాక, రాఖీ , జాకీతో అంది.“చూసావా, దాని చమత్కారం ! ప్రియుణ్ని పంపి ఏం జరిగిందో చూడమని  చెప్పి ఉంటుంది. ఇక్కడ జరిగింది తెలిసాక దాని దిమ్మ తిరిగి పోతుంది” అని.

“మంచి డోసు ఇచ్చాం కదూ ! వాడిని ఏం చేయాలి ? అలా వదిలెయ్యడమేనా?”జాకి అడిగింది

“అలా ఎందుకు వదిలేస్తానే ! మన వాళ్లకి అప్పుడే ఫోను కనెక్టు చేసాను, ఈ సందు మొగదలలో కాచి, వాడి భరతం పడతారు, మళ్లీ  మన  ఇంటి ఛాయలికి రాకుండా !” అంది. అలా ఆంటూ ఉండ గానే ఆమె చేతిలోని సెల్ ఫోను మ్రోగింది.

రాఖీ మాట్లాడింది, “ మా ఇంటి నుండి అవినాష్ ఇప్పుడే బయట పడ్డాడు. వాడి మళ్లీ మన గల్లీ వైపు రాకుండా చేయండి.”

“ అలాగే మేడం !” అని వినిపించింది అటువైపు నుంచి.

అవినాష్  కల్పతరు గేటు దాటి  దాని మలుపులో ఉన్న ఒక గల్లీ వద్దకు వచ్చాడు. ఆ గల్లీ నుంచి ఒకతను దూసుకొంటు వచ్చి, అతనికి డేష్  కొట్టాడు. అవినాష్  క్రింద పడబోతూ నిలద్రొక్కుకున్నాడు.    “ఏయ్ ! ఎవరు నువ్వు ? నన్నెందుకు తోసేసావ్ ?” అని  అడిగాడు.

“ ఈ  గల్లీ నీ బాబుదేంటిబే !” అన్నాడా రౌడీ. అంతలో ఆ గల్లీ చివర నున్న మరో రౌడీ, మొదటి వాడిని ఉద్దేశించి  బిగ్గరగా  అడిగాడు. “ ఏంటి  కథ ?” అని.

“ చూడన్నా ! వీడేవడో నన్ను ధక్కా కొట్టి, ఉల్టా నా మీదే ఎగురుతున్నాడు,” అన్నాడు.

అవినాష్’కి వాళ్ల  ఉద్దేశం అర్థమయింది. వాళ్లు కావాలనే తనని టీజ్’ చేస్తున్నారు. బహుశా రాఖీ  వాళ్లని తన మీద  ఉసికొల్పి ఉంటుంది ! ఇప్పుడేం చేయాలి ? గల్లీకి అటువైపు పారిపోవాలి, వాళ్లిద్దరూ  ఒకరి కొకరు సహాయం  చేసుకోవడానికి ముందే , కాని ఎలా, ఏదైనా  ఆయుధం ఉంటే బాగుండును’ అనుకొంటూ, ఆ గల్లీలో ఏమైనా దొరుకు తుందేమోనని చుట్టు ప్రక్కల, క్రిందా మీదా చూసాడు.

అప్పుడు కనిపించిందొక  ఆయుధం ! కొరకంచులో ఇనప  మేకు ఉన్న ఆయుధం ! అవినాష్’కి దాని గురించి ఏమీ తెలియదు. అయినా  అది తప్పించి మరొకటేదీ కనిపించ లేదు ! దానినే చేతిలోకి తీసుకొని శక్తి కొద్దీ గల్లీలో పరుగు తీసాడు.

అతనికి ఎదురుగా ఉన్న రౌడీ, అవినాష్’ని ఆపడానికి ప్రయత్నం చేసాడు, “ఆగరా ! బద్మాష్ !” అంటూ. గల్లీకి అటువైపు ఉన్న మరో రౌడీ అవినాష్  వైపు పరుగెత్తాడు, “ఆగరా  ఇడియట్ !” అంటూ.

అవినాష్ చెసేది లేక తన చేతిలోని, కొరకంచులో ఇనప  మేకుని వారికి చూపించాడు, “ఒరేయ్ ! నన్ను వదిలెయ్యండి, లేకపోతే దీంతో పొడిచేస్తాను” అని.

అతని ఆయుధాన్ని చూసి వాళ్లు పక పకా నవ్వారు.“ఇదా నీ వెపన్ ! దీంతోనా మమ్మల్ని పొడుస్తావ్ ?” అంటూ.

అంతే !

అవినాష్  చేతిలోని  కొరకంచు వాళ్ల మీదకి తనంత తానే లంఘించింది.ఇద్దరి తొడలనీ తన మేకుతో చీల్చేసింది. వాళ్ల తొడల లోంచి రక్తంతో పాటు ఏవేవో నరాలు బయటకి పొడుచుకొని వచ్చాయి.

“బాబోయ్, అయ్య బాబోయ్ ! దీన్ని వెనక్కి తీసుకోండి తీసుకోండి బాబయ్యా !” అంటూ చేతులు జోడించి విలపించ సాగారు.అవినాష్ కొరకంచుని చేతిలోకి తీసుకొన్నాడు. అతని చేతిలోకి తీసుకోగానే అది మామూలుగా మారిపోయింది. దానిని దగ్గరున్న కొళాయి  నీటిలో కడిగి తన రుమాలులో కట్టి,  ఆ గల్లీని దాటాడు, అవినాష్, ఆ రౌడీలిద్దరినీ వాళ్ల ఖర్మానికి వదిలేసి !


(ఇంకా ఉంది)

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద