Skip to main content

కొరకంచులో ఇనప మేకు--20


ఆ రోజు  వార్తా పత్రికలో పడిన సమాచారం చదివి, భూషణ్ ఆశ్చర్య చకితుడయ్యాడు.

‘ఒక హిందూ  నవ నవోన్మేష నవోదయ మరాఠీ  తార ‘ శరణ్య’ , బాబా షావలి’  మజారుని , ఇంత వరకు అరవై ఏడు మంది దుర్ఘటనలకి గురి అయి, ప్రాణాలు పోగొట్టుకొన్న స్థలంలో కట్టేందుకు, తద్వారా దుర్ఘటనలని నివారించేందుకు  అయిదు లక్షల రూపాయల విరాళాన్ని,‘చించి పోకలీ’ లోని ‘బాబా షావలి’, మేనేజింగ్ కమిటీకి ఇచ్చింది. వివరాలు, ఆ తారతో ఇంటర్వ్యూ లోపలి పేజీలలో—అన్న వార్త అది.

ప్రక్కనే శరణ్య ఫొటో రంగులలో ముద్రించబడి ఉంది..‘ఆ ఫొటోలో అది బాగానే ఉంది, అనుకొన్నాడు, ఈ శరణ్య కేసుని మరికాస్త జాగ్రత్తగా డీల్ చేసి ఉంటే, ఆమె తనకి దక్కే ఉండేది !’ అనుకొన్నాడు.

తన ప్రమేయం లేకుండానే నిజంగా స్టార్  అయిపోయంది ! లోపల పేజీలో ఇంటర్వ్యూ చదివాడు భూషణ్. ఆమె మొదటి సినిమా ఇంకా రిలీజు కాక ముందే, నటిస్తున్న సినిమా , ‘రషెష్’ చూసి అప్పుడే మరో రెండు మరాఠీ సినిమాలకి ఆమెని బుక్’ చేసేసారట, అక్కడి నిర్మాతలు !

అందులో ఒకతను,బాలీవుడ్ ప్రొడ్యూసర్ కూడానట! ముందుగా మరాఠీలో చిన్నబడ్జెట్టు సినిమా తీసేసి,ఆ తరువాత ,హిందీలో సినిమా నిర్మిస్తాడట ! ఆ హిందీ వెర్షన్’కి కూడా ఆమెనే ‘హీరోయిన్’ పాత్రలో పెట్టుకొంటానని అన్నాడట ! ఇవన్నీ అదే చెప్పింది ‘ప్రెస్’తో ! అయిదు లక్షలు విరాళం ఇచ్చి,  ప్రాణాపాయాన్నీ తప్పించుకోవడమే గాక,పేరు ప్రతిష్టలని కూడా ఆర్జించుకొంది ! తన హోటల్’కి వచ్చి, తన పీకమీద సవారీ చేసి ఇప్పుడు ఏకు మేకై కూర్చొంది.

మేకు అనగానే అతనికి, తన చుట్టూ రేప్ చేస్తానంటూ చుట్టూరా తిరిగిన, కొరకంచులో ఇనప మేకు’ గుర్తుకి వచ్చి, ఒళ్లు జలదరించింది. వెంటనే ఇక భరించలేక , బీహారీ బద్మాష్ నన్కీ యాదవ్’కి ఫోను చేసాడు.

“హలో భూషణ్ భాయ్ ! నేను నన్కీని మాట్లాడుతున్నాను.”

“హలో నన్కీ భాయ్ ! ఈ రోజు పేపర్లో శరణ్య  గురించిన వార్త  వచ్చింది చూసావా ?”

“చూసాను, దాని ఫొటో కూడా ఇచ్చారు, ‘మంచి మాల్’’  భూషణ్ భాయ్ ! కొంచెం జాగ్రత్తగా  పట్టాల్సింది.”

“నేనూ అదే అనుకొన్నాను, గాని  జరిగిపోయిన దాని గురించి కాదు. చేయాల్సిన దాని గురించి ఆలోచించు నన్కీ ! మనలో ఇద్దరు మిత్రులని అది పొట్టన పెట్టుకొంది. నా సర్వస్వం హరించింది.”

“నేను ఇంత సేపూ దాని గురించే ఆలోచించాను భాయ్ , నాకో ఉపాయం తోస్తోంది ! ”

“ఏమిటది ?”

“అది సినిమా స్టూడియోలకి వెళ్తూనే ఉంటుంది కదా దారి కాచి, ‘ కిడ్నాప్’ చేసేస్తే ---- ”

“అలా కుదరదు  నన్కీ, దాని వెనక ఆడ దెయ్యం సపోర్టు ఉందని మరిచి పోతున్నావ్ !”

“దెయ్యం ఇంట్లోనే ఉంటుంది కదా  భూషణ్ భాయ్ ! సినిమా స్టూడియోలకీ,  షూటింగులకీ దానిని  తీసుకెళ్లదు కదా, అందుకని, కిడ్నాప్ సక్సెస్ అయిపోతుందనే  నా నమ్మకం !”

“నిజమే ! అది రాత్రి ఇంటికి రాకపోతే ఆ ఆడ దెయ్యానికి  అనుమానం వస్తుంది. దాంతో అది మన మీద విరచుకొని  పడుతుంది.”

“దానిని కిడ్నాప్ చేసేసి, దేవాలయంలో  దాచేద్దాం ! దెయ్యానికి తెలిసినా, ఆ దెయ్యం, ఆలయం లోపలికి  రాలేదు కదా ?

“నిజమే కదా ?” అంటూ నవ్వాడు భూషణ్.

నన్కీ కూడ  శృతి కలిపాడు, “ నేను ఆ పనిలో ఉంటాను, ఫికిర్ మత్ కరో భాయ్ !’ అన్నాడు.

అవినాష్ , ఆలీ, శ్యాం, నరేంద్రలు, శరణ్యతో  ఆమె ఇంట్లో  సమావేశమయ్యారు.అవినాష్  తన పరిశోధన గురించి చెప్పాడు. రాఖీ , జాకీలు మరొక నరేంద్రని తయారు చేసారని, మరో రెండు వారాలలో  అమెరికా నుండి రాబోయే, తమ తమ్ముడికి ఆ డూప్లికేట్’ని  అప్పగిస్తారని  తెలియ జేసాడు.

‘‘ అవినాష్ ! దీనిని బట్టి అర్థమవుతోందేంటంటే,వాళ్లు పోలీసు రిపోర్టు ఇవ్వలేదు.ఏ రిస్కూ తీసుకోకుండా, డూప్లికేట్’ నరేంద్రని తయారు చేస్తున్నారు.అందువల్ల మనకి ఉన్నగడువు రెండు వారాలు!! ఈ లోపుగా మనం ఈ కుట్రని బద్దలు కొట్టాలి” అంది శరణ్య.

“ కంపు బాబాయితో  నేను అమెలికా  వెళ్లను. అక్క దగ్గలే ఉంటాను. క్రొత్త నలేంద్లనే  తీసుకొని పొమ్మను” అన్నాడు నరేంద్ర.

నరేంద్ర మాటల లోని నిప్పులాంటి నిజం వారికి  అతని పైన జాలిని, ఆ రాఖీ, జాకీల పైన కోపాన్నీ కలిగించింది.

“శరణ్యా! ఏమాలోచించావ్ ? ఎలా ప్రొసీడ్ అవుదాం ?”

“డూప్లికేట్  నరేంద్ర వైపు నుండి పరిశోధన చెయ్యాలి. ఆ అబ్బాయి ఎవరు, వాడిని  ఎక్కడ నుండైనా ఎత్తుకొని వచ్చారా, లేక  ఎవరైనా  దిక్కులేని  తల్లి తండ్రుల దగ్గర  కొనుగోలు చేసారా ? అన్న విషయం తెలుసుకోవాలి”

“నిజమే ! పోలీసు స్టేషన్’కి  వెళ్లి,  ఏవైనా పిల్లల  మిస్సింగ్ రిపోర్టులు  ఉన్నాయేమో చూడమంటావా ?”
 
“అలా చెయ్యవచ్చు, కాని వర్కవుట్  అవదు. రాఖీ జాకీలు పోలీసులని సైతం తమ స్కీములో కలిపేసుకొని ఉంటారు. పోలీసులు, లేక గుండాల సహాయం లేనిదే, ఒక కుర్రవాడిని ఎత్తుకొచ్చి, వాణ్ని రోగిష్టి వాణ్ని చేసి, రహస్యంగా పెంచడం కుదరదు.” అంది శరణ్య.

“అమ్మా ! మీ మాటల లోనే  ఒక విషయం బయట పడుతోంది.” అన్నాడు ఆలీ.

“ ఏమిటది ఆలీ ?”

“ పోలీసులు, లేక గుండాల సహాయం లేనిదే  ఈ పని చెయ్యలేరని మీరు అన్నారు కదా! బహుశా అవినాష్’ని కొట్టబోయిన  గుండాలు  వాళ్లకి సహాయపడి  ఉండవచ్చు.”

“ నిజమే ఆలీ ! మంచి విషయమే గుర్తు చేసావ్ ! అవినాష్  వాళ్లని నువ్వు చూసావు కదా, వాళ్లు బహుశా ఏదో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉండి ఉంటారు ! దగ్గర లోని ఆస్పత్రిలో విచారించి, వాళ్లని కలిసి, ఆకుర్రవాడి విషయం నయాన్నో, భయాన్నో రాబడదాం. పద, బయలుదేరు ” అంది శరణ్య.

“ ఇంత చిన్న విషయానికి నువ్వు రావడం దేనికి శరణ్యా ? నేను వెళ్లి కనుక్కుంటాలే ?”

“ ఇది చిన్న విషయం కాదు, అవినాష్ ! ఆ గుండాలకి నరేంద్ర  కొరకంచు చేసిన గాయం చాల పెద్దది ! అది అంత త్వరలో మానేది కాదు. ఆ గుండాలకి , రాఖీ జాకీలు ఆస్పత్రి ఖర్చులు పెడతారని నేను అనుకోను. ఇక్కడే మనం స్కోరు చెయ్యాలి.

ఆ కుర్రవాడి గురించిన సమాచారం రాబట్టాడానికి నువ్వు ప్రయత్నిస్తూంటే, రాఖీ జాకీలు  వాళ్లని నీ మీద ఉసిగొల్పారని, అంతే తప్ప వాళ్ల మీద మనకి  శతృత్వం లేదనీ చెప్పి, ఆ ఆస్పత్రి ఖర్చులు మనం భరిస్తే చాలు, ఆ గుండాలు మన మంచితనానికి పడి పోతారు.” అంది శరణ్య.

“ నిజమే, శరణ్యా ! అయితే బయలు దేరుదామా ?” అంటూ లేచాడు అవినాష్.

మరి కొంత సేపటికి  శరణ్య, అవినాషులు, ఆలీతో పాటు కారులో బయలు దేరారు.

నెరుల్ లోని డి.వై. పాటిల్ ఏక్సిడెంటల్ ఆస్పత్రి, చాలా ప్రముఖమైనది. ముందు రోజు ఇద్దరు రోగులు తొడల మీద నరాలు తెగి అక్కడ జాయన్ అయ్యారా, లేదా  అని ఎంక్వైరీ చేసిన వెంటనే, ఆ రోగుల పేర్లు , చిరునామాలతో  పాటు  వాళ్ల కేసు హిస్టరీ బయట పడింది.

వాళ్ల పేర్లు  సలీం అక్తర్. వాలీ సావంత్ ! కేవలం ఫస్ట్ ఎయిడ్  మాత్రమే జరిగింది ! ఆపరేషన్ అవసరం ఉంది, కాని ఆ రోగుల ఫేమిలీ ఇంకా డబ్బు సమకూర్చ లేదు.వాళ్లు రౌడీ షిట్టర్లు కాబట్టి  ఆ ఫేమిలీలకి  ఇరుగు పొరుగు సహాయం కూడా దొరక లేదు !


(ఇంకా ఉంది)

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద