Skip to main content

కొరకంచులో ఇనప మేకు ----24

శరణ్యా!

ఆశ్చర్యంతో అర్జున్’కి మాట రాలేదు!! కాసేపటికి తేరుకొని అన్నాడు “రంగారావు సర్! శరణ్యే మా టైగర్’ గారి పరమ శతృవు! ఆమెని చంపదానికే అతను ఈ అసైన్’మెంట్’ వదులుకొన్నాడు”

“అలాంటప్పుడు మనం శరణ్యకి ఆ విషయం చెప్పి, ఆమెని ఎలర్ట్ చెయ్యాలి! ఏమంటారు?”

“తప్పకుండా చెయ్యాలి, మనకి ఇంత ‘ఇన్ఫ్రాస్ట్రక్చర్’ ఇచ్చిన శరణ్య గారికి సహాయం చెయ్యాలి” అన్నాడు అర్జున్.

 తమిళ టైగర్ ఆర్ముగన్ పిళ్లై  స్వయంగా ఆరితేరిన గన్’మేన్ !

శరణ్యని  దూరం నుండి  మాటువేసి చంపెయ్యడానికి , తద్వారా తన పగనీ, తన  స్నేహితుల ప్రతీకారాన్నీ తీర్చుకో దలచిన  టైగర్, దానికి కావలసిన పరికరాలన్నీ స్వయంగా సమకూర్చుకొన్నాడు. ఈ విషయంలో ఇంకొకరి సహాయం తీసుకొంటే తన పని రహస్యంగా జరగదని  అతను ఆలోచించి, తానొక్కడే వెళ్లి ,‘ ఫిల్మ్ సిటీ’ పరిసరాలన్నీ చుట్టు తిరిగి పరిశీలించాడు.

నిర్మాణంలో ఉన్న ఒక పదహారు అంతస్తుల భవనం అతన్ని ఆకర్షించింది. ఆ భవనం  యొక్క పధ్నాలుగవ ఫ్లోర్లోని  ఒక కాంక్రీటు దూలం మీద , ఒక ‘టెలిస్కోపిక్  రైఫిల్ని ’ అమర్చాడు., దానికి సైలన్సర్  అమర్చాడు. ఆ రైఫిల్  యొక్క  టెలిస్కోపు  నుంచి చూస్తే ఫిల్మ్’సిటీ అంతా  కనబడుతోంది. సాధారణంగా,

అక్కడ జరిగే సభా కార్యక్రమాలు , పార్టీలు జరిగే వేదిక ఆ రైఫిల్ వ్యూ ఫైండర్లో  చాల చక్కగా కనిపిస్తోంది. కేవలం శరణ్యని టార్గెట్ చేసి గన్ ట్రిగ్గర్ని నొక్కితే చాలు, తన పగ, ప్రతీకారం అన్నీ క్షణ కాలంలో జరిగిపోతాయి. ఆర్ముగం పిళ్లై  అన్ని ఏర్పాట్లనీ స్వయంగా మరొకమారు పరిశీలించుకొని, ఆ ఫ్లోరునంతా కలయ జూసి, తృప్తితో  క్రిందకి దిగాడు.

ఇక రెండే రెండు రోజులు ! శరణ్య జీవితానికి ముగింపు పాడే  ఉత్సవ వేదిక రెండు రోజుల తర్వాత, తన తుపాకీ పర్యవేక్షణలో జరుగనుంది ! ఆ  క్షణాలే దానికి ఆఖరి క్షణాలు !!

ఆ రోజు రానే వచ్చింది !

పులి తన వేట కోసం మాటు వేసి కూర్చొంది.

ఫిలిం సిటీలో శరణ్య  అభినందన సభ మొదలయింది. శరణ్య మైకు ముందుకి వచ్చి తనకృతఙ్ఞతా భాషణ  మొదలు పెట్టే క్షణం కోసం పులి ఎదురు చూస్తోంది.

నిర్మాణంలో ఉన్న భవనాలకి, సామాన్లి చేరవేయడానికి , ఒక తాత్కాలిక లిఫ్టుని వాడుతారు. డిజెల్’తో నడిచే మిషన్తో అది ఆపరేట్ చెయ్యబడుతుంది. ఆ భవనానికి ఉన్న అలాంటి లిఫ్టు చప్పుడు చేసుకొంటూ మీదకి ఎక్కసాగింది. టైగర్ దృష్టి దాని మీద పడింది ! ఇదేమిటి పనివారెవరూ లేరే, ఇలాంటి సమయంలో లిఫ్టు ఎందుకు నడుస్తోంది, అనుకొంటూ దాని వైపు దృష్టి సారించాడు  టైగర్.

ఆ లిఫ్టులో  ఒక లాంగ్ కోటు వేసుకొన్న మనిషి  భవనం మీది ఫ్లోరుకి కాబోలు వెళ్తున్నాడు, ఎందుకంటే అది పద్నాలుగో ఫ్లోర్ దాటేసింది ! ఎవడో ఇంజనీయరు కాబోలు, తిన్నది అరగక , టాప్ ఫ్లోరులో బీములు లెక్కపెట్టడానికి ముఖ్యమయిన దేదో , ఆఖరి క్షణంలో చూసుకోవడానికి వచ్చి ఉంటాడు. ఎందుకంటే రేపే కదా ఆ ఫ్లోరుని కాంక్రీటుతో నింపేది ! ఫరవాలేదు, వాడు క్రిందకి దిగేలోగా తన పని అయిపోతుంది !’ అనుకొంటూ తిరిగి టెలిస్కోపిక్ రైఫిల్  వ్యూ ఫైండరులోంచి తన దృష్టిని ఫిలిం సిటీ  వేదిక మీదకి మరలించాడు టైగర్.

సరిగ్గా ఆ క్షణంలోనే టైగరు వ్యూలో ఒక  విచిత్రమైన వస్తువు కనిపించింది ! దానిని చూసిన టైగరు వెన్నెముక భయంతో అదిరింది ! అది ఇంకేదో కాదు, ‘ కొరకంచులో ఇనప మేకు’ !!

ఆర్ముగం పిళ్లై అలియాస్ తమిళ టైగర్  ఉలిక్కి పడ్డాడు. శరణ్య ఆయుధం  ఇక్కడికి ఎలా వచ్చింది, ఆ రాక్షసి తన ప్లానుని  కనిపెట్టేసిందా ? అనుకొంటూ అతను  వెను తిరిగాడు. తన వెనుక ఒక మూడు నాలుగేళ్ల  కుర్రవాడు ఉన్నాడు ! అతడే నరేంద్ర ! కాని ఆ విషయం పిళ్లైకి తెలియదు. నరేంద్ర తన ఆయుధాన్ని గాలిలో సైగలు చేస్తూ పిళ్లైకి గురిపెట్టాడు. అది -- ఆ కొరకంచు టైగరుపైకి వచ్చింది. టైగర్ పరుగెత్తాడు, టాప్ ఫ్లోరుకి చేరుకొంటే అక్కడ లిఫ్టు ఉంది, దాంట్లో దిగిపోవచ్చు’ అనుకొంటూ మెట్ల మీదుగా పైకి ఎక్కబోయాడు.

ఆ మెట్ల మీద రివాల్వరు పట్టుకొని  లాంగ్ కోటు హేటు పెట్టుకొన్న  వ్యక్తి అతనిని అడ్డుకొన్నాడు. వాడెవడో, తనకెందుకు అడ్డుపడ్డాడో  అడిగే సమయం లేదు. టైగర్  ఆలోచనంతా తప్పించుకోవడం పైననే ఉంది,

అప్పుడు కనిపించిందొక  చెక్క తలుపు ! టైగర్ దానిని చూసి, సంతోషంతో అటువైపు వెళ్లాడు.

ఆ చెక్క తలుపు వెనక టాయిలెట్ ఉందని అతనికి తెలుసు !  అదొక తాత్కాలిక కమోడ్ టాయిలెట్ ! పని చెసే వాళ్లు తమ అవసరాలు తీర్చుకొనేందుకు , మాటి మాటికీ క్రిందకి వెళ్లనవసరం లేకుండా అలాంటి టాయిలెట్లు నిర్మించుకొంటారు. ఆ విషయం  అతనికి తెలుసు. నిన్ననే దానిని చూసాడు కూడా !

టైగరు గాభరాతో ఆ చెక్క తలుపున తోసి, లోపలికి వెళ్లి  నిల్చొని తలుపు మూసేసాడు. ‘ ఇక ఫరవాలేదు, కొరకంచు ఇక్కడకి రాదు , తలుపు మూసేసి ఉంది కదా ! అని తేలికగా ఊపిరి తీసుకొంటూ కూర్చొనేందుకు, కమోడ్ వైపు చూసాడు.

ఆశ్చర్యం ! అక్కడ కమోడ్ లేదు. అసలు టాయిలెట్టే కాదది ! తాను నిల్చొన్నది కేవలం ఆరంగుళాల  పచ్చి ఆరని  కాంక్రీట్  దిమ్మ మీద, క్రింద నంతా  ఖాళీ ! ఆ పచ్చి ఆరని కాంక్రీటు దిమ్మ తన బరువుకి జారిపోతే తాను పడి పోవడం ఖాయం ! కాని ఇలా జరిగిందేమిటి, అక్కడ టాయిలెట్టుని తను స్వయంగా చూసాడే !

టైగరు మరొకసారి మూలమూలలు చూసాడు. అప్పుడు అర్థమయింది అతనికి, ఆ చెక్క తలుపుని ఎవరో మార్చేసారు! టాయిలెట్  నుంచి తొలగించి ఈ  ఖాళీ గొయ్యివైపుకి  మార్చారు ! ఎవరు చేసి ఉంటారిలా ? సమాదానం  దొరకని ప్రశ్నలు ! సరే, కొరకంచు భాధ వదిలింది, ఇప్పుడీ  స్థలం నుండి బయట పడడం గురించి ఆలోచించాలి.

టైగర్ చెక్కతలుపుని ఆనుకొని క్రిందకి చూసాడు, అతనికి ఒక కాంక్రీటు దూలం కనిపించింది, కేవలం రెండడుగుల క్రింద ! సంతోషంతో  ప్రాణాలు కాపాడుకోవడానికి  ఆ దూలం మీదకి దూకాడు.

పాపం ! తమిళ టైగర్ ఆర్ముగం పిల్లై ! అలా కనిపించిన దూలం కాంక్రీటు దూలం కాదని, పదునైన  ఇనపకమ్మీలు దానిక్రింద ఉన్నాయని, అవి కనిపించకుండా  కాంక్రీటులా కనిపించే కాగితంతో కప్పారని  అతనికేం తెలుసు ?

అతను అలా దూకిన మరు క్షణం ఆ ఇనప కమ్మీలు అతని తొడలలోనూ, బాహు మూలాల్లోనూ, గొంతుక లోనూ కళ్లల్లోనూ పొట్టలోనూ దిగబడి అతనిని మాంసపు ముద్దలా చేసి వ్రేళ్లాడేలా చేసాయి. !! అతని మరణం చూసిన వారికే గుండె ఆగిపోయేంత దుర్భరంగా దారుణంగా జరిగింది.

టైగర్ చావుకేక విన్న వెంటనే లిఫ్టు క్రిందకి దిగింది. అందులోంచి, నరేంద్ర, అర్జున్లు క్రిందకి దిగారు. క్రింద  ఆ లిఫ్టుని నడిపిన రంగారావు  వాళ్లని కలిసాడు. వెంటనే వాళ్లు, అక్కడకి దగ్గరగా ఉన్న ఒక మేన్-హోల్ లోకి దూరి సొరంగ మార్గం ద్వారా  బయటకి జారుకొన్నారు !

మానసికి  నాసికా త్రయంబకంలో యథావిథిగా కర్మకాండ జరిగింది, పగ చల్లారిన ఆ ప్రేతాత్మ సంతృప్తితో   ఊర్థ్వ లోకాలకి చేరుకొంది.

నరేంద్ర తల్లి , దుబాయిలోని తన  రెండవ భర్తకి విడాకులు ఇచ్చి, స్వదేశానికి తిరిగి వచ్చింది. ఆమె నరేంద్రని తీసుకొని పోవడానికి  నరేంద్ర తాతయ్యతో కలిసి శరణ్య  ఇంటికి వచ్చింది. నరేంద్ర తల్లి ఒడిలో ఆనందంగా ఒదిగి పోయాడు. వెళ్లేటప్పడు అతని బొమ్మల సంచీ లోంచి, కొరకంచులో ఇనప మేకుని తీసేసింది శరణ్య,

“ నరేంద్రా ! ఈ ఆయుధాన్ని ఇంక నిష్క్రియం చేసెయ్యి. బాగా చదువుకొని, ప్ర్రాఙ్ఞత వచ్చాక  నీ  యోగశక్తితో  మంచి పనులు చేసి గొప్ప వాడవయి  పేరు సంపాదించు.”  అంది. నరేంద్ర చిరునవ్వుతో దానికి అంగీకరించాడు.

శరణ్య ఆ ఆయుధాన్ని నరేంద్ర  ఙ్ఞాపకార్థం తనతోనే  ఉంచుకొంది.

నరేంద్ర తాతగారు శరణ్యతో ఒక హిందీ సినిమా , ఆమె చరిత్రనే మార్చి తీసాడు, అవినాష్  దానిని డైరక్టు చేసాడు. అది సూపర్ హిట్ అయింది. ఆ హిట్ వారినిద్దరికీ చాల పేరు తెచ్చింది.

శరణ్య  ఇంకా తన కెరీరు కోసం కన్యగానే ఉంది. ఆమెనీ అవినాష్’నీ  కలిపి ఎన్నో గాసిప్పులు  ప్రచారంలో ఉన్నాయి. వాటి గురించి అడిగినప్పుడల్లా  వాళ్లు  చిరునవ్వుతోనే తామిద్దరూ స్నేహితులమే అని జవాబిచ్చేవారు.

బహుశా మరో పదేళ్లకి  వాళ్ల  పెళ్లి వార్త  వినవచ్చు !!!


( సమాప్తం )

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద