Skip to main content

కొరకంచులో ఇనప మేకు ---9

 హారర్' నవల:

శరణ్య రాబోయే విపత్తుని ముందే అంచనా వేసి, ప్రయత్నాలు మొదలుపెట్టింది. నరేంద్రతో ఇలా చెప్పింది. నరేంద్రా! నా బలమంతా నువ్వేనని  వాళ్ళకి తెలియకూడదు! ఎందుకంటే నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివి! నీ విషయం తెలిసిపోతే ఈ సారికి వాళ్లు వెనక్కి తగ్గినా, నిన్ను నా నుండి వేరుచేసే పథకాలు వేస్తారు. అలా చేయగలిగేతే నన్నూ, నిన్ను  కూడా సర్వనాశనం చేస్తారు! అందువల్ల జరగబోయే మహా సంగ్రామంలో నువ్వు కల్పించుకో కూడదు! నీ రూములో నువ్వు నిమ్మళంగా పడుకొని, నేను పిలిచినప్పుడు రా! ‘మానసికి’ వాళ్ళందరి మీద ‘పగ’ ఉంది కాబట్టి, తనకి శరీరం లేదు కాబట్టి, నన్ను ఆవహించి, నాకు సహాయం చేస్తుంది, సరేనా?” అని.                                          
‘అలాగే, అక్కా! నేను పడుకొంటాను. నువ్వు నా ఆయుధాన్ని వాడుకో! దానికి బాగా మంట పెట్టి ఇంకా బాగా వాడుకో! కంపు బాబాయిలకి బాగా బుద్ది చెప్పు” అన్నాడు.అలా అంటూనే మరొక గది లోపలికి పడుకొనేందుకు వెళ్లిపోయాడు.

శరణ్య తన సామాన్ల లోంచి బట్టలు తీసింది. జాకెట్టు, లంగా, కుర్తా, పైజామా లాంటి దుస్తుల్ని ప్రక్కన పెట్టి, ‘రౌండు కాలరు, ఫుల్’ చేతుల టీ షర్టు తొడిగింది, దాని మీద జెన్’ ఫాంటు వేసింది. ఆ ఫాంటుకి పెద్ద వెడల్పైన బెల్టు కట్టింది. జుట్టు ముడివేసి, నది నెట్టి మీద క్లిప్పు పెట్టి, దాని మీద పంజాబీ సర్దార్జీల లాగ తలపాగా ధరించింది. చేతికున్న గాజులు, పట్ట్టీలు, కర్నా భరణాలు, నాసాభారణాలు తీసేసింది. మోకాళ్ల వరకు సాక్సు తొడుగుకొని, బూట్లు ధరించింది! ఆమె అలంకరణ చూసిన అదృశ్య రూపం లోని ‘మానసి’ ‘చెల్లీ! నువ్వు మగవేషంలో ఉన్న ఊర్వశి లాగ ఉన్నావు’ అంది!

“మానసీ! మగాళ్ళు మనలని బలహీనులుగా చేయడం కోసమే చీర, కుర్తా, జడ లాంటి అలంకారాలు మనకోసం రూపొందించారు! బలాత్కారం చేయాలనుకొనే మగాడి ముందు ఆడదాన్ని అబలని చేసేవి ఇవే!! స్త్రీకి నాలుగు అడుగుల దూరం నుండే అన్గుబాతులో లభించే చీర కొంగు, వెనుకనుండి పట్టుకొని చిమ్పెయ్యడానికి జాకెట్టు కుండే ‘లో-నేక్’ కటింగు’ ఆ పైన లాగి పరీసి వివస్త్రగా చేసేందుకు పనికొచ్చే లంగా బొండు, చేతులు- కాళ్లతో కొట్టి పారి పోకుండా అడ్డుపడే గాజులు, పట్టీలు, తదితర ఆభరణాలు సౌందర్య ప్రదర్శన పేరుతొ మనల్ని మోసం చేస్తూ, వాళ్ల కాముకత్వానికి, సరదాలకి మనల్ని ‘నలి పశువులని’ చేస్తున్నాయి! ఇప్పుడు నేను మగవేషం లోని ఊర్వశి లాగ ఉన్నానని కదా, చూస్తూ ఉండు, వాళ్ల పాలిట ’తాటకిని’ అవుతాను.”

“శరణ్యా! అయితే, ఈ సాంప్రదాయ అలంకరణలు మంచివి కావంటావా?”    

“స్త్రీ తనకి నచ్చిన ప్రియుని ముందు ధరించే దుస్తుఅనే బయట కూడా ఎందుకు ధరించాలి? మన పాతకాల సాంప్రదాయ స్త్రీ ఇంట్లో ఇల్లాలుగానే ఉండేది. అందువల్ల ఆమెకి చీరే సింగారమయింది ! ఉద్యోగం కోసం బయటికి వెళ్ళే వనిత తనకి రక్షణ ఇచ్చే దుస్తుల్ని ఎందుకు దరించ కూడదు?”

శరణ్య ఆ మాటలు అంటూ ఉండగానే బయట తాళం తెరుస్తున్న శబ్దమయినది. పురుష వేషం లోని శరణ్య అదృశ్య రూపం లోని మానసి ఇద్దరూ అలెర్టు అయ్యారు! శరణ్య నరేంద్ర ఆయుధమైన కొరకంచుకి మంట పెట్టి, దానిని కాలచ సాగింది! అది మండేటంత  లోనే తలుపులు బలంగా తెరచుకొన్నాయి!!

 “ఒసే! శరణ్యా! ఎక్కడున్నావే!” అంటూ లోపలికి ప్రవేశించాడు భూషణ్. అతనితో పాటు నలుగురు ముష్కరులు వారి వెనక కెమెరా పట్టుకొని హేలోజన్’ లాట్ల సరంజామాతో శ్యాం చొరబడ్డారు. కెమెరాని, లైట్లనీ చూడగానే వాళ్ళెం చేయదలచు కొన్నారో శరణ్యకి అర్థమయింది. మానసి వెంటనే ఆమె శరీరంలో ప్రవేశించింది.

“భూషణ్’ భాయ్! ఏదీ ఆ మిఠాయి పొట్లం?” అంటూ వచ్చిన దున్నపోతు శీను శరణ్యని చూసి, ఆశ్చర్య పోయాడు! “ఇదేమిటి భాయ్! చీర గట్రా కట్టుకోకుండా ఇలా ఉందేమిటి ?” అన్నాడు.

“నీకు చీరతో పనా, దాని పరువంతో  పనా భాయ్?” అన్నాడు భూషణ్’ తను కూడ ఆశ్చర్యపోతూనే!!

“అరే ! రేప్”లో సొగసంతా ఆ చీర లాగడం లోనే ఉంది భాయ్! పైగా ఫోటోలు తీయనున్టివి! ఆ ఫోటోలు ఈ డ్రెస్సులో ఏం బాగుంటాయి?”

“శీను భాయ్! తొందర దేనికి, ముందీ బట్టలు విప్పేసి, తర్వాత చీర కట్టించి, మరో రౌండు వేసుకొందాం!”

“బాగా చెప్పావు బడే భాయ్!” అంటూ గలగలా రాళ్ళు దొర్లించినట్లు నవ్వాడు దున్నపోతు శీను.

అలా అంటూనే శరణ్య మేఎదకి లంఘించాడు శీను. వాడిని దగ్గరగా  రానిచ్చి బూటు కాలితో రెండు తొడల మధ్య ఒక్క తాపు తన్నింది శరణ్య.

ఆమె తన జైలు జీవితంలో యోగాతో పాటు , మార్షల్’ ఆర్టు కూడా నేర్చుకొంది! ఆమె శరీరం లోని మానసి ఆ తాపులో తన బలాన్నంతా ప్రవేశపెట్టి, తనని చెరచిన  ఆ కీచకుడికి తగిన శిక్ష  వేసింది. ఆ తాపుకి క్రింద పడిన శీను తన రెండు కాళ్ళ మధ్య భాగాన్నీ, రెండు చేతులతోనూ అదిమి పట్టుకొంటూ పొలికేక పెట్టాడు!!

ఆ సంఘటనని రికార్డు చేసిన శ్యాంతో బాటు తక్కిన వాళ్లు కూడ అదిరిపడ్డారు!”ఎదో జరుగుతుందని అనుకొంటే ఇంకేదో జరిగింది!’ అనుకొంటూ.

మరాఠీ దాదా బాబూరావు గోరే ఇక ఉపేక్షించి లాభం లేదని భావించి, “ ఒరేయ్! ఇది ఆవు కాదురా, పొగరుమోతు గొడ్డు! ముందు దాని బూట్లు విప్పేయండి” అంటూ శరణ్య కాళ్లు పట్టుకొనేందుకు తన అనుచరుడు బీహారీ బద్మాష్’ నంకీ యాదవ్’తో పాటు క్రిందకి వంగాడు. వాళ్లకి సహాయం చేసేందుకు ఆమె వెనక నుంచి నడుముని పట్టుకొనేందుకు వెళ్లారు తమిళ టైగర్’ ఆర్ముగం, భూషన్లు!

“మానసీ! వీళ్లు నలుగురూ నా కాళ్ళనీ, నా నడుమునీ పట్టుకొని, నా బూట్లని లాగే ముందు మండుతున్న ‘కొరకంచులో ఇనుప మేకుని’ నా చేతికి అందేలాగా చెయ్యి!’ అని అనుకోండి. ఆమె శరీరం లోని మానసి ఆపిలుపుని విని నరేంద్ర ఆయుధమైన ‘కొరకంచులో ఇనుప మేకుని’ ఆమె చేతికందేలా గాలిలో లేపింది.

శరణ్య ఆ కొరకంచుని అందుకొని, భగ భగమని మండుతున్న దాన్నీ, మిల మిలమని మెరుస్తున్న దానిలోని మేకునీ తన కాళ్ల పైన దాడి చేసిన బాబూరావుద దాదా, బీహారీ బద్మాష్’ నంకీ యాదవ్’ మీదా, వెనక నుండి తన నడుము పట్టుకోవాలని వస్తున్నతమిళ టైగరు ఆర్ముగం, భూసంల మీద గాలిలో త్రిప్పుతూనే గురి పెట్టింది.

అంతే! ఆ’కొరకంచులో ఇనుప మేకు!”

శ్రీహరి చేతిలోని సుదర్శనాస్త్రం లాగ, చుట్టూ తిరుగుతూ ఆ ‘దుర్యోధన, దుశ్శాసన, జయత్రత, కీచకుల’ పీచామదచేందుకు రివ్వున తన మొనతో గ్రుచ్చి, గ్రుచ్చి వారి వారి శరీర భాగాలని గాయపరుస్తూ, వాళ్లు వేదనతో హాహాకారాలు చేస్తున్నా వదలకుండా తన మంటతో వాళ్ల బట్టలని మాడ్చి, మసి చేసి, తన పడునుతో వాళ్ల ప్రాణ తంత్రులని ప్రహరించ సాగింది.

వేడి వేడిగా దిగబడుతూ మంటతో పాటు సలుపునీ, గాయాన్నీ చేసి, రక్తాన్ని సలసలా మరిగిస్తూ, ‘యమ యాతన’ అంటే ఏమిటో తెలియ జేసింది.

సగం సగం కాలి, పేలికలై వ్రేలాడుతున్న బట్టలతో, ఊడిపోయిన పళ్ళతో, విరిగిన ఎముకలతో, కాలిన గాయాలతో అన్నిటి కన్నా ఎక్కువగా మంట గలిసిన ఆత్మాభిమానాలతో సాగిలబడ్డారు వాళ్ళు అయిదుగురూ!!

“భూషణం! ఇప్పుడు చెప్పు, ఈ ఇల్లు నీదా , మానసిదా?” అంటూ అడిగింది శరణ్య.

“మానసిదే! నాకు బుద్ది వచ్చింది” అంటూ ఏడ్చాడు భూషణం.

“నీ మిత్రులని ఇక్కడ నుంచి వెళ్లి పొమ్మని చెప్పు. మనం మాట్లాడుకోవలసినవి చాలా ఉన్నాయి”

“భూషణం  వాళ్లని వెళ్ళిపొమ్మని చెప్పాడు. శ్యాం కూడా వెళ్తూ ఉండగా, శరణ్య వానిని ఆపింది,” శ్యాం! నువ్విక్కడే ఉండు! నీ యజమాని మాటలని, చేతలని ఇంకా రికార్డు చేయాల్సినవి చాలా ఉన్నాయి!”

శ్యాం ఆగిపోయాడు. మిగిలిన వాళ్లు బ్రతుకు జీవుడా’ అనుకొంటూ బయట పడ్డారు.

“శరణ్యా! నీకేం కావాలి?’

“5 లక్షలు కేషు, బ్లాక్’ బెర్రీ ఫోను, డెల్’లాప్’టాప్, ఇంకా నీ కారు దాని డ్రైవరుతో పాటు కావాలి.”

“అన్ని గొంతెమ్మ కోరికలు కొరకు! సంపాదన మొత్తం దోచుకొంటే నాకేం మిగులుతుంది?”

“ ఆడపిల్లల సొమ్ము బాగానే తిన్నావు! హోటల్నిఅడ్డం పెట్టుకొని, రూము నెంబరు 413 బాత్’రూములో కెమెరా పెట్టి, స్నానం  చేసిన సుందరీ మణులని  నగ్నంగా ఫోటోలు తీసి లక్షలు గడించావు! ఆడిషన్ల పేరుతొ మానసి లాంటి ఎంతమందిని పొట్ట బెట్టుకోన్నావో ఆ పరమాత్ముడికే తెలుసు!! నేను అడిగినది ఇచ్చినంత మాత్రాన నీకు నిలువు దోపిడీ ఏమీ అవదు ! ఇస్తావా, లేదా?”

భూషణానికి ఆ షరతులు నచ్చలేదు. “నా ఇల్లుని దురాక్రమణ చేసావు. మరేమీ ఇవ్వలేను.”

“నువ్వు ఇవ్వక పొతే నీ కోసం ఏర్పాటు చేసిన మరో శిక్ష అమలు చేయాల్సి వస్తుంది. నీ దగ్గర ఉన్నదీ. లేనిదీ నాకు ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు!”

“మరో  శిక్షా?” గాభరాతో అడిగాడు భూషణ్.

 “అవును, నువ్వు ఆడవాళ్ల మానాభిమానాలు హరించడంలో గొప్పవాడివి కదూ? అందుకే ఈ రోజు ‘రేప్’ అంటే ఏమిటో నీకు తెలియ జేస్తాను.”

“ఏం చేస్తావ్?” అడిగాడు భూషణ్..

“ఆమె చెప్పిన శిక్ష గురించి వింటూనే వణికిపోతూ..” వద్దు, అంత పని చెయ్యకు! ఆ కొరకంచుని తలచుకొంటేనే భయంగా ఉంది! నన్ను వదిలెయ్యి, నువ్వు అడిగినట్లు ఇచ్చేస్తాను” అన్నాడు.

“నిన్ను వదిలేస్తే మరి కనబడకుండా పారిపోతావ్! ఇక్కడే కూర్చొని ఫోన్ల ద్వారా, మొబైల్’నీ, కంప్యూటర్’నీ, ఇంటర్’నెట్’ కనెక్షన్’తో  సహా ఆర్డరు ఇచ్చి ఏర్పాటు చెయ్యి!నీ కారునీ, నీ డ్రైవరునీ పిలిపించి చెక్’ బుక్కు  తెప్పించు. బ్యాంకు మేనేజర్ని కంటాక్ట్’ చేసి, దానిని అర్జెంటుగా కేష్’ చేయించు!. అంత వరకు ఈ కొరకంచు నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, అర్థమయిందా?” అడిగింది శరణ్య.

విభూతి భూషణ్’ వెంటనే చక చకా ఫోన్లు చేసాడు. అందరి కంటే ముందు అతని డ్రైవరు వచ్చాడు. చెక్కు మీద సంతకం చేసి, తిరిగి ఆ డ్రైవరునే  బెమ్కుకి పంపాడు. ఆ తరువాత ఒక కొరియర్’ వచ్చి, బ్లాకు’ బెర్రీ’ మొబైల్’, కంప్యూటర్’ తెచ్చి ఇంటర్’ నెట్’ కనెక్షన్ జోడించి మరీ వెళ్ళాడు! ఆ వెంటనే బేంకు మేనేజరు స్వయంగా 5 లక్షల కేష్’ ఒక సూటుకేసులో తెచ్చి వెళ్ళాడు! అప్పటికి గాని ఆ కొరకంచు భూషణ్’ని వదల లేదు!

 ఇంతలో మరొక కొరియర్’ వచ్చి బెల్లు కొట్టాడు!

(ఇంకా ఉంది)

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.   ...

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ...

శ్రీ రంగ నీతులు. (మరచిపోయిన జానపద కళ)

 శ్రీ రంగ నీతులు. (శ్యామలా ఆర్ట్స్’ వారి ప్రస్తుతి!  “శ్రీరంగ నీతులు ‘ అనే ‘జానపద కళా ప్రదర్శన’  అని వ్రాసి ఉంటుంది) (వాద్య బృందం, స్టేజి పైనే కూర్చొని ఉంటారు. రాజా-రాం అనే యువకుడు చెంచు యువకుని వేషంలో కనిపిస్తాడు. వాద్య బృందం లోని  వారి సహకారంతో రాజా రాం పాట అందుకొంటాడు) రాజా రాం : ఒహోయ్ ! చెంచులూ ! చెంచు పెద్ద చెప్పే శ్రీ రంగ నీతులు వినడానికి ఎంత మంది వచ్చారో చూసార్రా? అందరూ : చూసాము ,చూసాము నాయకా ! [[నందానా]] రాజా రాం : అదేమర్రా? మర్యాదలు మర్సిపోయారా? అందరూ : ఏం సేయమంటావు నాయకా! [[నందానా]] రాజా రాం : పదం అందు కొండి చెంచులూ! అందరూ : ----[[అవునవును ]] రాజా రాం:  కార్య నిర్వాహక సభ్యులకి నెనర్లు! అందరూ: ----[[అవునవును, నెనర్లు ]] రాజారాం :  పెద్దవారికి ఐదు పది సేతలు! (రెండు చేతులూ జోడిస్తాడు) అందరూ : ----[[అవునవును, చేతులు జోడిస్తారు ]] రాజారాం : సమ వయస్కు లయిన స్త్రీ పురుషులందరికీ వెన్నెల! అందరూ : ---[[అవునవును, వెన్నెల--]] రాజారాం :   ఔత్సహకులయిన యువతీ యువకులకి డింగిడీలు! అందరూ : ----[[అవునవును,...