ఆదిరాజు భాస్కర మూర్తి ,మంచం పట్టి, శల్యావశిష్టుడయ్యాడు.అతనికి శ్రీనివాసున్ని చూడాలని అనిపించింది.కాని కావాలని దూరం చేసుకొన్నఆ కుర్రవానిని,ఎలా పిలిచి రప్పించ గలడు. చిత్రమేమో గాని అతని మందులు అతనికే పని చెయ్యడం లేదు.మందులు కూడా గ్రహ గతుల ననుసరించే పని చేస్తాయమో ! అతని మనసులో ఆలోచనలని చదివాడేమో అన్నట్లు, శ్రీనివాసుడు వచ్చి, మంచం పట్టిన గురువు గారిని చూసి, కృంగి పోయాడు.ఇంత జరిగినా తనని పిలువ నంపక పోవడాన్ని తప్పు పట్టాడు. “ శ్రీనివాసా ! కాల గతిని అనుసరించి జరిగే మార్పులకి, వ్యక్తులని దోషులుగా చేయకు.నువ్వు ప్రయోజకుడువి అయ్యావని తెలిసి, అలా చెయ్యాలనే నా తపనని, ప్రక్కకు నెట్టి, నా స్వార్థం కోసం నిన్ను వెనకకి పిలిపిస్తానని ఎలా అనుకొన్నావు ?” “ గురువు గారూ ! మీ మందులు మీకు పని చెయ్యక పోవడ మేమిటి ?” రోదించాడు అతను. “ మందులు వాటి పని అవి చేసుకొని పోతున్నాయి శ్రీనివాసా ! శరీరమే వాటికి సహకరింఛడం లేదు. కాయానికి జరావస్థ సోకింది మరి ! తరువాతి గమ్యాన్ని ధైర్యంతో ఎదుర్కోవడమే ఇప్పుడు చేయాల్సిన పని !” శ్రీనివాసుడు వెక్కి వెక్కి ఏడ్చాడు,గురువు అతనిని అడ్దుకోలేదు.దుః