కుమారారామ క్షేత్రంలో శ్రీ భీమేశ్వర స్వామి వారి అభిషేకం చేసిన తరువాత, చక్రపాణి గారి ఇంటికి చేరారు వారందరూ. చక్రపాణి రైల్వేలో ‘లోకో పైలట్’గా పని చేస్తున్నాడు. అతను ఉండేది రెండు గదులు రైల్వే క్వార్టర్ ! ఒక గదిని కొత్త అల్లుడు గారికి కేటాయంచి, తక్కిన వారందరూ మరో గదిలో గుంపుగా విశ్రమించారు. శ్రీలత ఆ ఏర్పాటుకి వ్యతిరేకించినా వాళ్లెవరూ ఒప్పుకోలేదు ! ఫలితం లేక మరచెంబుతో నీళ్లు తీసుకొని, గదిలోకి అడుగు పెట్టింది ఆమె ! మెత్తగా కౌగిలి లోనికి ఇమిడిన ఆమెని, పొదివి పట్టుకొంటూ, అడిగాడు సూర్యచరణ్. “ సిరీ ! మీ చక్రి బాబాయి ఇంట్లో అన్నీ ‘ ఫెంగ్ షూయి’ సామాన్లు, ఎక్కడ పెడితే అక్కడ కన్పిస్తున్నాయ్ ! ఎందుకలా ?” అని అడిగాడు. “ ఫెంగ్ షూయి సామాన్లా !?” “ అవును, ఇదిగీ చూడు,” అంటూ ఆ గదిలో ఉన్న పరికరాలు చూపించాడు. ‘నోట్లో నాణాన్ని పట్టుకొన్న మూడు కాళ్ల కప్ప, ఒకదాని మీద ఒకటి ఎక్కి కూర్చొన్న తాబేలు, లాఫింగ బుధ్ధా,’ ఇంకా కొన్ని పిరమిడ్లు కనిపించేయి. “ ఓహో ! అవా ! ఈ ఇంటికి వాస్తు దోషం ఉందని లలిత పిన్నికి అనుమానం ! అందుకే అవన్నీ ప్రతీ గదిలోనూ అమర్చింది. “ వాస్తు దోషాలా ! అంటే ఎలాంటి సమస్