వాసిష్ట చెప్పిన ఆంద్ర మహావిష్ణువు చారిత్రిక గాధ --సత్యప్రభ 24 :బాపు వేసిన బొమ్మలతో సహా : (అత్యద్భుతమైన ముగింపుతో)
రాయబారం చర్చ ప్రసన్న వాతావరణంలో జరిగింది. “కళింగులపై మాకు ద్వేషం లేదు! రాజ్యాక్రమణ చేయాలనే ఉద్దేశం కూడ లేదు! కుమార భోగనాథాదులు రాజ ద్రోహులు! మా దేశానికి ప్రబల శతృవు నిశుంభునితో చేతులు కలిపి కుండిన వంశాన్ని చిన్నాభిన్నం చేయా లని తలచాడు కుమార భోగనాథుడు. అటువంటి రాజద్రోహులకు మీ ప్రభుత్వం ఆశ్రయం ఇచ్చి, ఆదరించి, సైనిక చాలనాదికారం కూడా ఇచ్చింది! కాబట్టి మా ప్రభుత్వం ఉపేక్ష వహించడం ప్రమాదకరమని యుద్ధం ప్రకటించింది! మీరు రాజద్రోహులను ససైన్యంగా మా వశం కావించితే, మన రాష్ట్రాలకు అనుకూలమైన సంధి విధానాన్ని చర్చించుకో వచ్చు” అని చెప్పాడు చిత్రకూట రాష్ట్ర సర్వ సేనాధిపతి, ఆంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన ప్రమథనాథుడు! “కుమార భోగనాథునికి మేము ఆశ్రయం ఇవ్వమని మా ప్రభుత్వం తరఫున నేను చెప్పగలను! వారిని మీరు పట్టుకోవడానికి ఎట్టి చర్యలనైనా చేయవచ్చు! మా ప్రభుత్వం ఒకమారు ఆశ్రయం ఇచ్చిన దోషం వలన వారిని స్వయంగా పట్టి ఇవ్వడానికి సందేహించ వచ్చు. ప్రస్తుతం మనం సంధి విషయాలను ప్రస్తావించుకొని ఇరు పక్షాల సైన్యాలనూ ఉప సంహరించు కొందాము” అన్నాడు వినయ చంద్రుడు. ప్రమథనాథుడు కొన్ని క్షణాలు గంభీర మౌనముద్ర వహించ