మంటల్లో మైకా గని 2 రెడ్డి --- చూసారా కామ్రేడ్ ! ఈ తెల్లటోపీ దళారీ మధ్యవర్తిత్వం, శిక్ష పడ్డ కన్నయ్య, కిమ్మనకుండా దానిని భరించి పైపెచ్చు కడుపు కూడా మాడ్చుకొని క్షమాభిక్ష అడగాలట , ‘ భవతి బిక్షాం దేహి’ అని ! అలా చేస్తే ఈ తెల్లటోపీ మధ్యన చేరి, మాట్లాడి బిక్ష వేయిస్తాడట ! నిజంగా కార్మిక సంక్షేమమే ఈయన మనస్సులో ఉంటే , కార్మికునికి జరిగిన అవమానానికి ఈయన గుండె నిజంగా మండి ఉంటే, ఇలాంటి మాటలు అనగలిగే వాడా, కామ్రేడ్ ? వర్గ పోరాటంలో మనం గెలవాలంటే మొదటి సమిథలుగా ఈ దళార్లని గుర్తించి, వారికి సమాధులు కట్టి, ఆ గోరీల మీదుగా నడచి, వెళ్లాలి. కామ్రేడ్స్ ! ఈ అవమానానికి ప్రతీకారంగా , మనం సమ్మె చేయక తప్పదు . ఆలోచించి మీ ఉద్దేశమేమిటో ఇప్పుడే తేల్చి చెప్పండి. ఇన్కిలాబ్ జిందాబాద్ ! ---- ( రెడ్డి మాటలు పూర్తికగానే, “ హియర్, హియర్ ” అనే కేకలు తెరలో ) పంతులు --- సోదరులారా ! కార్మిక సంక్షేమం కేవలం మాటలలో మాత్రం చూపించే, ఈ నల్లటోపీ మాటలకి మురిసి పోకండి. అవి మాటలు కావు, తేనె పూసిన కత్తులు. వాటి ప్రలోభంలో పడితే గాయపడకుండా, బయటికి రాలేరు. కన్నయ్య సమస