Skip to main content

Posts

Showing posts from April, 2011

కలిమి

అల్లిబిల్లిగా అల్లుకొన్న గడ్డాన్ని, చేతితో రుద్దుకొంటూ, ఇంటి పైకప్పు కేసి చూసి భారంగా నిట్టూర్చాడు ‘వరద రాజులు. ’ వరద రాజులు కలిగిన వాడు కాడు. ‘ కలిమి’,‘సిరి ’లాంటి పదాల అర్థమూ, ప్రయోజనమూ,తెలుసుకోవలసిన అవసరం అతనికి ఏనాడూ గతంలో కలగ లేదు.. ‘గతం అంటే ఒక చిరుపేద కుటుంబంలో ఒక్కగా నొక్క కొడుకై, తండ్రైని మింగి పుట్టినప్పటి నుండి, వారాల మీద అనవసరమూ, నిరర్థకమూ అయిన, ‘ స్కూలు ఫైనలు’ చదివి, రైల్వేలో, ‘ గాంగ్ మేన్’ గా టెంపరిరీ స్థాయి ఉద్యోగంలో కుదురుకొని , మూడేళ్లుగా కాపురం చేస్తున్న, ఇప్పటి వరకూ’ అని చెప్పుకోవాలి ! ఈ మధ్య కాలంలో అతను వాటికోసం పాటుపడి, అరిగించుకొన్న దెబ్బల ఫలితంగా, అర్థాలూ, అనర్థాలూ ఆలోచించడం కూడా మానేసాడనే చెప్పాలి. పూర్వ జన్మలో చేసుకొన్న పాప పుణ్యాల ఫలితాలని బట్టే, ‘ కలిమి లేములు’ కలుగుతాయన్న మెట్ట వేదాంతమే, అతని ఆలోచనలని పూర్తిగా ఆక్రమించుకొని నరనరాన జీర్ణించుకుపోయిందంటే , అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదు ! తనకీ తన భార్యకీ రెండు పూటలా సరిపోయేలా బియ్యమూ, కూర వగైరా సాదర ఖర్చుకీ సరిపోయే ఇరవై రూపాయలు కలిగి ఉండటమే అదృష్టం అనే పదానికి అతనిచ్చే నిర్వచనం. సరిగ్గా మూడు రోజుల ముంద

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ

స్మిత నయన 3

అది క్రీ.శ. 1008 వ సంవత్సరం లోని డిసెంబరు 31 వ తారీఖు. హిందూ దేశ చరిత్రలో ఒక నూతనాధ్యాయానికి ఆ రోజే నాంది జరిగింది. మహమ్మద్ గజనీ ‘ జీహాద్’ పేరిట భారత దేశంపై సాగించిన దండయాత్రలలో అదే మొదటిది. ఆ దండయాత్రని ఎదుర్కోవడానికి ఉత్తర హిందుస్థానంలో ప్రజలంతా ఆనంద పాలుని నాయకత్వాన్ని అంగీకరించిన దినం కూడ అదే ! స్త్రీలు సైతం తమ తమ ఆభరణాలని మాతృదేశ రక్షణకై దానం చేసిన పవిత్ర దినం అది ! ఆనంద పాలుడు తన భద్రగజం ‘కళ్యాణి’ పైన ఎక్కి, మహోత్సాహంతో గట్లు తెగిన వెల్లువలా ‘ మహమ్మద్ గజనీ’ సేనల పైకి విరుచుకు పడ్డాడు. దూరం నుండి ఆ దృశ్యాన్ని చూసిన మహామంత్రి, వృధ్ధ రాజగురువు ‘దాదాజీ’ లిద్దరూ ఏమి కీడు, మూడనున్నదో అని భయాందోళనలకు లోనయ్యారు. ఐరావతం పైన దేవేంద్రుడిలా తురుష్క సేనా వాహినిని తాకిన ఆనంద పాలుని చూసి, మహమ్మద్ గజనీ రెండు క్షణాల పాటు భయకంపితుడయ్యాడు. తురుష్క సేనాని ‘ కతలూ ఖాన్’ , మహమ్మద్ గజనీకి ధైర్యం చెప్పి, తన అరేబియన్ గుర్రంతో ఆనం పాలుని దిశగా, పరుగు తీసాడు. కళ్యాణి దృష్టి శర వేగంతో వస్తున్న కతలూ ఖాన్ పైన పడింది.దాని కండ్లలో నిప్పులు కురిసాయి ! ‘ హృదయ భేధ్యంగా గట్టిగా ఘీంకరించి , అది కతలూ ఖాన్

స్మిత నయన 2

వెలుగు నీడల అన్యోన్యతకి ప్రత్యక్ష తార్కాణంగా, నలుపు తెలుపుల కలయికతో వింతగా మెరిసి పోతూ, ఎగిరెగిరి పడుతున్న ‘ సింధు’ నదీ తరంగ హస్తాలతో చేతులు కలపాలనే ఆతృతతో , నింగి నుండి నేలకి దిగజారి పోతోంది , విదియ చంద్రుని వెన్నెల జాలు. “ కళ్యాణీ !” సింధు నది అలలలోనూ , దానికి ఆనుకొని విస్తారంగా వ్యాపించిన గంభీరారణ్య మధ్యం లోనూ, ‘కళ్యాణి ’ గుండెల్లోనూ ప్రతిధ్వనించింది ఆ పిలుపు ! ‘ మహారాజు ఆనంద పాలుని సైనిక స్కందా వారం లోని, ‘ గజ శాలలో’ ,‘ ఛరాల్, ఛరాళ్’ మంటూ గొలుసుల శబ్దం దానికి సమాధానం ఇచ్చింది ! తనకై ప్రత్యేకింప బడ్డ డేరాలో, ఆలోచనల తాకిడికి నిద్ర పట్టక దొర్లుతున్న, ఆనంద పాలుడు దిగ్గున లేచి పర్యంకంపై కూర్చొన్నాడు. “ కళ్యాణీ !” తిరిగి నభో వీధిలో సుళ్లు తిరిగిందా ధ్వని ! ఆనంద పాలుడు మరి సందేహించ లేదు. ఇరువది సంవత్సరాలుగా తన తండ్రి కాలం నుండి షాహి వంశపు రాజుల, చతురంగ బలాలలో అతి ముఖ్యమయిన గజశిక్షణ శాఖకి అధ్యక్షుడిగా, పని చేస్తున్న ‘ భద్రకుని’ పిలుపు అది ! “ భద్రకునికి ఏమయింది ? ఇంత రాత్రి పూట నిస్సహాయంగా కళ్యాణిని ఎందుకు పిలుస్తున్నాడు ? “మహారాజా ! ” అన్న పిలుపు విని ఆతృతతో గుడారం వెలుపలికి వ

స్మిత నయన.1

నిర్విరామంగా రాజ్యం చేస్తున్న నిశ్శబ్దం, చిక్కగా అలముకొన్న చీకతితో కలసి మంతనాలు సలుపుతోంది. దూరాన పల్చగా పరచుకొన్న వెన్నెల జాలులో తళ తళ. మెరిసిపొతున్న ఇసక నేలను దాటి మంచి ముత్యాల లాంటి అలల వరసలతో కాంతులు విరజిమ్ముతూ, గలగలమని నవ్వుకొంటూ ప్రవహిస్తున్న ,‘ చీనాబ్’ నదిపై దాడి చేయాలని, దబదబ మని అదుగుల చప్పుడు , దాని అనుసరిస్తున్న గుర్రాల సకిలింపు. తమ ఏకాంత సమావేశానికి అంతరాయం కలిగించేది ఎవరా, అనే సందేహంతో , ‘చీకటి’ కళ్లు గ్రుచ్చుకొని చూసింది. ‘ కత్తి వాటుకైనా రెప్ప విదల్చని కండ్లు, యుధ్ధ రంగంలో ప్రాణాలని సైతం లక్ష్యం చేయని వీరుని మనో ధైర్యంలా సమున్నత మైన నాసిక, వయస్సునీ అనుభవాన్నీ చెప్పక చెప్పుతూ, ముఖం లోని బ్రహ్మ వర్ఛస్సుని కప్పి వేయాలనే వ్యర్థ ప్రయత్నంతో విస్త్రుతంగా అల్లుకొన్న పండు గడ్డం , సమున్నత దీర్ఘ కాయమూ’ గల వృధ్ధుడొకడు , ఆకర్ణాంతం లాగి విడిచి పెట్టిన బాణం లాంటి వేగంతో, మంచి అశ్వం మీద, దూసుకొంటూ పోతున్నాడు. అతని వెన్నంటి బిగించిన ఉక్కుతీగల్లాంటి, నలుగురు యోధులు చేత కాగడాలతో రావడం చూసిన,‘ చీకటి, నిశ్శబ్దమూ’ రెండూ కూడ బలుకుకొని, భయంతో పారి పోయాయి. “ ఆగండి ! నా పిలుపు నందు కొనేవరకు

.నిత్య జీవితంలో ఔచిత్య స్థాఫన---ఒక మానసిక బలహీనత.

ఔచిత్య స్థాఫనని (జస్టిఫికేషన్) మానసిక బలహీనత అని ఉదహరించడం ఏమైనా బాగుందా? ఫిచ్చి ఫట్టిందా! అని భ్రమించకండి, ఈ ఉదాహరణ ని గమనించండి. ఒక వనమంత్రి. రాజ్యంలోని ఒకానొక సురక్షిత వన ప్రదేశానికి నిరీక్షణకి (షికారుకి) వెళ్లాడు. ఆ క్షేత్రీయ వనాధికారి అతనికి అన్ని సదుఫాయాలు చేసాడు. గెస్టు హౌస్ లోని గదులన్నీ అందంగా అలంకరింఫ బడ్డాయి. రాత్రి వింధుకి ఎన్నో ‘కోళ్లు’ బలికాబడ్డాయి. మంత్రిగారికి అతనితో వచ్చిన బలగానికి విదేశీ మద్యం సరఫరా చేయబడింది. మర్నాడు తెల్లవారి స్వల్ఫాహారంతో ఫాటు ‘ టీ’ ఇవ్వడం జరిగింది. మంత్రిగారు బయలు దేరే ముందు వనాధికారిని బిల్ అడిగాడు. వనాధికారి స్తబ్థుడయ్యాడు. “అదేమిటి సార్! అలా అడుగుతారు? బిల్ మీరు ఫే చేయడం ఏమిటి. సార్! మీ సేవలో ఏదైనా ఫొరఫాటు జరిగితే క్షమంచండి సార్!......” అంటూ నీళ్లు నమిలాడు. ఆ నసుగుడు చూసి మంత్రి గారికి కోఫం వచ్చింది.`` ఏం ? వేషాలేస్తున్నావా? రాత్రి విందుకి మందుకి బిల్ తీసుకోకుండా నన్ను కొనేద్దామనా ! నీ ఉద్దేశం? '' అంటూ కేకలేసాడు. వనాధికారి చిక్కులో ఫడ్డాడు

ఆవు--దూడ

అది 1914వ సంవత్సరం. కామేశం రెండో పుట్టిన రోజు చేసుకోకుండానే తల్లిని కోల్పోయాడు. “ వీడి కింక తల్లి లేని లోటు ఎలా తీరుతుందో ఏమో ! “ అని వాపోయిన, అతని విధవ మేనత్త కాసులమ్మ, ఆరు నెలలు దాటకుండానే తండ్రి గోపాలానికి మరో పెళ్లి చేసింది. ప్రాయం రాకుండానే ఆడ పిల్లల పెళ్లిల్లు చేసే ఆచారం ఆ రోజులలో ఉండ బట్టి, ఇంకా పన్నెండు వసంతాలైనా నిండని, ‘ అనసుయ’ కామేశానికి తల్లి స్థానంలో వచ్చి చేరింది. “ పిల్ల మంచి ఏపరి ! మరో సంవత్సరానికి ఎదిగి పోయి సంసారానికి వచ్చేస్తుంది!” అని ఆశించింది కాసులమ్మ. అయితే మనిషి ఒకటి తలస్తే, తానొకటి తలచే దేవుడు, అంతా తారుమారు చేసేసాడు ! అత్తారింటికి చేరి ఏడేళ్లు దాటినా, అనసూయ వ్యక్తురాలు కాకుండా అందరినీ నిరాశ పాలు చేసింది. అయినా కామేశానికి మాత్రం స్నేహితురాలై పోయింది, ఇద్దరూ కలసి, గచ్చకాయలు, గుజ్జనగూళ్లు ఆడుకొనే వారు. కామేశం తండ్రి గోపాలం కూడా పెద్దవాళ్లెవరూ చూడకుండా, వాళ్ల ఆటల్లో పాల్గొనేవాడు. కాని అతను పాల్గొంటే ఆట సమంగా జరిగేది కాదు. నిజానికి గోపాలం అనసూయని తాకడానికి, ఆమ