“వెంటనే ప్రవేశపెట్టు.” అన్నాడు మహారాజు. వీరభద్రుడు ప్రమథనాథ బాబుని పడక గది లోపలి తీసుకొని వచ్చి అక్కడ వదలి వెళ్ళిపోయాడు. ప్రమథనాథుడు రాజుకి నమస్కరించి ఆసనం పైన కూర్చొన్నాడు. ఆ మేచక మూర్తిని చూసి మహారాజు అంత ఆందోళన లోనూ మందహాసం చేసి ఇలా అన్నాడు, “ప్రమథనాథా! ఏమిటి విశేషం?” అని. “మహాప్రభో! నేను రాష్ట్రీయ ఘనేంద్ర బాబుతో కలసి మహామంత్రి సదనానికి వెళ్లాను.నేను వచ్చిన పని గురించి మహామంత్రికి విన్నవించాను. వారు దీర్ఘంగా ఆలోచించి శ్రీవారిని వెంటనే కలుసుకో వలసిందిగా నాకు ఆజ్ఞ దయచేశారు. కాబట్టి ఇక్కడకి వచ్చాను. శ్రీవారికి నిద్రా భంగం చేయవలసి వచ్చింది.” “ఈ రోజు సాయంకాలం మహామంత్రి నాతో నీ విన్నపాన్ని గురించి వివరంగా ప్రస్తావించాడు. అది మొదలుకొని నాకు నిద్ర పట్టే అవకాశం తప్పి పోయింది. ఇక నాకు నిద్ర పట్టే రోజులు కాలగర్భంలో సుదీర్ఘమై దాగి ఉన్నాయనే చెప్ప వచ్చు. నీ రాజు ముందర ఎట్టి సంకోచం లేకుండా అన్ని విషయాలూ చెప్పవచ్చు. నేను సావధానంగానే ఉన్నాను.” “మహాప్రభో! నేను శ్రీవారిని ఒక ప్రశ్న వేయవలసి ఉంది.” “ప్రమథనాథా ! సందేహించ వద్దు. ధారాళంగా ప్రశ్నించ వచ్చు.” “శ్రీవారు మంజులా దేవి