హారర్' నవల: నరేంద్ర తన ప్రక్కనే పెట్టుకొన్న ఇనుప మేకు గల కొరకంచుని తీసాడు. దానిని ముమ్మారు త్రిప్పాడు. మంచం క్రింద నుండి పొడుచుకొని వచ్చిన ఆ చేతులు రెండూ ఆగిపోయాయి! ఆ వెంటనే సన్నని ఏడుపు వినిపించింది. చేతులు వెనక్కి మరలి మంచం ప్రక్క యథాప్రకారంగా మారిపోయాయి!! నరేంద్ర తన ఆయుధాన్ని మళ్ళీ త్రిప్పాడు. “వద్దు, వద్దు, నన్ను హింసించ వద్దు!..” అంటూ సన్నని స్వరం గింజుకొంది. “చెప్పు నీ పేరేమిటి? ఎందుకిలా చేస్తున్నావు?” అని అడిగింది శరణ్య. “నేనే!” అన్న మాటలు వినబడ్డాయి! నేనే, అంటే మాకేలా తెలుస్తుందే అజ్ఞాత ప్రేతమా! నరేంద్రా! నీ ఆయుధాన్ని ప్రయోగించు, ఇది మాట్లాడేలా లేదు!” అని అడిగింది శరణ్య.భయంకరమైన గోళ్ళు గల చేతులు రెండూ, తన గొంతుక పిసికేయ్యకుండా నరేంద్ర కొరకంచు ధాటికి లొంగిపోయి ముడుచుకొని పోవడంతో ఆమెకి ధైర్యం వచ్చింది. “నా పేరు ‘మానసి! నీలాగే సినిమా నటిని అవుదామని ఆడిషన్’ కోసం పథిక్’ గెస్టు హౌసుకి వచ్చాను.” “అంటే ఆ హోటల్లో ఎప్పుడూ ఆడిషన్లు అవుతూ ఉంటాయా?”అడిగింది శరణ్య. “అబద్ధం! అలా బోర్డు పెట్టారు అంతే! అదంతా భూషణ్’ కుట్ర.” “అర్థమయింది, నువ్వు భూషణ్’ మాయ