బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—10 ( దృశ్యము 47 ) ( వేంకటాచలం దిగువ కపిల తీర్థము ) ( మాధవుడు ఆ తీర్థ స్నానం చేసి, బయటికి వచ్చి, కొండకు నమస్కరిస్తాడు) మాధవ --- ఓ వేంకటాచలమా ! దర్శన మాత్రమున నా పాపములు దహించిన నీ వెంతటి మహిమాన్వితమగు గిరి రాజమవో కదా !! ( పద్యము ) సీ-- శృంగార రాయుని చెలువు మీరిన కొండ / ఫణిరాజ పేరిట పశిడి కొండ పుష్ప జాజుల, విష్ణు పూజింపగల కొండ / కల్ప వృక్షము లెల్ల గలుగు కొండ చిలుకలు, కోవెలలును చేరి యాడెడి కొండ / మృగజాతి కండ్లను మెలగు కొండ ఘోర దురితము లణచు, కోనేర్లు గల కొండ/ ఘనమైన మోక్షంబు గలుగు కొండ అమర వరులకు నాధారమైన కొండ / ఆళ్వారులకు ప్రత్యక్షమైన కొండ అలరు జూచిన బ్రహ్మాండమైన కొండ / యేను పొడగంటి శ్రీ వేంకటేశు కొండ. ( అని ఆ కొండను పొగిడి, ఆ తీర్థం ఎగువన ఒక గుహను చూస్తాడు. ఆ గుహలోకి వెళ్తాడు ) ( ఆ గుహలో కపిల మహర్షి కూర్చొని ఉంటాడు. మాధవుడు అతనిని చూసి, నమస్కారం చేస్తాడు. ముని కూడ కళ్లు తెరచి మాధవున్ని చూస్తాడు ) కపిల ---