నీల గ్రహ నిదానము 5 (ద్వితీయాంకము) (ప్రథమ దృశ్యము ) (దశరథ మహారాజు శయన మందిరం ) ( తెర తీయగానే సన్నని వెలుగులో దశరథుడు పాన్పు లేదా తూగుటుయ్యాలపై పడుకొని ఉన్నట్లు చూపించి, అతడు కాస్త ఒత్తిగిల్లగానే లైట్లు ఆఫ్ చేయాలి ) ( తెర వెనుక లైట్లు ఆన్ అవుతాయి ) ( దుస్వప్నాలు ఒక దాని వెనుక ఒకటిగా షేడో రూపంలో చూపించాలి ) 1వ నీడ ---- ఒక మనిషిని కోతి తరుముతున్నట్లు ------ 2వ నీడ ---- ఒక స్త్రీ జుత్తు విరబూసుకొని, రోదన చేస్తూ తిరుగుతున్నట్లు---- 3వ నీడ ---- ఒక మనిషి, ఎనుబోతును ఎక్కి దక్షిణ దిశగా వెళ్తున్నట్లు ----- 4వ నీడ ---- ఒక మనిషి చెరసాలలో బందీ అయినట్లు ---- (వరుసగా ఇన్ని దుస్వప్నాలు కనిపించిన తరువాత దశరథుడు పాన్పుపై లేచి కూర్చొంటాడు,) ( రంగ స్థలం పైన లైట్లు వెలుగుతాయి.) (దశరథుడు తెప్పరిల్లి పాన్పు దిగుతాడు ) దశరథుడు ----- ( జనాంతికముగా ) ఏమిది ! ఇంద్రజాలము వలె కన్పట్టుచున్నది !! చతుర్దిశలయందు, `సరయు, నర్మద , గంగ , సింధు ' నదీ జల పరీత భూమండలమును, ఏ