అవి కాకతీయ సామ్రాజ్యం అస్తమించిన రోజులు. క్రీ :శ: 1325 నుండి 1335ల మధ్య కాలం! దక్షిణాపథం(దక్ లన్), దక్షిణ దేశం (తమిళ), డిల్లీ సుల్తాన్ సామ్రాజ్యంలో భాగాలుగా ఉండేవి. వీటిని ‘దేవగిరి, తిలింగ్(తెలంగాణా), కంపిలి, ద్వార సముద్రం, మాబర్ (మధుర) అనే అయిదు రాష్ట్రాలుగా విభజించి పరిపాలించారని చరిత్ర కారులు చెప్తారు. ఆ రోజులలో అరాజక పరిస్థితి ద్రవిడ దేశంలో ఏర్పడింది! ధనవంతులు ధన నిమిత్తం పిడింపబడే వారు. ప్రజల ధన, మాన, ప్రాణాలకి రక్షణ ఉండేది కాదు. సుల్తాను ఎంతో దూరంలో ఉండడం వల్ల అతని ప్రతిని ధులు స్వార్థంతో తమ తమ బొక్కసాలు నింపుకోవడం కోసం ఎన్నెన్నో దుష్క్రుత్యాలు చేసేవారు! ఇలా అరాజక స్థితికి లోనైన దక్షిణ భరత దేశానికి విముక్తి కలిగించడానికి,’కాకతి ప్రతాప రుద్రుని సేనానులైన తెలుగు నాయకులు ఆంధ్ర దేశం లోను, కర్ణాటకి పాలకుడైన, 3వ బళ్ళాలుడు విముక్తి ఉద్యమాలని నడిపారు. ఆంద్ర దేశం లోని ముక్తి సేనకి ప్రోలయ నాయకుడు నడుం బిగించాడు. అతనికికొంత మంది కమ్మ నాయకులు, రెడ్డి నాయకులు బాసటగా నిలిచారు. వారిలో మన కథానాయకుడు ధనంజయుడు ఒకడు. ధనంజయ నాయకుడు శిల్పము, నాట్యము, చిత్ర లేఖనము లాంటి లలిత కళలలో