బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 21 ( దృశ్యము ౯౧ ) ( వేంకటాచలం పైన ఒక రావి చెట్టు ) ( శ్రీనివాసుడు, బ్రహ్మ, శివుడు ఉంటారు ) బ్రహ్మ ---- తండ్రీ ! తల్లి లక్ష్మీ దేవి సూర్యనారాయణునితో పాటు వచ్చి, విడిది చేరినది. రేపు ప్రాతః కాలమున ( శ్రీనివాసుడు బదులివ్వడు ! దిగులుగా ఉంటాడు ) శివుడు -- ప్రభూ ! శ్రీనివాసా !. లక్ష్మి వచ్చిన వార్త తెలిసినను, మీ ముఖము కళా విహీనమై యున్నది, కారణ మేమి ? శ్రీనివాస --- పరమేశ్వరా ! లక్ష్మి ఈ కార్యమునకు, కేవలము సాక్షి రూపమున వచ్చినదే గాని, తన పూర్వ వైభవముతో రాలేదు ! ఆహ్వానితులైన దేవతలు, భూలోకమును చేరుట వలన, అన్నగత ప్రాణులయిరి. నేను రిక్తుడను ! నా ధనమంతయు పోయినది. నే నెట్లు వారికి భోజనము పెట్టగలను ? శివుడు --- శ్రీనివాసా ! పెళ్లి చేయుటకు , ఇల్లు కట్టుటకు ప్రారంభించిన వాడు, అంతము వరకు తన ప్రయత్నము మానుకోకూడదు ! శుభ కార్యములలో, సమస్త సంభారములు సమకూర్చుకోవలసినదే గాని, విడనాడ కూడదు ! దనము లేనిచో ఋణము చేసి అయినను కార్యము నడిపింప వలయును ! శ్రీనివాస -- లెస్స