రత్న గర్భ యీ వసుంధర 2 ”పడకా---” ” అవును. అది, ఇంట్లో మంచం మీద ఇలా మర్రి చెట్టు కొమ్మల్లో కాదు.” అతను తన ఉయ్యాల కేసి చూసాడు..” ఆ ఉయ్యాల్లో నా లేప్ టాప్ బేగు, బట్టలు ఉన్నాయి”--- ” మీరేం శ్రమ తీసుకోవద్దు, నేనే దాన్ని తీసి ఇస్తాను.” ” మీరా ! మీరెలా తీస్తారు, నేలకి చాల ఎత్తులో ఉందది.” ”చూస్తూ ఉండండి ఎలా తీస్తానో,” అంటూ నవ్వుల జల్లు కురిపించి, నందినిని ఆ చెట్టు క్రింద నిలబెట్టి, తాను దాని మీద నిలబడి ఆ కొమ్మ నందుకొని ఉయ్యాల ముళ్లు విప్పసాగింది పార్వతి ఉయ్యాలనీ దాంట్లోని సామాన్లనీ క్రింద పడకుండా పట్టుకొంటూ అడిగాడతను,” మీ పేరేమిటి ?” ”పార్వతి, మరి మీ పేరో”--- ” పశుపతి.” క్రిందకి దిగుతూ అంది పార్వతి.,” పశుపతి గారూ ! మీ సామాన్లన్నీ సరిగా ఉన్నాయా ?”” ” ఉన్నాయి, కొన్ని కాగితాలు తప్ప”— “ దానికి నేనేం చేసేది ! అది మా నందిని పొట్టలో ఉన్నాయి.” ”పోన్లెండి ! కనీసం అక్కడైనా చేరి, అవి పాలిస్తాయి, ఉండి నన్నేం ఉధ్ధరించాలి గనక”— పార్వతి కళ్లు విప్పార్చి అతని వంక చూసింది.’ ఏమిటితను, ఇల్లు వదిలి పారిపోయి వచ్చిన బాపతు కాదు గద !’ అనుకొంది.’అ