(నిన్నటి టపాలో జరిగిన కథ--- మ్యూజియం లోని బొమ్మల అసలు దోంగను పట్టించింది, కావలసిన సాక్ష్యాలు ప్రోగు చేసి తనకి సహకరించినదీ, దానయ్యేనని గ్రహించిన గోపాల్రావు దానయ్య దగ్గరకు వెళ్లి ,ఆ పని చేసినందుకు అతనికి గల లాభమేమిటని ప్రశ్నిస్తాడు. కాని దానయ్య సరిగా జవాబివ్వడు ఏవేవో మాట్లాడుతాడు, దాన్తో టూ.నాట్ త్రీకి అనుమానం వచ్చి, దానయ్య శరీరంలో ఏదో ఆత్మ ప్రవేశించిందని, అదంతా ఆత్మ పలుకేలేనని, ఆత్మతో మాట్లాడించేందుకు , తులశీ దళాలు, మర్రి చిగుళ్లు, వేప మందలూ పట్టుకొచ్చి, మహంకాళి దండకం చదువుతూ, దానయ్యని వేప మందలతో కొట్టి నిజం చెప్పమంటాడు. ఆత్మ తాను ధనంజయ నాయకుణ్నని చెప్తుంది---ఇక చదవండి) మొసలి కొలని మ్యూజియం--32 “ దానయ్య జవాబు విని , ఇనస్పెక్టరు ఆశ్చర్యంతో అతని వంక చూస్తాడు, “ ఏమిటీ ! నువ్వు ధనంజయ నాయకుడివా !” “ అవును, నేనే !” “ మ్యూజియం లోని బొమ్మలను చేసిన ప్రోలయ వేముని కాలం నాటి ధనంజయ నాయకుడివా నువ్వు ?” గోపాల్రావు ప్రశ్నిస్తాడు, కాని దానయ్య మాట్లాడడు. టు నాట్ త్రీ కల్పించుకొని “ ఏయ్ ! చెప్పు, అడిగిందానికి చెప్పు, చెప్పక పోతే తప్పదు ముప్పు” అంటూ వేప మండలతో కొడతాడు. “ అబ్బ ! మర్దించకు ,