Skip to main content

Posts

Showing posts from September, 2010

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 33

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 33 ( దృశ్యము 112 ) ( తొండమాను రాజు తోటలోని విశ్రాంతి గృహము, ముఖ్య ద్వారము . గొలుసులతో కట్టబడి, తాళాలతో బిగింప బడి ఉంటుంది ) ( లోపల బ్రాహ్మణ పత్ని మహాలక్ష్మి, నిండు చూలాలు, ఆమె కొడుకు రాఘవ ఉంటారు ) ( మహాలక్ష్మికి ప్రసవ వేదన మొదలవుతుంది ) మహాలక్ష్మి---- ( బాధతో ) రాఘవా ! నాయనా రాఘవా ! రాఘవ --- ఏంటమ్మా ! ఏమయింది నీకు ? నొప్పిగా ఉందా ? మహాలక్ష్మి--- అవును నాయనా ! నా కడుపు లోపల నీ చెల్లెలు బయటికి రావాలని తొందర పడుతోందిరా ! రాఘవ –అమ్మా, అమ్మా ! మహాలక్ష్మి---- ఏమిటి నాయనా ? రాఘవ --- చెల్లి వస్తుందా అమ్మా ? మహాలక్ష్మి---- అవును నాయనా ! రాఘవ---- ఎలా వస్తుందే ? మహాలక్ష్మి--- ( బాధతో ) నీ చెల్లి కడుపు చీల్చుకొని బయటికి వచ్చేలాగుందిరా ! రాఘవ---- కడుపు ~~ నీ కడుపు ~~చీల్చుకొని వస్తుందా ? అమ్మా, మరి ~ మరి ~ నీకేమీ కాదా ? మహాలక్ష్మి ---రాఘవా ! ఓ పని చెయ్యరా ! రాఘవ --- ఏమిటమ్మా ? మహాలక్ష్మి---ఆ తాడు పట్టుకొని గంట వాయించరా ! రాఘవ --- గంట వాయిస్తే ఏమవుతుందమ్మా ? మహాలక్ష్మి--- అబ్బ ! ప్రశ్నలతో విసిగించకు ! ముందు ~~~ ముందా

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 32

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 32 (దృశ్యము 110 ) ( రాజ వీధిలో కూర్మావధాని భుజం మీద కాశీ కావడితో, నడుస్తూ ఉంటాడు ) ( కావడిలో రెండు బిందెలు గంగా జలంతో నిండి ఉంటాయి ) ( అతనలా నడుస్తూ, రాజభవనం వైపు వస్తూ ఉంటాడు) (తొండమాను రాజు రాజభవనం కిటికీ గుండా అతనిని చూస్తాడు ) తొండమాన--- ( తనలో ) ఆయన కూర్మావధాని గారిలాగ ఉన్నారే ! తీర్థ యాత్రలు పూర్తి అయిపోయి ఉండవచ్చు. ఇతను కాశీకి వెళ్లి చాలా కాలం అయినట్లుంది ! మహాలక్ష్మమ్మగారు ఎలా ఉన్నారో ? ఆవిడ గర్భవతి కూడాను ! ఈ పాటికి సంతానం కలిగే ఉండాలే !? నాతో ఎవరూ ఏమీ చెప్పలేదే !! ( తొండమానుడు, తన ప్రక్కనే ఉన్న గంట వాయిస్తాడు ) ( రణ సింహుడు వస్తాడు ) తొండమాన----- రణసింహా ! అంతఃపుర ఉద్యానవనం చివరి విశ్రాంతి గృహంలో , మహాలక్ష్మమ్మగారు,ఆమె కొడుకు ఉండేవారు కదా ! ఇప్పుడెలా ఉన్నారు ? ఆమెకి సంతానం కలిగే ఉండాలే ! ఎవరు పుట్టారు ? రణ సింహ----- ( గతుక్కుమని ) మహాప్రభూ ! ఆమెను ఆ గృహంలో ఉంచి దాదాపు రెండు ఏళ్లు కావస్తోంది. తొండమాన---- రెండేళ్లా ? అప్పుడే అంత సమయం గడచి పోయిందా ? సరి ! ఇప్పుడామె ఎలాగుంది, సంతానం ఏమయ్యారు ? ఒక కొడుకు, ఇంకెకొకర

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 31

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 31 ( దృశ్యము 107 ) ( తొండమాను రాజు రాణీవాసం ) ( బ్రాహ్మణ స్త్రీ మహాలక్ష్మి , ఆమె అయిదేళ్ల కొడకు రాఘవ , కొంతమంది పరిచారికలు ఉంటారు ) ( మహాలక్ష్మి , ఆ భవనాన్ని, అక్కడున్న వైభవాన్ని, పెద్దపెద్ద కళ్లతో మిర్రి మిర్రి చూస్తుంది. ఆమెకి అంతా కొత్తగా ఉంది. సిగ్గు సంకోచంతో ద్వారం దగ్గరే నిలబడుతుంది. రాఘవ సంగతి సరే సరి ! తల్లి వెనకాల బిక్కు బిక్కుమని చూస్తూ ఉంటాడు ) ౧ పరిచారిక-- రండమ్మా, రండి , లోపలికి రండి. (మహాలక్ష్మి ద్వారం దాటి అడుగు వేయబోతుంది. అక్కడ పరిచి ఉన్న రత్న కంబళం చూసి వెనకడుగు వేస్తుంది. దాని పైన అడుగు పెట్టాలంటే భయం ) ౧ పరిచారిక --- ( నవ్వు ఆపుకొంటూ )-- ఆ రత్న కంబళానికేమీ కాదమ్మా , మీరు లోపలికి రండి. (తక్కిన పరిచారికలు కిసుక్కున నవ్వుతారు. మహాలక్ష్మి ముఖం చిన్నబోతుంది. లోపలికి వస్తుంది, వెనకాలే పిల్లవాడు వస్తాడు ) ౧ పరిచారిక ---కూర్చోండమ్మా ! ( మహాలక్ష్మి ధైర్యం చేసి ఆసనంపైన కూర్చొంటుంది. అది మెత్తగా క్రిందకి దిగుతుంది. గాభరా పడి లేచి, క్రింద కూర్చొంటుంది. పర

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 30

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 30 ( దృశ్యము 106 ) ( తొండమానుని రాజ్య సరిహద్దులలో ఒక చిట్టడవి ) ( అడవి లోని దారిగుండా ఒక రెండెడ్ల బండి, వెళ్తోంది. బండీ నాయుడు బండి నడుపుతున్నాడు ) ( బండిలో కూర్ముడనే బ్రాహ్మణుడు , అతని భార్య మహాలక్ష్మి ,అయిదేళ్ల కొడుకు రాఘవుడు ఉంటారు .మహాలక్ష్మి ఆరునెలల గర్భవతి ) ( బండి క్రింద ఒక ఉట్టి వ్రేలాడుతోంది. ఆ ఉట్టిలో ఒక కుండ , ఆ కుండలో అస్థికలు, కుండమీద మూత ఒక గావంచాతో బిగించి కట్టబడి ఉంది ) ( బండి నెమ్మదిగా వెళ్తోంది ) మహాలక్ష్మి--- కరివేపాకు, వంటకాలు , రుచులు , వీటాన్నిటికీ మీ వ్యాఖ్యానాలు బాగున్నా, ఇంకా ఎక్కడి పశ్న అక్కడే ఉండిపోయింది ! కూర్మ --- ఏమిటి మహాలక్ష్మీ ! నీకు అర్థం కానిది ? మహాలక్ష్మి--- మీ కొండ మీద దేవుడికి కావలసిన కరివేపాకు, వరాలు కోరుకొనే భక్తులు తెచ్చి ఇవ్వాలి ! కాని , పద్మావతి దేవి ఎందుకు తెచ్చి ఇవ్వాలి ? ఆవిడ కోరిన వరం, అతనిని పెళ్లాడడమే ! అది తీరిపోయాక , ఇంక కరివేపాకు తీసి పారెయ్యాలి కదా ? కూర్మ --- మహాలక్ష్మి ! నువ్వీ రోజు మంచి ప

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 29

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 29 ( దృశ్యము 106 ) ( తొండమానుని రాజ్య సరిహద్దులలో ఒక చిట్టడవి ) ( అడవి లోని దారిగుండా ఒక రెండెడ్ల బండి, వెళ్తోంది. బండీ నాయుడు బండి నడుపుతున్నాడు ) ( బండిలో కూర్ముడనే బ్రాహ్మణుడు , అతని భార్య మహాలక్ష్మి ,అయిదేళ్ల కొడుకు రాఘవుడు ఉంటారు .మహాలక్ష్మి ఆరునెలల గర్భవతి ) ( బండి క్రింద ఒక ఉట్టి వ్రేలాడుతోంది. ఆ ఉట్టిలో ఒక కుండ , ఆ కుండలో అస్థికలు, కుండమీద మూత ఒక గావంచాతో బిగించి కట్టబడి ఉంది ) ( బండి నెమ్మదిగా వెళ్తోంది ) నాయుడు--- అయ్యా ! పంతులయ్యా ! కూర్మ --- ఏమిటి నాయుడూ ? నాయుడు ---- మీ పేరేంటయ్యా ? కూర్మ --- నా పేరుతో నీకేం పని ? నాయుడు --- బండి నిచ్చాటు అడవిలో ఒంటరిగా వెళ్తోంది. కబుర్లు చెప్పుకుంటూ పోతే బాగుంటుందని అడిగానయ్యా ! కూర్మ --- ఈ అడవి అంత భయంకరమైనదా ? నాయుడు --- ఇది నిచ్చాటు అడవే అయినా , భయమేమీ లేదయ్యా ! కూర్మ ---- అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు ? నాయుడు --- ఢంకా మీద దెబ్బ కొట్టి చెప్పగలనయ్యా ! ఎందుకంటే , ఇది తొండమాను చక్రవర్తి రాజ్యం ! సరిహద్దుల

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 28

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 28 ( దృశ్యము 104) ( కరివీర పురం దగ్గర సంపెంగ చెట్టు ) ( లక్ష్మి, కపిల ముని ఉంటారు ) కపిల --- తల్లీ ! శ్రీలక్ష్మీ ! విన్నావు కదా ,శ్రీనివాసుని మనోవ్యాకులత, నీవు చెంత లేకున్న, అతడు నిర్నిద్ర చింతయే అగును ! లక్ష్మి ---- మునీంద్రా ! స్వామి అవతార రహస్యము, మీకు తెలియనిది కాదు గదా ? నేను అతని చెంత చేరవలెనన్న, అతడు కర్తవ్యోన్ముఖుడు కావలయును ! కపిల --- ( ఆనందంతో ) తల్లీ ! అటులయిన నీ వాతనికి దూరమయినది ,భృగు మహర్షిపై కినుక వల్లనో, లేక లక్ష్మి --- పద్మావతిపై మాత్సర్యము వల్లనో, అని, భావించారా మునీంద్రా ? కపిల --- అవును తల్లీ ! నీ నాధుడు కూడ అటులనే భావించు చున్నాడు ! లక్ష్మి --- నా స్వామి, యీ లక్ష్మిని , వెనుకటి గృహలక్ష్మి వలెనే , భావించు చున్నాడు ! తపస్సుతో పరిపక్వమై---పునీతమైన మనస్సు గల సామ్రాజ్య లక్ష్మి వలె భావించుట లేదు !--- భృగు మహర్షి నా జనకుడు స్వామి వక్షస్థలమున దాగి , అంతర్ముఖియైన నన్ను, తన కాలియందలి కంటితో, అనితర సాధ్యమైన, అక్షి కుక్షి విద్యతో

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 27

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 27 ( దృశ్యము 103 ) ( అగస్త్యుని ఆశ్రమము ) ( అగస్త్య ముని ధ్యానంలో ఉంటాడు . శ్రీనివాసుడు దిగులుగా కూర్చొని ఉంటాడు. పద్మావతి అతనికి దగ్గరగా వెళ్తుంది ) పద్మావతి --- ప్రభూ ! వేంకటాచలము పైన, మా పినతండ్రి కట్టించిన ఆనంద నిలయము చూసిన వెనుక, మీరు ఆనందముతో తిరిగి వత్తురని తలచితిని ! కాని ఇలా పుట్టెడు దిగులుతో, మరలి వచ్చుట , నాకు మతి తప్పిస్తున్నది ! స్వామీ , యీ మనోవ్యధకు కారణమేమి ? ( ప్రవేశం వకుళా మాత ) వకుళ --- నాయనా ! శ్రీనివాసా ! ఏమిటి నీ వ్యధ ? ( శ్రీనివాసుడు మాట్లాడడు ) పద్మావతి--- అగస్త్య మునీంద్రా ! నాధుడు నాతో తన మనోవ్యధ పంచుకొనుటకు ఇచ్చగింపకున్నాడు ! మీరైన దానిని తెలుసుకొని ----- వకుళ--- అవును మహర్షీ ! కుమారుని మనోవ్యధను తెలుసుకోండి ! ( అగస్త్యుడు శ్రీనివాసుని వంక తేరిపార చూస్తాడు ) అగస్త్య --- శ్రీనివాసా ! ఆలయమును చూసావు కదా ? శ్రీనివాస--- చూసాను మునీంద్రా ! అగస్త్య --- ఆలయము నీవు కోరినట్లు , రెండు గోపురములతో , మూడు ప్రాకారములతో , సప్త ద్వారములతో, ధ్వజ

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 26

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 26 ( దృశ్యము 101 ) ( వేంకటాచలం పైన ఓక చెట్టు నీడ ) ( శ్రీనివాసుడు , బ్రహ్మ, విశ్వకర్మ ఉంటారు ) తొండమాన ---- ప్రభూ ! ఆలయమునంతయు తిరిగి చూసినారు కదా ? మీరు చెప్పినట్లే నిర్మింఫ జేసితిని ! శ్రీనివాస----- తొండమాను రాజా ! ఆలయ నిర్మాణమును యధోక్తముగా చేసి, నన్ను ఆనందింప జేసినావు ! కావున ఈ ఆలయము , ఆనంద నిలయము కాగలదు !! బ్రహ్మ --- తథాస్తు !! జనకా ! నే నీ ఆలయమున రెండు దీపములను ప్రతిష్టింప బూనుకొన్నాను.కలి యుగాంతము వరకు, ఆ దీపముల ఉండవలయును. ఎప్పుడీ ఆలయ విమానము పడిపోవునో , దీపములు నశించును. అప్పటీ వరకు మీ అవతారము భూలోకమున ఉండ వలయునని నా అభిలాష ! శ్రీనివాస --- కుమారా ! అట్లే యగుగాక ! ఆలయ ప్రవేశము తరువాత, ద్వజారోహణతో మొదలయి, రథారోహణతో నంత మగునట్టి, వాహన యుక్తమగు పూజ చేయుము ! బ్రహ్మ --- ఆజ్ఞా ప్రకారము అటులనే చేసెదను ! ( అని విశ్వకర్మతో ) విశ్వకర్మా ! స్వామివారికి విచిత్రమైన వాహనములను , దారు మయమగు ర్థమును చేయుము. అటులనే ఛత్ర చామరములను, వ్యజనములను సమకూర్చుము ! విశ్వకర్

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 25

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 25 ( దృశ్యము 99 ) ( నారాయణ వరం దగ్గర యుద్ధభూమి ) ( శ్రీనివాసుడు, పద్మావతి, అగస్త్యుడు, ఆశ్రమ వాసులు, ఉంటారు ) ( శ్రీనివాసుని మాటలకు పద్మావతి ఏడుస్తూ ఉంటూంది ) ( ప్రవేశం తొండమానుడు. వసుధానుడు యుద్ధ విరామం ప్రకటించి వస్తారు ) ( తొండమానుడు శ్రీనివాసుని గాయాలను చూసి, తల్లడిల్లుతాడు ) తొండమాన --- ప్రభూ ! లోకపాలకా ! మిమ్ములను ఇట్టి దురవస్థ పాలు చేసిన నన్ను క్షమింపకుడు, ఈ క్షణమే నా కుత్తుక వేరు చేయుడు ( వసుధానుడు కూడా దుఃఖంతో శ్రీనివాసుని ముందు మోకరిల్లుతాడు ) వసుధానుడు --- ప్రభూ ! వేంకటేశ్వరా ! ఈ దురవస్థ కంతటికీ కారణం నేను, నా తొందర పాటుతో నా స్వజనానికి ముప్పు కొని తెచ్చుకొన్నాను. ఇక నేనీ యుద్ధము చేయను ! రాజ్యమంతయు నా పిన తండ్రికే ఇచ్చి వేయుడు ! నేను మీ పాద సేవ చేసుకొంటూ కాలం గడుపుతాను శ్రీనివాస --- సరి, సరి ! మీ రిరివురూ యుద్ధ విముఖులైనప్పుడు, ఇక యుద్ధమెవరు చేయదురు ? కాని ఒక విషయము మాత్రము స్పష్టముగా తెలియ వలెను ! ( తొండమానుడు, వసుధానుడు ఇద్దరూ మాట్లాడరు ) అగస్త్య

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 24

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 24 ( దృశ్యము 96) ( నైమిశారణ్యము ) ( సూతుడు ,శౌనకాది ఋషులు ఉంటారు ) సూతుడు ---- ముని పుంగవులారా ! ఆ విధంగా పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణం సుసంపన్న మయినది ! ఆ వివాహ సదస్సులో పాల్గొని , తాంబూలాన్ని అందుకొనే అదృష్టం పొందాను. , శౌనక ---- సూతమహర్షీ ! వీనుల విందైన పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణ గాధ విన్న, మా జన్మలు తరించాయి. ౧ ఋషి -- భవిష్యత్తులో బృహస్పతి చెప్పిన ఆ దోషము, దాని నివారణము ఎలా జరిగాయి ? ౨ ఋషి -- స్వామి లీలా మానుష రూపాన్ని ఎప్పుడు త్యజించారు ? ౩ ఋషి -- స్వామి వల్మీకం , ఆలయంగా ఎలా రూపొందింది ? ౪ ఋషి -- కళ్యాణం జరిగాక లక్ష్మి, వకుళ మాలికలు ఏమయ్యారు ? సూత --- మునులారా ! వినండీ. శ్రీనివాసునితో, పద్మావతీ దేవి పరిణయం జరిగాక, వకుళ మాలిక వేంకటా చలానికి ,లక్శ్మి కరివీర పురానికీ వెళ్లి పోయారు . నవదంపతుల మధ్య ఏకాంతం కల్పించడానికి ! ఆకాశరాజు, ధరణీ దేవి , చీర సారెలతో సాగ నంపాలని ప్రయత్నించారు., కాని స్వామి తనకి కొండ మీద గూడు లేదనీ, అందువల్ల వాటిని తరువాత పంపమనీ చెప

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 23

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 23 ( దృశ్యము 95 ) ( ఆకాశ రాజు మహలు ) ( పద్మావతీ దేవి పెళ్లి కూతురు అలంకరణలో ఒక వెదురు బుట్టలో కూర్చొని ఉంటుంది.) ( ఆమెకి ఎదురుగా ఒక పీఠంపై పార్వతీ దేవి మంగళ చండికా రూపంలో కూర్చొని ఉంటుంది. ఎర్రని చీర, ఎర్రని రవికె, ఎర్రని మందార మాల, ఎర్రని ఆసనము, ఎర్రని అక్షతలు, ఎర్రని కుంకుమ, పసుపు ఉండదు. అంతా ఎరుపు రంగులోతోనే ఉంటుంది ) ( పద్మావతి ,కుంకుమతో పురోహితుడైన బృహస్పతి మంత్రం చదువుతూ ఉండగా, మంగళ చండికా దేవిని పూజిస్తుంది. మంగళ చండికా స్త్రోత్రము---( మూల మంత్రం ) ఓం, హ్రీం,శ్రీం క్లీం సర్వ పూజ్యే దేవీ మగళ చండికే హూంహూం ఫట్ స్వాహా ! ౧ దేవీం షోడశ వర్షీయాం శాశ్వత సుస్థిర యౌవనాం/బింబోష్టీం సుదతీం, శుద్ధాం శరత్ పద్మ నిభాననాం శ్వేత చంపక వర్ణాభాం సునీలోత్పల లోచనాం / జగద్ధాత్రీంచ ధాత్రీంచ సర్వేభ్య స్సర్వ సంపదాం ! సంసార సాగరే ఘోరే జ్యోతి రూపాం సదా భజే ! ౨ రక్ష రక్ష జగన్మాతే, దేవీ మంగళ చండికే / హారికే విపదాం రాశే, హర్ష మంగళ చండీకే ! హర్ష మంగళ దక్షెచ, శు

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 22

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 22 ( దృశ్యము 92 ) ( నైమిశారణ్యము ) (సూతమహర్షి, శౌనకాది ఋషులు ఉంటారు ) శౌనక --- సూత మహర్షీ ! శ్రీనివాసుడు , కుబేరుని కడ ఋణము చేసి, దేవ , ద్విజ , ఋషి సమూహములకు ఇచ్చిన విందు----, ౧ ఋషి ---నభూతో నభవిష్యతి అని చెప్పక తప్పదు ! సూతుడు -- త్రేతాయుగమున , శ్రీ రామ పరివారమునకు భరద్వాజ ఋషి ఇచ్చిన విందు, కలియుగమున శ్రీనివాసుడిచ్చిన విందు మరువ లేనివే అయినను, శ్రీనివాసుని వివాహమునకు తరలి వచ్చిన దేవ బ్రాహ్మణ ఋషి సమూహము, ఆకాశ రాజు రాజ్యమునకు తరలి వెళ్లుటకు ముందు, మార్గ మధ్యమందు , శుకాశ్రమమున శుక మహర్షి ఇచ్చిన విందు కూడ సాటి లేనిదని చెప్పవచ్చును ! ౨ ఋషి -- .ఆశ్చర్యముగ నున్నది ,సూతమహర్షీ ! శుకుడు అదే పెళ్లివారికి, తన ఆశ్రమమున ఆతిథ్యమిచ్చినాడా, అదెట్లు జరిగినది ? సూత --- చెప్పుటకేమున్నది ! ప్రభువు అవతార రహస్యము తెలిసిన వాడు గనుక , శుక మహర్షి అట్టి సాహసమునకు పూనుకొన్నాడు . ౩ ఋషి --- శుక మహర్షి సాఫల్యమొనర్చిన ఆ సాహస కార్యమెట్టిది ? ౪ ఋషి --- మాకు విన కుతూహల మగుచున్నది.!