ప్రేమ అంటే ... మధుర భావన, తీయని అనుభూతి, ఉల్లాసాన్ని కలిగించే స్పందన, ఉత్సాహాన్ని రేకెత్తించే ఆకర్షణ, ఇవన్నీ అందరూ అంగీకరించిన విషయాలే! ప్రేమ అంటే---- గ్రుడ్డిది, మూగది, చెవిటిది, అంటే ఏ ఇంద్రియానుభూతికీ లొంగనిది, అతీంద్రియ శక్తులకి కూడా అందు బాటులో లేని విచిత్రమైన ‘మాయాజాలం’ అని కూడా అనవచ్చు! శ్రీ లలిత వివాహ బంధానికి కట్టుబడి, మర్యాదని అతిక్రమించకుండా, స్వచ్చమైన ప్రేమతో చరణ్’ని ప్రేమించింది. అయినా వంచనకి గురి అయింది! కందళి ప్రేమ- అజ్ఞానం వల్ల, హేమలత ప్రేమ- అమాయకత్వం వల్ల, విలాసిని- ప్రేమ ఈర్ష్య వల్ల, సనక మేనకల ప్రేమ- స్వార్థం వల్ల విఫలమయ్యాయి. అయినా ఈ ప్రేమ మాయాజాలంలో చిక్కిన వాళ్ళు, బయట పడలేక చిక్కుల పాలు అవుతూనే ఉన్నారు! అజ్ఞానం, అమాయకత్వం, ఈర్ష్య, స్వార్థం, ఇలాంటి వన్నీ బలహీనతలు, ఇవన్నీ ఈ మాయా జాలపు ఆకర్షణకి అనుగుణంగా ‘ఆ యా మాయావులకి’ ఎప్పటికీ సహాయం చేస్తూ, వంచనకి గురి చేస్తూనే ఉంటాయి!! శ్రీ లలిత అలాంటి మాయావి యొక్క వంచనని గుర్తించి, దాని నుండి బయట పడేందుకు మనసు దిటవు చేసుకొంది. తన అపూర్వ ప్రేమ ఫలమైన గర్భాన్ని అపురూపంగా చూసుకొని రాజీ పడింది. అంతే కాదు, మంజీరని